శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారికి శరన్నవరాత్రులు సందర్భంగా రెండవ రోజు శ్రీ అమ్మవారికి చైర్మన్ దువ్వూరు బాలచంద్రా రెడ్డి సమక్షంలో కార్యనిర్వహణాధికారి ఆళ్ళ శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణలో శ్రీ బాలత్రిపురసుందరి అలంకారం చేయుట జరిగినది. అలంకారం ఉభయకర్తలుగా శ్రీసిటి మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ రవిసన్నారెడ్డి శ్రీమతి మమత దంపతులు వ్యహరించినారు. ఈ కార్యక్రమంలో కళత్తూరు రామ మోహన్ రెడ్డి, కళత్తూరు శేఖర్ రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు కర్లపూడి మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు నగర, రూరల్ నియోజకవర్గాలలోని అల్లీపురం నందు మురుగునీటి శుద్ధి కర్మాగారం, జనార్ధన్ రెడ్డి కాలనీలో టిడ్కో గృహాలు పొందిన లబ్దిదారులచే గృహప్రవేశం, పొగతోట ఎస్2 హాల్ వద్ద ఆధునిక మరుగుదొడ్ల ప్రారంభ కార్యక్రమం, శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి వారి పుష్కరిణి పుననిర్మాణ కార్యక్రమం, నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణం నందు కమాండ్ కంట్రోల్ సెంటర్ మరియు కమిషనర్ నగరపాలక సంస్థ వారి క్యాంపు ఆఫీస్ మరియు నివాస భవన నిర్మాణానికి శంకుస్థాపన, సఫాయి మిత్రలకు వాహనాల పంపిణీ కార్యక్రమాలలో రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి డాక్టర్ పి.అనీల్ కుమార్ గారు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారితో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్, స్వచ్చ కార్పొరేషన్ చైర్మన్ పానకా దేవసేనమ్మ, తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ జాతీయ కార్యాలయంలో నీరు – చెట్టు ఫిర్యాదుల విభాగం ప్రారంభం
బాధితులకు ఆఖరి రూపాయి అందే వరకు ఈ విభాగం కృషి చేస్తుంది
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నీరు – చెట్టు పథకం పెండింగ్ బిల్లులకు సంబంధించిన బాధితుల ఫిర్యాదుల విభాగాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా నీరు – చెట్టు పథకం కింద చేపట్టిన పనులకు సంబంధించి రూ.1,277 కోట్లు సీఎఫ్ఎంఎస్ లో టోకెన్ పడి పెండింగ్ లో ఉన్నాయి. ఇవి కాక మరో రూ.500 కోట్ల వరకు జనరేట్ కాని బిల్లులు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో దేశంలోని తొలిసారిగా నీరు – ప్రగతి కింద చిన్న నీటి పారుదల, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల నుంచి రూ.18,265 కోట్లు ఖర్చు పెట్టి చెరువులు, కాలువల పూడికతీత, పంట కుంటల నిర్మాణం, చెక్ డ్యాంలు, గొలుసుకట్టు చెరువులు తదితర నీటి సంరక్షణ చర్యలు చేయడం వలన 98 కోట్ల ఘనపు మీటర్ల పూడిక మట్టిని తొలగించడం వలన 90 టీఎంసీలు భూగర్భ జలాలుగా మార్చబడి రాష్ట్ర వ్యాప్తంగా 6.795 లక్షల ఎకరాల ఆయకట్టు అదనంగా స్థిరీకరించబడింది. అప్పటి ప్రభుత్వానికి దీని వలన 9 మెరిట్ స్కాచ్ అవార్డులు వచ్చాయి. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా సన్న, చిన్న కారు రైతులు నీటి సంఘాల ప్రతినిధులు చేసిన పనులను నిలిపివేయడం వలన పనులు చేసిన వాళ్లు అప్పులు పాలయ్యి రోడ్డున పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా నీరు - చెట్టు బిల్లులకు సంబంధించిన ఫిర్యాదు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ ఫిర్యాదుల విభాగం పరిష్కారానికి తోడ్పడుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా నీరు - చెట్టులో పని చేసిన ప్రతి ఒక్కరికి ఆఖరి రూపాయి అందే వరకు ఈ విభాగం పని చేస్తుందని, పనులు చేసి బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న వారు 9848151300, 8074090252, 9848153588, 9849393194 నెంబర్లతో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని నారా