చిత్తూరు జిల్లా ఇక్కడ చక్కెర ఉత్పత్తిలో ఆంధ్ర రాష్ట్రంలోనే అగ్రగామిగా
చెరుకు రైతులు మరియు నేతాజీ చెరకు రైతు సంఘం సభ్యులు ఎమ్మెల్యే శ్రీమతి ఆర్కే రోజా గారిని కలిసి విన్నవించడం జరిగింది.
ముఖ్యంగా చిత్తూరు జిల్లా ఇక్కడ చక్కెర ఉత్పత్తిలో ఆంధ్ర రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉండేదని , ఒకప్పుడు 6 చక్కెర కర్మాగారాలు నడుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఒకే ఒక షుగర్ ఫ్యాక్టరీ నడుస్తుందని కావున వీరి చెరకును ఆ ఫ్యాక్టరీ తీసుకోవడం లేదని, కాబట్టి రైతులు, రైతు కూలీలు ఆర్థికంగా నష్టపోతున్నారని ఈ కారణంగా గాజులమండ్యం SV కోపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ తెరిచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
అదేవిధంగా నగరి నియోజకవర్గం నిండ్ర మండలంలోని నేటంస్ షుగర్ ఫ్యాక్టరీ నుంచి 4500 రైతు కుటుంబాలకు రావలసిన బకాయిలు 37.00 కోట్ల రూపాయలు చెల్లించడానికి తగు చర్యలు తీసుకోవాలని మరియు ఇది వరకే ఉత్పత్తి ఉన్నటువంటి మూడు లక్షల టన్నుల చెరకును ప్రస్తుతం నడుస్తున్న SNJ షుగర్ ఫ్యాక్టరీ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
మరియు ఈ జిల్లా చెరుకు రైతుల పండించే చే చెరకు ద్వారా తయారయ్యే చక్కెరను తిరుమల తిరుపతి దేవస్థానం వారు వారి అవసరాలకు తీసుకోవాలని తద్వారా జిల్లాలను చెరుకు రైతులకు తిరుమల తిరుపతి దేవస్థానానికి బెనిఫిట్ జరుగుతుందని తెలిపారు
ఈ సమస్యలను వారందరి తరఫున 11వ తేదీ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై స్ జగన్ మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా పర్యటనలో లో వారి దృష్టికి తీసుకొని వెళ్లి న్యాయం చేయాలని వినతిపత్రం సమర్పించారు