శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో, నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ఇన్ చార్జీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొన్న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
రవి కిరణాలు న్యూస్ తడ:
సూళ్లూరుపేట రోటరీ క్లబ్ వారు ఈ రోజు అలవల రోటరీ నేత్ర వైద్యశాల లో ఉచిత మధుమేహ వ్యాధి నిర్దారణ పరీక్షా క్యాంపు ను నిర్వహించారు ప్రపంచ హృదయ దినోత్సవం ను పురస్కరించుకొని ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది, మధుమేహ వ్యాధి ఉన్నవారికి డాక్టర్ సాయిబాబా మరియు డాక్టర్ మస్తానమ్మ చే అవగాహన కల్పించారు, నిరుపేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు, ఈ సందర్భముగా రోటరీ డిస్ట్రీక్ట్ 3160 అసిస్టెంట్ గవర్నర్ వేనాటి విజయలక్ష్మి మాట్లాడుతూ ఈ రోజు వన్ నేషన్ వన్ డే వన్ మిలియన్ టెస్టులు చేయడం లక్షంగా పెట్టుకుని రోటరీ క్లబ్ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆమె తెలిపారు, రోటరీ క్లబ్ అధక్షుడు తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి అద్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమం లో కార్యదర్శి వినయ్ కుమార్,ఆదిశేషారెడ్డి, తన్నీరు శేషగిరి రావు,దువ్వూరు సుబ్రహ్మణ్యం రెడ్డి, కుమార స్వామి,రామకృష్ణ , శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.
రూ .540 కోట్ల పెట్టుబడి : 1500 మందికి పైగా ఉపాధి
రవి కిరణాలు న్యూస్ తడ (శ్రీ సిటీ) :
శ్రీసిటీలో బ్లూస్టార్ ఏసీ మెషిన్స్, విడిభాగాల తయారీ నూతన పరిశ్రమ నిర్మాణానికి బుధవారం భూమిపూజ జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) లో భాగంగా పరిశ్రమ ఏర్పాటుకు బ్లూస్టార్ ముందుకురాగా, ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బి.త్యాగరాజన్ లాంఛనంగా భూమిపూజ చేసి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్లూస్టార్ ప్రెసిడెంట్, సీఈఓ సి.పి.ముకుందన్ మీనన్, వైస్ ప్రెసిడెంట్ వి.కసబేకర్, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమావేశాన్ని ఉద్దేశించి త్యాగరాజన్ మాట్లాడుతూ, ప్రపంచస్థాయిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా తమ తయారీ కార్యకలాపాలను గణనీయంగా పెంచడానికి చేపట్టిన వ్యూహాత్మక చొరవలో భాగంగా అధునాతన వసతులతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రేరణతో PLI స్కీమ్ ప్రభావంతో నూతన ప్లాంట్ లో ముఖ్యంగా విడి భాగాలను తయారు చేపట్టనున్నామని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్‌పై దృఢమైన నమ్మకం ఉన్న తాము, ఎయిర్ కండిషనింగ్, రిఫ్రిజిరేటర్ పరిశ్రమలో అతిపెద్ద దేశీయ తయారీదారుగా ఎదగడానికి ఆచరణాత్మక పయనం సాగిస్తున్నామన్నారు.
తన మొదటి శ్రీసిటీ సందర్శనను గుర్తుచేసుకున్న త్యాగరాజన్, ప్రపంచశ్రేణి మౌళిక సదుపాయాలకు ఏ మాత్రం తీసిపోని ఇక్కడ వాతావరణాన్ని చూసి, వెంటనే ఇక్కడ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
ఈ సందర్భంగా రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ, ఎయిర్ కండిషనింగ్ మరియు రిఫ్రిజిరేటర్ తయారీలో పేరుగాంచిన ప్రముఖ స్వదేశీ బ్లూస్టార్ సంస్థను శ్రీసిటీకి ఆహ్వానించడం తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. బ్లూస్టార్ కు సంబంధించి దేశంలో ఇది 6వ ఉత్పాదక యూనిట్, మరియూ దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిది. దీనితో కన్స్యూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమకు కూడా శ్రీసిటీ ఆకర్షణీయమైన ప్రదేశంగా గుర్తింపు దక్కించుకుందన్నారు. బ్లూస్టార్ తో పాటు డైకిన్, మరో రెండు ప్రముఖ ఏసీ మెషిన్స్ తయారీ సంస్థలు శ్రీ సిటీకి ప్రాధాన్యతనివ్వడంతో, వైట్ గూడ్స్ రంగానికి ఒక క్రొత్త అనుకూల వ్యవస్థ రూపుదిద్దుకుంటోందని, ఇది స్థానిక యువతకు వేలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని అన్నారు. స్ఫూర్తిదాయకమైన నాయకత్వం, వ్యాపార అనుకూల వాతావరణం, చక్కని పారిశ్రామిక విధానంతో ఏపీ పెట్టుబడిదారులను ఆకర్షించడంలో అగ్రస్థానంలో ఉందన్నారు.
