ఇద్దరు నిందితులను అదుపులోకి
కారు స్వాధీనం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడ లో తమిళనాడు కు చెందిన అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు 240 NDPL తమిళనాడు రాష్ట్రానికి చెందిన మద్యం పట్టుకున్న ఘటన శనివారం చోటు చేసుకుంది.
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ శ్రీ లక్ష్మి ఆదేశాల మేరకు 5 ఇంటలిజెన్స్ టీములుగా తడలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈ తనిఖీల్లో భాగంగా ఆంధ్ర కు తరలిస్తున్న తమిళనాడు అక్రమ మద్యాన్ని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం.
రవి కిరణాలు తడ :
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సులూరుపేట ఆర్ టి సి మెరుగైన కార్గో సేవలను అందిస్తుందని ఆర్టీసీ ఏటీఎం పేర్కొన్నారు.
సూళ్లూరుపేట కార్గో పాయింట్ ను మంగళవారం నెల్లూరు ATM అనిల్ సూళ్లూరుపేట కార్గో పాయింట్ తణిఖీ చేసి కార్గో ఆదాయమును పెంచుటకు పలు సూచనలు చేసినారు.
డోర్ డెలివరీ పోస్టర్స్ సూళ్లూరుపేట కార్గో పాయింట్ నందు ఆవిష్కరించారు.
1.9.21 తేదీ నుండి డోర్ డెలివరీ ప్రారంభించినప్పటి నుండి ఆదరణ చాలా బాగున్నందున ఆదాయం పెరుగుతున్నది వెల్లడించారు.
సూళ్లూరుపేట పరిసర ప్రాంత వాసులు ప్రతి ఒక్కరు మీ లాగేజ్ కార్గో లో బుక్ చేయవలసిందిగా కార్గో సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ATM తో పాటు సూళ్లూరుపేట DM బండ్ల కుమార్, , డిపో మార్కెటింగ్ ఎక్జిక్యూటివ్ శేఖర్, కార్గో ఏజెంట్ బాలాజీ పాల్గొన్నారు.
ప్లాస్టిక్ రహిత నెల్లూరుకై కృషి చేద్దాం
- కమిషనర్ దినేష్ కుమార్
పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్న ప్లాస్టిక్ ఉత్పత్తులను పూర్తిస్థాయిలో నిషేధించి నెల్లూరు నగరాన్ని ప్లాస్టిక్ రహిత సుందర నగరంగా తీర్చిదిద్దుతామని కమిషనర్ దినేష్ కుమార్ తెలిపారు. నగరంలోని ప్లాస్టిక్ ఉత్పత్తుల విక్రయదారులు , వ్యాపారస్తులు, నగర ప్రముఖులతో సమావేశాన్ని కమిషనర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన నూతన నిర్ణయాలతో రాబోయే రోజుల్లో 75 శాతం కన్నా తక్కువ మైక్రాన్ ప్లాస్టిక్ ఉత్పత్తులను విక్రయించడం, వినియోగించడం నెల్లూరు నగరంలో నిషేధించనున్నామని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆదేశించిన నిబంధనలను అతిక్రమించిన విక్రయదారులు, వినియోగదారులపై భారీ జరిమానాతో కూడిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా జౌళి ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని, వాటి వినియోగానికి అవసరమైన అన్ని ప్రోత్సాహకాలను నగరపాలక సంస్థ నుంచి అందిస్తున్నామని కమిషనర్ తెలిపారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, నగరపాలక సంస్థ సిబ్బంది, నగరంలోని వ్యాపారస్తులు, తదితరులు పాల్గొన్నారు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లిగూడూరు మండలం, వరిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీజనల్ జ్వరాలు, అంటువ్యాధులపై - డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశ వాలంటీర్లు, ఇంజనీరింగ్ అధికారులు, పంచాయతీ సిబ్బంది, వైద్య సిబ్బంది, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
👉 జ్వరాల సీజన్ మొదలైనందున ఆరోగ్య కేంద్రాలలోని వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి.
👉 పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య నిర్వహణకు చర్యలు చేపట్టాలి.
👉 గ్రామీణ నీటి సరఫరా అధికారులు సైడ్ డ్రైన్లు పొర్లకుండా, గ్రామాలలో మురికి నీరు నిల్వ ఉండకుండా పంచాయతీ సిబ్బందికి సూచనలు ఇవ్వాలి.
