నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని క్రొత్త 24వ డివిజన్, కల్లూరు పల్లి, ఇందిరమ్మ కాలనీ, హౌసింగ్ బోర్డ్, ప్రాంతాలలో 14వ రోజు నేను - నా కార్యకర్త కార్యక్రమాన్ని ప్రారంభించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
24వ డివిజన్, కల్లూరు పల్లి లోని ఎస్.కె సత్తార్ అనే కార్యకర్త ఇంటి నుంచి నేను - నా కార్యకర్త కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నెల్లూరు జిల్లా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ & ఇంధన శాఖామంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి గౌరవ శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నెల్లూరుకు విచ్చేసిన సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసిన SPS నెల్లూరు జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు, IPS., గారు....... అనంతరం కొద్ది సేపు జిల్లాలోని పలు విషయాలపై ఇరువురు చర్చించారు..
DG గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు..
వెల్ఫేర్ డే సందర్భంగా భద్రత లోనుల పరిమితిని పెంచిన గౌరవ DG గారు.. పోలీసుల సంక్షేమమే నా ప్రధమ కర్తవ్యం... మనమంతా ఒకే కుటుంబం.. ప్రతి జిల్లాలో సిబ్బంది సంక్షేమం కొరకు వారానికి ఒక రోజును కేటాయించాలని ఆదేశం.. కోవిడ్ ను ఎలా ఎదుర్కోవాలో తెలియని సమయంలో కింది స్థాయి నుండి ఉన్నతాధికారి వరకు రోడ్లపై నిలబడి సమాజ సేవ చేసారు.. వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు.. కోవిడ్ కారణంగా మరణించిన పోలీసుల సేవలు చిరస్మరణీయం.. కమిటీ నిర్ణయం మేరకు లోనులు పరిమితి పెంచి, వడ్డీ రేట్లను తగ్గించడం జరిగింది.. DG గారు.. భద్రతలో పర్సనల్, మ్యారేజ్, ఎడుకేషనల్ తదితర అన్ని లోనులు పరిమితి పెంచాం.. వినియోగించుకోండి..
తేది.29.09.2021 న రాష్ట్ర డిజిపి గౌరవ శ్రీ గౌతమ్ సవాంగ్ ఐపిఎస్ గారు భద్రత లోనుల పరిమితిని పెంచడం, వడ్డీ రేట్లను తగ్గింపుపై రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల యొక్క యస్.పి.లతో, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరవ DG గారు మాట్లాడతూ రాష్ట్ర పోలీసుల సంక్షేమంలో భాగంగా భద్రత స్కీం ద్వారా పోలీసులకు ఇచ్చే రుణాల మొత్తాన్ని పెంచడం... ఆ రుణాలకు వడ్డీ ధరలు తగ్గించడంపై చర్చ సాగింది. త్వరలో దీన్ని అమలు పరచనున్నట్లు డిజిపి గారు వెల్లడించారు. భద్రత మరియు ఆరోగ్య భద్రత క్రింద తీసుకొనివచ్చిన నూతన పాలసీలు, ప్రస్తుతం అమలులో ఉన్న గృహ, విద్య, వ్యక్తిగత రుణాల పరిమితి పెంచడం తదితర అంశాలపై యూనిట్ అధికారులతో చర్చించారు. అదేవిధంగా వారంలో ఒక రోజు “వెల్ఫేర్ డే” గా పాటించాలని, తద్వారా పోలీసు సిబ్బంది యొక్క సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని, కోవిడ్ సంబంధిత సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టాలని జిల్లా యూనిట్ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యస.పి. గారితో పాటు అడిషనల్ యస్.పి.(అడ్మిన్) శ్రీమతి వెంకటరత్నం, యస్.బి. డి.యస్.పి. శ్రీ కోటా రెడ్డి, SB CI-1 శ్రీ అక్కేశ్వరరావు, CI-2 శ్రీ రామకృష్ణ, DPO AO, పి.