నెల్లూరు జిల్లా
ఆగస్టు 2021 న సీనియర్ స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్, మంగళగిరి నందు జరిగిన పోటీలలో హేమర్ త్రో నందు బంగారు పతాకాన్ని సాధించిన ARHC-2312 శ్రీ ఖాదరి గారి కుమార్తె అయిన కుమారి SD.ఫిజా ఖాదరీ గారిని అభినందించిన జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు.. ఉన్నత శిఖరాలు చేరుకొని, తల్లిదండ్రులకు మంచి పే
నెల్లూరు జిల్లా-కోవూరు నియోజకవర్గం
ఇందుకూరుపేట మండలం, కొరుటూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ దాడిలో గాయపడ్డ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పరామర్శించి స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున ఐదు మందికి రూ.50,000 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసిన.కోవూరు శాసనసభ్యులునల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారుఈ కార్యక్రమంలో పాల్గొన్నఆంధ్రప్రదేశ్ ఆఫ్కాప్ ఛైర్మన్ కొండూరు అనిల్ బాబు గారు, మండల పార్టీ అధ్యక్షులు మవులూరు శ్రీనివాసులురెడ్డి గారు, జిల్లా పశుగణాభివృద్ధి ఛైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ గారు, మైనార్టీ విభాగం పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి షేక్ షబ్బీర్ గారు, ఎంపీటీసీ శ్రీనివాసులురెడ్డి గారు, పి. శ్రీనివాసులు షేక్ రహమతుల్లా
నెల్లూరులో చారిత్రక వి.ఆర్.విద్యాసంస్థల పరిరక్షణ కోసం రాజకీయాలకతీతంగా పోరాడుతాం
-జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
--------------------
ప్రభుత్వ నిరంకుశ విధానాల కారణంగా నిర్వీర్యమవుతూ మూతపడిన వి.ఆర్.విద్యాసంస్థల పరిరక్షణ కోసం నేడు నెల్లూరు సిటీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి నగరంలోని వి.ఆర్.కళాశాల ఎదుట మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. తొలుతగా వి.ఆర్.సి కూడలిలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం కేతంరెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ప్రకటించిన వైసీపీ మేనిఫెస్టో ను చూపించారు. ఆ మేనిఫెస్టో లో విద్యకు సంబంధించి ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వని విధానాన్ని దుయ్యబట్టారు. ప్రభుత్వ పాఠశాలలకు రంగులేయడం గురించి మాత్రమే ఆ మేనిఫెస్టోలో చెప్పారు కానీ ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజిలను, ఎయిడెడ్ విద్యాసంస్థలను, రాష్ట్ర యూనివర్శిటీలను తామెలా అభివృద్ధి చేస్తామో మాట మాత్రమైనా ప్రస్తావన లేకపోవడం ఆ పార్టీకి, వారి ప్రభుత్వానికి ఉన్నత విద్య మీద అసలు చిత్తశుద్ధే లేదనే వాస్తవాన్ని తెలియజేస్తుందని అన్నారు. మేనిఫెస్టోలో ఉన్నవే కాదు లేనివి కూడా చేస్తున్నాం అని నేడు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఘనంగా ప్రకటిస్తున్నారని, దానర్థం మేనిఫెస్టోలో లేనటువంటి ఈ ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలలను, పాఠశాలలను, వాటి ఆస్తులను అమ్ముకోవడమే ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్న నిదర్శనం అని అన్నారు. 1875వ సంవత్సరంలో బ్రిటిష్ హయాంలోనే ఆనాడు వెంకటగిరి రాజా వారు సేవా దృక్పధంతో ప్రతిఒక్కరికి విద్య అందాలనే లక్ష్యంతో ఈ విద్యాసంస్థలను ఏర్పాటు చేయగా 1920వ సంవత్సరం నుండి వి.ఆర్. కళాశాల డిగ్రీ విద్యను అందిస్తున్నదని పేర్కొన్నారు. ఎందరో దాతల కృషితో వందేళ్ళకు పైగా ఉన్నత విద్యను అందిస్తూ నెల్లూరు నగరానికి గుండె కాయిలా మారినటువంటి వి.