👉 అధికారులు సమన్వయంతో పనిచేసి దోమలను నిర్మూలించి, ప్రజలు జ్వరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
👉 గ్రామ స్థాయి సిబ్బంది గ్రామాలలో ప్రతి ఇంటిని పరిశీలిస్తూ, దోమలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలి.
👉 డెంగ్యూ, మలేరియా లాంటి విషజ్వరాల బారినపడే వారికి తక్షణ చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలి.
👉 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైయస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా 2434 వ్యాధులకు వైద్యం అందిస్తున్నారు.
👉 ఆరోగ్యశ్రీ ద్వారా జ్వరాలు నయం చేసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు వెసలుబాటు కల్పించారు.
👉 విష జ్వరాల బారిన పడి లక్షలు వెచ్చించవలసి వస్తున్న పేద, బడుగు వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారు జ్వరాలను ఆరోగ్యశ్రీ కింద చేర్చడం ఎంతో ఉపకరిస్తుంది.
👉 కరోనా మూడో విడత సంకేతాల నేపథ్యంలో అధికారులు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలి.
👉కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి 100 శాతం లక్ష్యాన్ని ఛేదించాలి.
👉 అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసి ప్రజలు వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకోండి.
నెల్లూరు, సెప్టెంబర్ 28: గ్రామ సచివాలయం పరిధిలో అర్జీలు ఎక్కువగా పెండింగ్లో ఉంటున్నాయని, త్వరితగతిన అర్జీలను పరిష్కరించకపోతే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు సచివాలయ సిబ్బందిని హెచ్చరించారు. మంగళవారం బోగోలు మండలంలోని అల్లి మడుగు పంచాయతీలోని కడనూతల, కోవూరుపల్లి గ్రామ సచివాలయాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే స్పందన కార్యక్రమానికి ఎక్కువగా సచివాలయాల పరిధిలోని అర్జీలు వస్తున్నాయని, గడువు దాటాక కూడా ఈ అర్జీలను పరిష్కరించడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు సచివాలయం పరిధిలో అర్జీలను పరిష్కరించాలన్నారు. ప్రతి శుక్ర శనివారాలు గ్రామ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించి వారి సమస్యలను తెలుసుకోవాలని సిబ్బందికి సూచించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని, ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ తప్పకుండా వేయాలన్నారు. సచివాలయాలకు సంబంధించిన సమాచారాన్ని మండల అభివృద్ధి అధికారి నాసరరెడ్డి ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కావలి ఆర్డిఓ శ్రీ శీనా నాయక్, తాసిల్దార్ శ్రీ వెంకట్రామ్ రెడ్డి, కడనూతల సచివాలయ సిబ్బంది రామకృష్ణ, వెంకటేశ్వరరావు, హిమజ, నాగ సతీష్ కుమార్, కోవూరు పల్లి సచివాలయ సిబ్బంది లక్ష్మీ ప్రసన్న, జయశ్రీ, అనిత, రాజేష్, మనోజ్, భాను తదితర అధికారులు పాల్గొన్నా
నెల్లూరు, సెప్టెంబర్ 28: రాష్ట్ర శాసనసభ బీసీ కమిటీ చైర్మన్ శ్రీ జంగా కృష్ణమూర్తిని జాయింట్ కలెక్టర్ (ఆసరా) శ్రీమతి రోజ్ మాండ్, డిఆర్వో శ్రీ చిన్న ఓబులేసు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. ఒకరోజు జిల్లా పర్యటనకు విచ్చేసిన బీసీ కమిటీ సభ్యులకు మంగళవారం రాత్రి ఏపీ టూరిజం హరిత హోటల్ లో జాయింట్ కలెక్టర్ (ఆసరా), డిఆర్ఓ మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. బీసీ కమిటీ చైర్మన్ జంగా కృష్ణమూర్తి తో పాటు రాష్ట్ర సచివాలయ అసిస్టెంట్ సెక్రటరీ శ్రీ ఈశ్వరరావు, సెక్షన్ ఆఫీసర్ శ్రీ భిక్షం, జిల్లా బి.సి.సంక్షేమ అధికారి శ్రీ వెంకటయ్య, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు శ్రీ కృష్ణయ్య, శ్రీ సుధాకర్, తేజోవతి, శ్రీదేవి, ప్రసూన తదితర అధికారులు ఉన్నారు.