సూపరింటెండెంట్, DPO సిబ్బంది, పోలీసు అసోసియేషన్ సభ్యులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ రొజు కావలి బార్ అసోసియేషన్ లో కావలి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారైన శ్రీమతి ఎస్ శైలజగారు ఆదోని సబ్ కోర్టుకు సీనియర్ సివిల్ జడ్జి గా ప్రమోషన్ పొందినందుకు గాను వారికి కావలి బార్ అసోసియేషన్ సభ్యులు సన్మానం చేయడం జరిగినది. ఈ కార్యక్రమమునకు కావలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు కాటా సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ శ్రీమతి శైలజ గారు ఒక మధ్య తరగతి కుటుంబం లో జన్మించి ఎంతో కష్టపడి చదివి ఒక న్యాయమూర్తి గా ఉన్నతమైన పదవిని అలకరించారు., వారు అనేక మంచి మంచి తీర్పులను ఇచ్చారు. అలాగే వారు ఇంకా ఉన్నతమైన పదవులను అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుతూ, వీరిని ఆదర్శంగా తీసుకొని ప్రతి మహిళా న్యాయవాది కూడా న్యాయమూర్తిగా పదవులు పొందాలని తెలియజేసారు. అలాగే మిగతా న్యాయవాదులు కూడా మాట్లాడుతూ వీరు న్యాయ వ్యవస్థ కు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమమునకు కావలి సీనియర్ సివిల్ జడ్జి శ్రీ పీ. పాండు రంగారెడ్డి గారు, స్పెషల్ మేజిస్ట్రేట్ పరుసురాం గారు, కావలి బార్ అసోసియేషన్ సెక్రటరీ ఆర్. నాగేంద్రబాబు గారు, జాయింట్ సెక్రటరీ కె. బాలాజీ గారు, వైస్ ప్రెసిడెంట్ జయప్రకాష్ గారు మరియు న్యాయవాదులు గద్దె మాల్యాద్రి గారు, ఏ. ప్రసాద్ రెడ్డి గారు, కొమరా చక్రపాణి గారు, కలీం అహ్మద్ రోజ్ దార్ గారు, డి. వేణు గోపాల్ రెడ్డి గారు, పువ్వాడ ప్రసాద్ గారు, జి. రాజేంద్ర వరప్రసాద్ గారు, కెన్నడి గారు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా
సోమశిల జలాశయం విద్యుత్ దీపాలతో మిరుమిట్లు గోలుపుతుంది
జిల్లా వరప్రసాధిని అయిన సోమశిల ప్రాజెక్టు విద్యుత్ కాంతులతో మిరుమిట్లు గోలుపుతుంది.గతంలో అధికారులు కాంట్రాక్టర్ల చేత విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా పనులు చేపట్టేవారు.ఈ నేపథ్యంలో క్రొత్త గా వచ్చిన ప్రాజెక్టు ఈ ఈ ధనుంజయ్ ,డి.ఈ మహేశ్వర రెడ్డి ప్రాజెక్టు లోని విద్యుత్ దీపాలకు టెండర్లు పిలిపించడం జరిగింది. అయితే ఈ టెండర్ ను ప్రముఖ కాంట్రాక్టర్ల ,వై.సి.పి.నాయకులు ఎద్దల శ్రీనివాసులు రెడ్డి దక్కించుకున్నారు. ప్రాజెక్టు అధికారులు ఈ ఈ ,డి.ఈ శ్రద్ధతో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. కాంట్రాక్టర్ ,వై.సి.పి.నాయకులు ఎద్దల శ్రీనివాసులు రెడ్డి పనితీరు భేష్ అని పలువురు కొనియాడారు. చాలా కాలం తర్వాత సోమశిల జలాశయం విద్యుత్ దీపాల తో మిరుమిట్లు గోలుపు తుంటే జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పోలీస్ వెల్ఫేర్ డే సందర్భంగా మృతుల కుటుంబాలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన జిల్లా యస్.పి.
పోలీస్ వెల్ఫేర్ డే సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అమరులైన 26 పోలీస్ కుటుంబాలు యొక్క కుటుబం సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం.
ప్రతి ఒక్కరితో పేరు పేరునా కుటుంబ వివరాలు.....జీవనాధారం....సమస్యలు.......తదితర వివరాలపై ఆరా నేను మీ ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటా....ఎల్లవేళలా అందుబాటులో ఉంటా... ఎటువంటి సమస్య అయినా కలవండి. విధి నిర్వహణలో కరోనాతో ఎదుర్కోవడంలో ప్రాణత్యాగం చేసిన వారి కుటుంబాలు ఒంటరి వారు కాదు.. పోలీసు శాఖ తోడుగా ఉంటుంది. ప్రభుత్వ, ప్రభుత్వేతర బెనిఫిట్స్ అన్నీ అందేలా చూడాలని ఆదేశించిన యస్.పి. గారు కంపాన్ సేషన్ అప్పాయింట్మెంట్ కు సంబంధించిన సందేహాలకు విపులంగా వివరణ ఇచ్చిన జిల్లా యస్.పి.గారు. అడిషనల్ యస్.పి. గారి చొరవ తో మన రాష్ట్రంలోనే అత్యధికంగా కంపాన్ సేషన్ పోస్టులు ఇచ్చిన జిల్లా గా మన నెల్లూరు జిల్లా రికార్డు నమోదు చేసుకొంది. అనంతరం పోలీసు కుటుంబాలకు రుచికరమైన భోజనాలు స్వయంగా అందరికీ వడ్డించిన యస్.పి. ఎంతో చొరవ తీసుకొని అన్ని బెనిఫిట్స్ అందించినందుకు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబసభ్యులు..