శ్రీసిటీ దేశీయ టారిఫ్ జోన్ (DTZ) లో 20 ఎకరాల స్థలంలో నిర్మించబడే ప్లాంట్, అక్టోబర్ 2022 నాటికి ఊత్పత్తులు ప్రారంభిస్తుంది. ఈ ప్లాంట్ దశల వారీగా దాదాపు రూ .540 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేయబడుతుంది , ఐదు సంవత్సరాల కాలంలో మొత్తం ఉత్పత్తి సామర్ధ్యం 1.2 మిలియన్లకు దగ్గరగా ఉంటుంది, దీని ద్వారా 1500 మందికి పైగా ఉపాధి లభిస్తుంది. ఈ ప్లాంట్ దక్షిణ భారత దేశ మార్కెట్ల అవసరాలను తీర్చగలదు.
నిత్యం ప్రజల్లో ఉంటూ డివిజన్ ను సుందరంగా తీర్చిదిద్దేందుకు
చర్యలు తీసుకోవడంతో పాటు పారిశుధ్యం మెరుగు కోసం కృషి చేసిన నాకు నెల్లూరు నగర కార్పొరేషన్ ప్రత్యేక అవార్డు అందజేసి సత్కరించింది.. కమిషనర్ దినేష్ కుమార్ ప్రశంస
పత్రాన్ని అందజేశారు.. 46వ డివిజన్ లోపారిశుధ్యం పై ప్రజలకు అవగాహన కల్పించడం, దోమల ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం, నిత్యం ప్రజల్లో ఉంటూ శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టడం వంటి పనులను విజయవంతంగా పూర్తి చేసినందుకు.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 2021లో భాగంగా.. నాకు ఈ గౌరవం దక్కింది.. మంత్రి అనిల్ గారి సహకారంతో 46వ డివిజన్‌ని మోడల్ డివిజన్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాను.. ఈ అవార్డు రావడానికి తనకు సహకరించిన కార్పొరేషన్ సిబ్బంది కి ముఖ్యంగా మన డివిజన్ ప్రజలకు, యువతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.. ఈ అవార్డును నా డివిజన్ ప్రజలు కి అంకితం ఇస్తున్నాను..
ఇద్దరు నిందితులను అదుపులోకి
కారు స్వాధీనం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడ లో తమిళనాడు కు చెందిన అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు 240 NDPL తమిళనాడు రాష్ట్రానికి చెందిన మద్యం పట్టుకున్న ఘటన శనివారం చోటు చేసుకుంది.
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ శ్రీ లక్ష్మి ఆదేశాల మేరకు 5 ఇంటలిజెన్స్ టీములుగా తడలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈ తనిఖీల్లో భాగంగా ఆంధ్ర కు తరలిస్తున్న తమిళనాడు అక్రమ మద్యాన్ని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం.
రవి కిరణాలు తడ :
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సులూరుపేట ఆర్ టి సి మెరుగైన కార్గో సేవలను అందిస్తుందని ఆర్టీసీ ఏటీఎం పేర్కొన్నారు.
సూళ్లూరుపేట కార్గో పాయింట్ ను మంగళవారం నెల్లూరు ATM అనిల్ సూళ్లూరుపేట కార్గో పాయింట్ తణిఖీ చేసి కార్గో ఆదాయమును పెంచుటకు పలు సూచనలు చేసినారు.
డోర్ డెలివరీ పోస్టర్స్ సూళ్లూరుపేట కార్గో పాయింట్ నందు ఆవిష్కరించారు.
1.9.21 తేదీ నుండి డోర్ డెలివరీ ప్రారంభించినప్పటి నుండి ఆదరణ చాలా బాగున్నందున ఆదాయం పెరుగుతున్నది వెల్లడించారు.
సూళ్లూరుపేట పరిసర ప్రాంత వాసులు ప్రతి ఒక్కరు మీ లాగేజ్ కార్గో లో బుక్ చేయవలసిందిగా కార్గో సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ATM తో పాటు సూళ్లూరుపేట DM బండ్ల కుమార్, , డిపో మార్కెటింగ్ ఎక్జిక్యూటివ్ శేఖర్, కార్గో ఏజెంట్ బాలాజీ పాల్గొన్నారు.