శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో..ఆఖరి ఘట్టం నిష్క్రమణం..అమ్మవారికి హారతి ఇచ్చి రథాన్ని ప్రారంభించిన.. మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు
(వెంకటగిరి,తేదీ 30 సెప్టెంబర్ 2021)
వెనక బడిన వర్గాలకు చెందిన కులసంగాలు తో సమీక్ష సమావేశం
నెల్లూరు జిల్లా వెనక బడిన వర్గాలకు చెందిన కులసంగాలు తో సమీక్ష సమావేశం లో పాలగున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట వెనకబడిన తరగతుల శాసన సభ కమిటీ చైర్మన్ శ్రీ జంగా కృష్ణమూర్తి గారు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు గారు మరియు అసర జాయింట్ కలెక్టర్ రోజుమోండ్ గారు జిల్లా DLDA చైర్మన్ గొల్లపల్లి విజయ కుమార్ గారు మరియు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటయ్య garu
బెంగళూరు
విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు కొంతమంది నానా ఎత్తుగడలు వేస్తున్నారు.
అయితే.. అధికారుల కూడా అంతే అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా.. విమానంలోని సీటు కింద బంగారాన్ని దాచి, అక్రమంగా తరలించాలని యత్నించాడు ఓ వ్యక్తి. అయితే.. బెంగళూరు కస్టమ్స్ అధికారులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.61 లక్షలుగా ఉంటుందని చెప్పారు.దుబాయ్ నుంచి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇండిగో విమానం.. గురువారం చేరుకుంది. ప్రయాణికులంతా దిగాక.. విమానాన్ని తనిఖీ చేస్తుండగా ఈ బంగారం బయటపడింది. ఎకానమీ క్లాస్‌లోని ఓ సీటుకు ప్యాకెట్ ఉండడాన్ని అధికారులు గుర్తించారు. అందులో చూస్తే.. పేస్ట్ రూపంలో, 29 స్టిక్స్ రూపంలో 701 గ్రాముల బంగారం బయటపడింది. దీనిపై కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు యత్నించిన నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. ప్రయాణికుల జాబితాను అధికారులు పరిశీలిస్తున్నారు.
మోటార్ సైకిల్ ఢీకొన్న మినీ వ్యాన్.
గాలి వంశి రెడ్డి దుర్మరణం. ఆర గంట క్రితం ప్రమాదం.
కట్టువ పల్లి గాడి బావి వద్ద ఘటన....
కట్టువ పల్లి మనుబోలు.. మండలంలోని బద్ది వోలు కట్టువ పల్లి మధ్యలో గాడిద వద్ద గురువారం సాయంత్రం మోటార్ సైకిల్ ను టాటా ఏసీ మినీ వ్యాన్ ఢీకొ.o ది. ఈ ప్రమాదంలో పిడూ రు పాలెం గ్రామానికి చెందిన గాలి వంశీధర్ రెడ్డి దుర్మరణం చెందినట్లు సమాచారం మినీ వ్యాన్ డ్రైవర్ పీకల్లోతు మద్యం సేవించి వాహనం నడిపి ఎదురుగా వస్తున్న మోటార్సైకిల్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు
శ్రీసిటీని సందర్శించిన వివేకానంద కేంద్రం ప్రెసిడెంట్
రవి కిరణాలు న్యూస్ తడ (శ్రీసిటీ) :
కన్యాకుమారిలోని వివేకానంద కేంద్రం ప్రెసిడెంట్ ఎ.బాలకృష్ణన్ గురువారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికి, శ్రీసిటీ ప్రగతి, ప్రత్యేకతలు, వెనుకబడిన ఈ ప్రాంతంలో శ్రీసిటీ ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు.
