రవి కిరణాలు న్యూస్ తడ:శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానo నందు జరుగు నిత్యాన్నదానమునకు శ్రీ మరాంరెడ్డి నరహరి రెడ్డి కుటుంభ సభ్యులు, సర్వరెడ్డి కండ్రిగ(పిండిపాలెం) వారు రూ"1,01,116/-లు డి.డి.ని కార్యనిర్వహణాధికారి ఆళ్ళ శ్రీనివాస రెడ్డి గారికి అందజేయుట జరిగినది.ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు కర్లపూడి మదన్ మోహన్ పాల్గొన్నారు.
కోట పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయ ఆవరణంలో శనివారం జగనన్న ఆసరా కార్యక్రమాన్ని అధికారులు లాంఛనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గూడూరుఎమ్మెల్యే వర ప్రసాద్ రావు ఆర్డీవో మురళీకృష్ణ నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి నల్లపురెడ్డి రాజేందర్రెడ్డి ఎంపీడీవో భవాని ఎమ్మార్వో పద్మావతి ఏపీఎం అంకయ్య మహిళలు పాల్గొన్నారు
వాకాడు... చిట్టమూరు మండల పరిషత్ అధ్యక్షురాలు విజయలక్ష్మి తనయుడు వైకాపా మండల కన్వీనర్, సీనియర్ నేత సన్నా రెడ్డి. శ్రీనివాస రెడ్డి, ఆధ్వర్యంలో చిట్టమూరు మండలం జడ్పిటిసి, ఎంపీటీసీలు, వైకాపా నాయకులు కార్యకర్తలు కోలాహాలంగా తిరుపతి, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు నేదురుమల్లి. రామ్ కుమార్ రెడ్డి కి శాలువా కప్పి పూలమాలవేసి ఘనంగా సత్కరించారు. రాష్ట్ర ఫైనాన్స్ చైర్మన్ మేరిగ. మురళి కి శాలువా కప్పి పూలమాలవేసి సత్కరించారు. ఈ సందర్భంగా నేదురుమల్లి. రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేసి మంచి విజయాన్ని సాధించి పేరు తీసుకు వచ్చినందుకు ఆయన అభినందించారు. పార్టీ లో గెలుపొందిన వారు ప్రజలకు అందుబాటులో ఉండి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలియజేయాలన్నారు. మండల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కొడవలూరు. దామోదర్ రెడ్డి, వాకాడు ఉపసర్పంచ్ పాప రెడ్డి రాజశేఖర్ రెడ్డి, ష నీల్ రెడ్డి, నాగూర్ రెడ్డి, గూడూరు సుధాకర్ రెడ్డి, భార్గవ్ రామ్, వా కాటి రవికుమార్, పాప రెడ్డి. శశి రెడ్డి,చిట్టమూరు మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
రెండో విడత వైయస్సార్ ఆసరా పథకంలో భాగంగా నెల్లూరు నగరంలోని విజయమహల్ గేట్ సమీపంలో గల ఎం.సి.ఆర్. కళ్యాణ మండపంలో లబ్దిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్వయం సహాయక గ్రూప్ సభ్యులకు రూ.17.44 కోట్ల చెక్కును జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు గారితో కలిసి పంపిణీ చేసారు. వైయస్సార్ ఆసరా పథకంలో భాగంగా జిల్లాలో వేలాది మందికి లబ్ధి చేకూరుతుందనన్నారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి. యువజన విభాగం జిల్లా అధ్యక్షులు పి. రూప్ కుమార్ యాదవ్, ఏ.పి. ఆగ్రో డెవలప్ మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొణిదల సుధీర్, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.
శ్రీసిటీని సందర్శించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు
రవి కిరణాలు న్యూస్ తడ (శ్రీసిటీ) : కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా, ఐఏఎస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్, ఐఏఎస్, శనివారం విడివిడిగా శ్రీసిటీని సందర్శించారు.
దుర్గా శంకర్ మిశ్రాకు శ్రీసిటీ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) సతీష్ కామత్ సాదర స్వాగతం పలికి, శ్రీసిటీ ప్రత్యేకతలు, ప్రగతి మరియు ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధిపై దాని ప్రభావం గురించి ఆయనకు వివరించారు. అనంతరం శ్రీసిటీ పరిసరాలను మిశ్రా సందర్శించారు మరియు కొన్ని పరిశ్రమలకు వెళ్ళి అక్కడ ఉత్పత్తులను, ఇతర పనులను పరిశీలించారు. విశాల స్థలం, మంచి మౌళిక సదుపాయాలు మరియు పారిశ్రామిక అభివృద్ధి పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, భారీ ఇంటిగ్రేటెడ్ బిజినెస్ సిటీని అభివృద్ధి చేయడంలో శ్రీసిటీ యాజమాన్యం చేపట్టిన కార్యక్రమాలను ప్రశంసించారు.
శ్రీసిటీకి విచ్చేసిన పోలా భాస్కర్ కు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఘనస్వాగతం పలికారు. తన పర్యటనలో భాగంగా ఆయన క్రియా యూనివర్సిటీని సందర్శించారు. క్రియా వైస్ ఛాన్సలర్ డాక్టర్ మహేశ్ రంగరాజన్, గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మరియు స్కూల్ ఆఫ్ ఇంటర్‌వూవెన్ ఆర్ట్స్ & సైన్సెస్ విభాగాల ముఖ్య అధ్యాపకులతో ఆయన చర్చించారు. క్రియా విద్యావిధానం, పాఠ్యాంశాల గురించి వివరించిన వైస్ ఛాన్సలర్, కళలు శాస్త్రాలను మిళితం చేసిన ఒక ప్రత్యేకమైన ‘ఇంటర్‌వొవెన్ లెర్నింగ్’ విధానం విద్యార్థులకు అన్వేషణ శక్తిని, సబ్జెక్టులపై ఆసక్తిని పెంచుతుందన్నారు.
క్రియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు కృతజ్ఞతలు తెలిపిన పోలా భాస్కర్, ఉన్నత విద్యలో భిన్నమైన విధానాన్ని తీసుకువచ్చినందుకు యూనివర్సిటీ బృందాన్ని ప్రశంసించారు - ఇంటర్‌వూవెన్ లెర్నింగ్ ద్వారా ఆలోచనలు, కళలు, విజ్ఞానాలతో గతాన్ని నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తు కోసం విద్యార్థులను సంసిద్దులను చేస్తుందన్నారు.
వార్డు నెంబర్లకు శిక్షణ తరగతులు.... వాకాడు... మండల పరిధిలోని 19 గ్రామ పంచాయతీలకు చెందిన వార్డు మెంబర్లకు శుక్రవారం శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సొసైటీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి హాజరై ఈ శిక్షణ వార్డు మెంబర్లకు ఎంతో ఉపయోగ పడుతుంది అన్నారు. శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.