ఈ రోజు అనగా తేది.29.09.2021 న ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు పోలీస్ వెల్ఫేర్ డే సందర్భంగా SPS నెల్లూరు జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు "అమరులైన పోలీస్ అధికారులు మరియు సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమమును" ఏర్పాటు చేసి, తన ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా దేశ భద్రత కోస౦, ప్రజా శా౦తి భద్రతల రక్షణ కోస౦, పగలనక, రాత్రనక నెల్లూరు జిల్లాలో విధులు నిర్వహిస్తూ ఎ౦తోమ౦ది తమ ప్రాణాలను తృణప్రాయ౦గా త్యాగ౦ చేశారు. అట్టి వారి త్యాగాలను స్మరి౦చుకు౦టూ వారి త్యాగాల పరమార్థాన్ని గుర్తి౦చి, ప్రతి ఒక్కరినీ పరామర్శించి, వారి కుటుంబ పరిస్థితులు, ఆరోగ్య విషయాలపై విచారించి, చర్చించి వారికి పోలీస్ శాఖ ఎల్లవేళలా తోడు వుంటుందని, ఇంటిలో పెద్ద దిక్కు కోల్పోయినా అందరికి జిల్లా యస్.పి గానే కాకుండా మీ కుటుంబ సభ్యుడుగా ఉండి మీకు ఏ సమయములోనైనా ఏ సహాయము చేయడానికైనా మనస్పూర్తిగా సిద్దంగా ఉన్నానని భరోసా కల్పించారు. వారు లేని లోటుతో బాధపడుతున్న కుటుంబసభ్యులను ఓదార్చి, మీ కన్నీళ్లు తుడవడానికి జిల్లా పోలీసు యంత్రాంగం మీవెనుక ఉందని అధైర్య పడవద్దని, భరోసా కల్పించారు. అంతేకాకుండా మేము మీకు వున్నాము అనే ఒక నమ్మకాన్ని కల్పించి ,మీకు డిపార్ట్మెంట్ చేయగలిగిన సహాయ సహకారాలు త్వరితగతిన అందిస్తామని హృదయపూర్వకంగా మనవి చేస్తున్నామని జిల్లా యస్. పి. శ్రీ విజయ రావు,IPS., గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరితో పేరు పేరునా వారికి రావాల్సిన బెనిఫిట్స్ గురించి అడిగి తెలుసుకొని, వెంటనే వచ్చేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని, ఇతర ఏమైనా సందేహాలు ఉంటే అడగాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా అమరులైన 15 పోలీసు అధికారుల కుటుంబాల నుండి 28 మంది ,అదే విధంగా 5 హోం గార్డ్ కుటుంబాల నుండి 10 మంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అడిషనల్ యస్.పి. గారి చొరవ తో ఇప్పటివరకు జిల్లా లో 12 కంపాన్ సేషన్ అప్పాయింట్మెంట్ లు ఇప్పించడం అనేది మన రాష్ట్రంలోనే అత్యధికంగా కంపాన్ సేషన్ పోస్టులు ఇచ్చిన జిల్లాగా మన నెల్లూరు జిల్లా రికార్డు నమోదు చేసుకొంది. అనంతరం వారి పిల్లలతో మాట్లాడుతూ కంపాన్ సేషన్ గ్రౌండ్స్ లో భాగంగా మీ తల్లిదండ్రుల త్యాగ ఫలంతో ఉద్యోగాలు కల్పించడం జరిగిందని, మీరందరూ నూతన జీవితాన్ని పొందారని, విధి నిర్వహణలో కచ్చితత్వంతో వ్యవహరించాలని, పోలీసు కుటుంబాల పిల్లలు క్రమశిక్షణతో ముందుకెళ్ళాలని, మిగిలిన పిల్లలు పోలీసు ఉద్యోగంలో చేరేలా ప్రోత్సహించాలని తెలిపారు. అనంతరం స్వయంగా రుచి కరమైన భోజనం స్వయంగా కుటుంబ సభ్యులకు జిల్లా యస్.పి. గారు వడ్డించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యస్.పి. గారితో పాటు అడిషనల్ యస్.పి.(అడ్మిన్) శ్రీమతి వెంకటరత్నం గారు, యస్.బి. డి.యస్.పి. శ్రీ కోటా రెడ్డి గారు, SB CI-1 శ్రీ అక్కేశ్వరావు, CI-2 శ్రీ రామకృష్ణ, RI వెల్ఫేర్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, RI అడ్మిన్ శ్రీ రమణారెడ్డి, పి. సూపరింటెండెంట్ శ్రీమతి కతీజాబేగం, బి.4 క్లర్క్ శ్రీ మాలకొండయ్య గారు, SBI రీజనల్ మేనజర్ శ్రీ అఫ్రోజ్ గారు, యస్.బి.ఐ. మేనజర్ శ్రీ రామ కుమార్ గారు , డి.పి.ఒ. సిబ్బంది మరియు అమరులైన పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో, నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ఇన్ చార్జీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొన్న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.