ఆర్.కళాశాలను నేడు ఈ ప్రభుత్వం మూసివేయడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. సాక్షాత్తు దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఈ విద్యాసంస్థల్లోనే హైస్కూల్ విద్యను, కళాశాల విద్యను పొందారని, విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ నేడు దేశంలో సర్వోన్నత స్థాయిలో ఉన్నారని గుర్తుచేశారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, డీఆర్డీఓ శాస్త్రవేత్త సతీష్ రెడ్డి గారు, తమ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ పూర్వ విద్యార్థులే అని తెలిపారు. ఇలా ఎందరో ఇక్కడ విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు వివిధ రంగాల్లో ఉన్నతమైన స్థితిలో ఉన్నారని, ఐఏఎస్ లు, ఐపీఎస్ లుగా కూడా ఉన్నారని, ఈ విద్యాసంస్థలను ప్రభుత్వం నిర్వీర్యం చేయకుండా చూడాల్సిన బాధ్యత ఇలాంటి పూర్వ విద్యార్ధులందరి మీద ఉందని కోరారు. నెల్లూరు నగరంలో వి.ఆర్.సి మైదానం, వైఎంసి మైదానం, వి.ఆర్.పాఠశాల, కళాశాలలతో కలిపి 17 ఎకరాల అత్యంత విలువైన భూములు ఈ సంస్థలకు ఉన్నాయని తెలిపారు. నెల్లూరు నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఈ ఒక్క సంస్థల విలువే సుమారు 1000 కోట్ల రూపాయలని పేర్కొన్నారు. వి.ఆర్.సి తో పాటు నగరంలో మిగిలిన ఎయిడెడ్ వ్యవస్థలైన సర్వోదయ, కస్తూరిదేవి, ఎస్.వి.జి.ఎస్, ఆర్ఎస్ఆర్, జి.వి.ఆర్.ఆర్, వేద సంస్కృత కళాశాల వంటి సంస్థల విలువ 3500 కోట్ల రూపాయలకు పైమాటేనని ఇప్పుడు ప్రభుత్వం దృష్టి ఈ ఆస్తులను ఎలా కాజేయాలనే దానిపైన పడిందని అందుకే ఈ వ్యవస్థలను కుట్రపూరితంగా నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికే కస్తూరిదేవి విద్యాసంస్థల ప్రాంగణాన్ని పెట్రోల్ బంకులు, కళ్యాణ మండపాలుగా మార్చేసి వ్యాపారాన్ని మొదలెట్టేసి ఉన్నారని, సర్వోదయను సైతం ఆ వ్యాపారాల దిశగా తీసుకెళ్తున్నారని, అదే తరహాలో వి.ఆర్.సి అంశంలో వ్యాపారాల కోసం ఎవరితో డీల్ మాట్లాడుతున్నారో అని ఎద్దేవా చేసారు. ప్రభుత్వానికి చేతనైతే ప్రభుత్వ అధ్యాపకులను పెట్టి అద్భుతమైన విద్యను అందించే అవకాశం ఉందని కానీ ఈ ప్రభుత్వంలో అలా జరగట్లేదని నవరత్నాల్లో చెప్పిన డబ్బు పంపిణీ కోసం అప్పులు కూడా పుట్టక ఇప్పుడు వి.ఆర్.సి లాంటి సంస్థలను అమ్మేసే ప్రక్రియకు ప్రభుత్వం బరితెగించి తెరతీసిందన్నారు. నెల్లూరు నగరంలో బాలికలకు డి.కె.డబ్ల్యూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉందని కాని సమగ్రంగా అందరికీ విద్యనందించే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇప్పటివరకు ఒక్కటి కూడా లేదని, పేద ప్రజలకు వి.ఆర్.కళాశాల ఒక్కటే దిక్కని తెలిపారు. అలాంటి కళాశాలను స్వార్ధంతో కుట్రపూరితంగా నిర్వీర్యం చేస్తున్న ఈ ప్రభుత్వ విధానం పై ఖచ్చితంగా తాము పోరాడుతామని, పార్టీలకతీతంగా వి.ఆర్.విద్యాసంస్థల పరిరక్షణ కోసం జనసేన పార్టీ యువజన, విద్యార్థి విభాగాలు పోరాడుతాయని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కాకు మురళి రెడ్డి, చెరుకూరు హేమంత్ రాయల్, రాము, సురేష్, మోష, జీవన్, శ్రీను ముదిరాజ్, ఖాదర్, కార్తీక్, గణేష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాలమేరకు నేడు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, హియరింగ్ ఎయిడ్, సెల్ ఫోన్స్ మరియు ల్యాబ్ టాప్ లను పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు నాగరాజ కుమారి, అసిస్టెంట్ డైరెక్టర్ డిజాబుల్డ్.