చంద్రబాబు నాయుడు హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదారవిచంద్ర యాదవ్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రేపల్లే శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు కూన రవికుమార్, బీసీ జనార్ధన్ రెడ్డి, రాష్ట్ర సాగు నీటి సంఘాల వినియోగదారుల సమాఖ్య అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు, మాజీ ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ మైనేని మురళీ కృష్ణ, తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్రా నరేంద్ర, నీరు – చెట్టు రాష్ట్ర కో – ఆర్డినేషన్ కమిటీ సభ్యులు కవులూరి రాజా, చెన్నుపాటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు నగరంలోని మూలపేట నందు గల శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ స్వామి అమ్మవార్ల ఊంజల్ సేవ నూతన రాతి మండప నిర్మాణానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనీల్ కుమార్ గారు శంఖుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి. యువజన విభాగం జిల్లా అధ్యక్షులు పి. రూప్ కుమార్ యాదవ్, నాయకులు గోగుల నాగరాజు, శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి ఆలయ చైర్మన్ లోకిరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని దర్గామిట్ట లోని అంబేద్కర్ భవన్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని, బారాషాహీద్ దర్గా అభివృద్ధికి నిధులు కేటాయించాలని, నెల్లూరు రూరల్ లో షాదీ మంజిల్, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని, రూరల్ నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి మంచినీటి పధకం కోసం ద్వంసమైన రోడ్లు పునర్నిర్మించాలని, ఇది కాకుండా రూరల్ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్ల నిర్మాణం కోసం 50 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని మునిసిపల్ శాఖామంత్రి బొత్సా సత్యనారాయణ గారిని ప్రత్యేకంగా కోరిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
రెండు నెలలో ద్వంసమైన రోడ్లను పునర్నిర్మిస్తామని, మిగిలిన పనులకు కూడా నా వంతు సహకారం అందిస్తానని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి హామీ ఇచ్చిన మునిసిపల్ శాఖామంత్రి బొత్సా సత్యనారాయణ గారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం, ప్రజల పక్షాన ఎంతటి పోరాటానికైనా సిద్ధమని అన్నారు.
శ్రీసిటీలో మరో ఏసీ పరిశ్రమకు భూమిపూజ
రవి కిరణాలు న్యూస్ తడ:
రూమ్ ఎయిర్ కండీషనర్లు, విడిభాగాల తయారీలో పేరుగాంచిన యాంబర్ ఎంటర్‌ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ సంస్థ శుక్రవారం శ్రీసిటీలో తన నూతన పరిశ్రమ నిర్మాణానికి భూమిపూజ చేసింది.
ఈ సంస్థకు ఇది దేశంలో 15 వ ప్లాంట్ కాగా, దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిది. ఈ పరిశ్రమలో ప్రధానంగా ఏసీలు, ఏసీ విడిభాగాలు ఉత్పత్తి చేసి, దేశంలోని 20కు పైగా ప్రముఖ ఏసీ కంపెనీలకు సరఫరా చేయనున్నారు. డైకిన్, బ్లూస్టార్, యాంబర్ వంటి వరుస ఏసీ కంపెనీలతో ఏసీల తయారీ రంగంలో శ్రీసిటీలో సరికొత్త వ్యాపారానుకూల వ్యవస్థ రూపుదిద్దుకుంటూ మరిన్ని కంపెనీలను ఆకర్షిస్తోంది. నూతన ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది.
కాగా, శ్రీసిటీకి గత నెల రోజులు ఎంతో విశిష్టత సంతరించుకున్న కాలంగా పేర్కొనవచ్చు. మూడు వారాల క్రితం EPCES నుండి 2020-2021 కొరకు 'డెవలపర్స్ స్పెషల్ అచీవ్‌మెంట్ అవార్డు' శ్రీసిటీకి దక్కగా, మూడు రోజుల క్రితం ఇండస్ట్రీ మరియు ఇంటర్నల్ ట్రేడ్ ప్రమోషన్ డిపార్ట్‌మెంట్ (DPIIT) వారి ఇండస్ట్రీయల్ పార్క్ రేటింగ్ సిస్టమ్ 2.0 (IPRS) లో దేశంలోని 349 ఇండస్ట్రియల్ పార్కులు & సెజ్‌లలో లీడర్ గా శ్రీసిటీ ర్యాంక్ కైవసం చేసుకోవడం విశేషం.