నెల్లూరు నగరంలోని 16వ డివిజన్ తెలుగుదేశం పార్టీ మాజీ ఇంచార్జి పెనేటి మల్లికార్జున, ఆయన మిత్రబృందం దాదాపు 150 మంది నగరంలోని ఇస్కాన్ సిటీ నందు గల మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనీల్ కుమార్ గారి సమక్షంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారిని సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. పార్టీలో చేరిన వారిలో పి. నాని, ఎస్.కె. షాను, ఎస్.కె.షఫీ, డి.ప్రవీణ్, కె.చిరంజీవి, కె.బాలు, బి.మణి, ఐ.రూపేష్, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు వేనాటి శ్రీకాంత్ రెడ్డి, బిజివేముల భాస్కర్ రెడ్డి, మెట్టు శశిధర్ రెడ్డి, నవీన్, పద్మనాభరెడ్డి, మణి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
చెరుకు రైతులు మరియు నేతాజీ చెరకు రైతు సంఘం సభ్యులు ఎమ్మెల్యే శ్రీమతి ఆర్కే రోజా గారిని కలిసి విన్నవించడం జరిగింది.
ముఖ్యంగా చిత్తూరు జిల్లా ఇక్కడ చక్కెర ఉత్పత్తిలో ఆంధ్ర రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉండేదని , ఒకప్పుడు 6 చక్కెర కర్మాగారాలు నడుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఒకే ఒక షుగర్ ఫ్యాక్టరీ నడుస్తుందని కావున వీరి చెరకును ఆ ఫ్యాక్టరీ తీసుకోవడం లేదని, కాబట్టి రైతులు, రైతు కూలీలు ఆర్థికంగా నష్టపోతున్నారని ఈ కారణంగా గాజులమండ్యం SV కోపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ తెరిచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
అదేవిధంగా నగరి నియోజకవర్గం నిండ్ర మండలంలోని నేటంస్ షుగర్ ఫ్యాక్టరీ నుంచి 4500 రైతు కుటుంబాలకు రావలసిన బకాయిలు 37.00 కోట్ల రూపాయలు చెల్లించడానికి తగు చర్యలు తీసుకోవాలని మరియు ఇది వరకే ఉత్పత్తి ఉన్నటువంటి మూడు లక్షల టన్నుల చెరకును ప్రస్తుతం నడుస్తున్న SNJ షుగర్ ఫ్యాక్టరీ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
మరియు ఈ జిల్లా చెరుకు రైతుల పండించే చే చెరకు ద్వారా తయారయ్యే చక్కెరను తిరుమల తిరుపతి దేవస్థానం వారు వారి అవసరాలకు తీసుకోవాలని తద్వారా జిల్లాలను చెరుకు రైతులకు తిరుమల తిరుపతి దేవస్థానానికి బెనిఫిట్ జరుగుతుందని తెలిపారు
ఈ సమస్యలను వారందరి తరఫున 11వ తేదీ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై స్ జగన్ మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా పర్యటనలో లో వారి దృష్టికి తీసుకొని వెళ్లి న్యాయం చేయాలని వినతిపత్రం సమర్పించారు
రవి కిరణాలు న్యూస్ తడ:శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారికి శరన్నవరాత్రులు సందర్భంగా కార్యనిర్వహణాధికారి ఆళ్ళ శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణలో చండీయాగం నిర్వహించుట జరిగినది. ఉభయకర్తలుగా శ్రీ అనంతరాజు ఉమామహేశ్వరరావు శ్రీమతి లక్ష్మి సుభద్ర, చెన్నై వారు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు గోగుల తిరుపాలు పాల్గోన్నారు.
రవి కిరణాలు న్యూస్ తడ:శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానo నందు జరుగు నిత్యాన్నదానమునకు శ్రీ మరాంరెడ్డి నరహరి రెడ్డి కుటుంభ సభ్యులు, సర్వరెడ్డి కండ్రిగ(పిండిపాలెం) వారు రూ"1,01,116/-లు డి.డి.ని కార్యనిర్వహణాధికారి ఆళ్ళ శ్రీనివాస రెడ్డి గారికి అందజేయుట జరిగినది.ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు కర్లపూడి మదన్ మోహన్ పాల్గొన్నారు.
కోట పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయ ఆవరణంలో శనివారం జగనన్న ఆసరా కార్యక్రమాన్ని అధికారులు లాంఛనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గూడూరుఎమ్మెల్యే వర ప్రసాద్ రావు ఆర్డీవో మురళీకృష్ణ నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి నల్లపురెడ్డి రాజేందర్రెడ్డి ఎంపీడీవో భవాని ఎమ్మార్వో పద్మావతి ఏపీఎం అంకయ్య మహిళలు పాల్గొన్నారు
వాకాడు... చిట్టమూరు మండల పరిషత్ అధ్యక్షురాలు విజయలక్ష్మి తనయుడు వైకాపా మండల కన్వీనర్, సీనియర్ నేత సన్నా రెడ్డి. శ్రీనివాస రెడ్డి, ఆధ్వర్యంలో చిట్టమూరు మండలం జడ్పిటిసి, ఎంపీటీసీలు, వైకాపా నాయకులు కార్యకర్తలు కోలాహాలంగా తిరుపతి, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు నేదురుమల్లి. రామ్ కుమార్ రెడ్డి కి శాలువా కప్పి పూలమాలవేసి ఘనంగా సత్కరించారు. రాష్ట్ర ఫైనాన్స్ చైర్మన్ మేరిగ. మురళి కి శాలువా కప్పి పూలమాలవేసి సత్కరించారు. ఈ సందర్భంగా నేదురుమల్లి. రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేసి మంచి విజయాన్ని సాధించి పేరు తీసుకు వచ్చినందుకు ఆయన అభినందించారు. పార్టీ లో గెలుపొందిన వారు ప్రజలకు అందుబాటులో ఉండి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలియజేయాలన్నారు. మండల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కొడవలూరు. దామోదర్ రెడ్డి, వాకాడు ఉపసర్పంచ్ పాప రెడ్డి రాజశేఖర్ రెడ్డి, ష నీల్ రెడ్డి, నాగూర్ రెడ్డి, గూడూరు సుధాకర్ రెడ్డి, భార్గవ్ రామ్, వా కాటి రవికుమార్, పాప రెడ్డి. శశి రెడ్డి,చిట్టమూరు మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.