అనంతరం శ్రీసిటీ పరిశ్రమల ప్రతినిధుల పరస్పర చర్చా కార్యక్రమంలో బాలకృష్ణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివేకానంద బోధనలు, భారత జాతి నిర్మాణానికి ఆయన ఆలోచనల తీరును వివరించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పారిశ్రామికవేత్తలు, సాధారణ వ్యక్తులు మరే ఇతర వృత్తుల వారైనా, మన అందరికీ స్వామి వివేకానంద ఒక ప్రేరణ మరియు స్ఫూర్తిదాత అని అభివర్ణించారు. ఆయన తన పూర్తి జీవితాన్ని ఉత్తమ పౌరులను తయారు చేయడానికి, తద్వారా భారతదేశం గతం కంటే ఉన్నత స్థితికి చేరడంపై దృష్టి పెట్టారని చెప్పారు.
భారతదేశ స్వావలంబనపై వివేకానంద ఆలోచనలను వివరించిన బాలకృష్ణన్, స్వావలంబనే మన లక్ష్యంగా స్వామి వివేకానంద బోధనలు చేశారన్నారు. మన మార్గాలు, పద్ధతులు, ప్రక్రియలు, విధానాలు, చర్యలు వేరైనా, మన ప్రధాన లక్ష్యం మాత్రం దేశ స్వావలంబన కావాలని పిలుపునిచ్చారు. పరిశ్రమ ప్రతినిధులందరూ కష్టపడి పనిచేసి తమ ప్రయత్నాలలో విజయం సాధించాలని విజ్ఞప్తి చేశారు.
శ్రీసిటీని సందర్శించి, విలువైన సందేశాన్ని అందించినందులకు బాలకృష్ణన్ కు శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. స్వామి వివేకానంద బోధనల మార్గంలోనే శ్రీసిటీ ఇతర పరిశ్రమల సహకారంతో విద్య, వైద్యం, భారీ ఉపాధి కల్పన తదితర సేవా కార్యక్రమాలు చేపడుతూ సమాజానికి తమ వంతుగా తిరిగి ఇస్తున్నందుకు సంతోషిస్తున్నామని అని అన్నారు.
కాగా, మానవ సేవే మాధవ సేవ అన్న గొప్ప ఆలోచనతో పనిచేసే వివేకానంద కేంద్రాలు, దేశ భక్తి, సేవా కార్యక్రమాలకు పెద్దపీట వేస్తుంది. స్వామి వివేకానంద మార్గదర్శకత్వంలో భారత జాతి నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా 850 శాఖలు, కార్యాచరణ కేంద్రాలతో వివేకానంద కేంద్రం పనిచేస్తున్నాయి. తమ లక్ష్యాలను సాధించడానికి యోగా, స్టడీ సర్కిల్స్, గ్రామీణాభివృద్ధి, విద్య మరియు యువత మహిళలకు స్వామి వివేకానంద జీవితం, భారతీయ సంస్కృతి, వేద అధ్యయనాలు బోధించడం తదితర వివిధ సేవా కార్యక్రమాలను ఈ కేంద్రాలలో నిర్వహిస్తారు.
నెల్లూరు జిల్లా,
గూడూరు టౌన్ ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా గూడూరు నందు ఈరోజు #30.9..2021వ తేదిన గురువారం ఉదయం 11 గంటలకు వరద నగర్ ST కాలనీ నందు #కీర్తిశేషులు శ్రీ పొనకా ఆది శేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు అయిన శ్రీ పొనకా మల్లికార్జున్ రెడ్డి గారి సంపూర్ణ సహాయ సహకారాలతో ప్రతి నెల అతి నిరుపేదలైన 15 కుటుంబాలకు నెల మొత్తానికి సరిపడే 18 రకాల ఫల సరుకులను బహుకరించడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా 1వ పట్టణ SI శ్రీ పవన్ కుమార్, చేతులమీదుగా ఫలసరుకులను పంపిణీ చేయడమైనది.అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్,మన ప్రగతి కుటుంబ సభ్యులు వాకాటి రాంమోహనరావు, PD కరీముల్లా, గ్రానైట్ ప్రభాకర్, KRM, ఆక్వా రమేష్, కోఆర్డినేటర్ CVR న్యూస్ సతీష్, వాలంటీర్ భూమిక తదితరులు పాల్గొన్నారు