🔹 రూరల్ నియోజకవర్గంలో ప్రభుత్వ సహకారంతో, స్వర్ణభారత్ ట్రస్ట్ సహకారంతో, జిల్లాప్రజాపరిషత్ సహకారంతో దాతల సహకారంతో మరియు సొంత నిధులతో ఇప్పటికే 660 మందికి ట్రై సైకిళ్లు, హ్యాండ్ స్టిక్స్, హియరింగ్ ఎయిడ్, మొదలు పరికరాలు దివ్యాంగులకు అందించడం జరిగింది. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
🔹 చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై, నెల్లూరు రూరల్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిపై ప్రజలందరి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
పై కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు హరిబాబు యాదవ్, గ్రామ మరియు డివిజన్ ముఖ్యనాయకులు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ పునర్నిర్మాణమే ఊపిరిగా పనిచేస్తున్న ఏబీవీపీ విద్యార్థి సంఘం: ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్
చిల్లకూరు ఏబీవీపీ నూతన కమిటీని ప్రకటించిన ఏబీవీపీ నాయకులు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో స్థానిక చిల్లకూరు వెంకటేశ్వర కళాశాలలో ఏబీవీపీ చిల్లకూరు నూతన నగర కమిటీ ని ప్రకటించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎబివిపి జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ మరియు జిల్లా కన్వీనర్ కార్తీక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మనోజ్ కుమార్ మాట్లాడుతూ జాతీయ పునర్నిర్మాణమే ఊపిరిగా దేశభక్తి విలువలతో విద్యార్థి సమస్యలు పరిష్కరిస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి ముందుకెళ్తుందని, విద్యార్థులు దేశం కోసం పని చేయడానికి ముందుకు రావాలని, విద్యార్థి సమస్యలు పరిష్కార మార్గానికి ఏబీవీపీ దారి చూపుతుందని అందుకే ఏబీవీపీ ప్రపంచంలోనే అతి పెద్ద విద్యార్థి సంఘం గా ఏర్పడిందని ఆయన తెలిపారు, మరియు జిల్లా కన్వీనర్ కార్తీక్ మాట్లాడుతూ స్కాలర్ షిప్ లు మరియు జీవో నెంబర్ 77, 42 లాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కారానికి ఏబీవీపీ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది విద్యార్థులంతా ఏకమై సమస్యలు పరిష్కరించడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు అదేవిధంగా నూతన కమిటీని ప్రకటించారు, నూతన కమిటీలో నగర కార్యదర్శి గా వంశీ నగర సహాయ కార్యదర్శి గా భార్గవ్ మరియు సతీష్ ఉపాధ్యక్షుడుగా మురారి, సభ్యులుగా శీను, మునిచంద్ర ,ప్రణయ్, రాంబాబు, ప్రదీప్ ,కిరణ్ ,సతీష్ ,రాజేష్ ,చైతన్య నూతన కమిటీ లో బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో జిల్లా హాస్టల్స్ కన్వీనర్ చిన్న, ఏబీవీపీ నాయకులు ముఖేష్, ప్రదీప్ ,సురేష్ మరియు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు
తిరుపతి పార్లమెంటు జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గం, పెళ్లకూరు మండలం లో.....
ఈరోజు సేవ సమర్పణ కార్యక్రమాల్లో భాగంగా సేవా సమర్పణ జిల్లా ఇంచార్జ్ ముని సుబ్రహ్మణ్యం గారు మరియు జిల్లా కన్వీనర్ ఎద్దల నరేందర్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో * వారి సహకారంతో బిజెపి రాష్ట్ర మరియు జిల్లా పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు పెళ్లకూరు మండలం లోని పలు రేషన్ దుకాణాలను పర్యటించి అక్కడి పేద ప్రజలకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా కరోనా విపత్కర పరిస్థితుల్లో మన ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు అదనంగా అందజేస్తున్న ఐదు కిలోల బియ్యాన్ని మోడీ గారికి ధన్యవాదాలు చెబుతూ బ్యాగుల ద్వారా బియ్యాన్ని అందివ్వడం చేశారు.....
✊✊✊
పెళ్లకూరు మండలం లో భారీ స్థాయిలో ఒక పండుగ వాతావరణం లో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన ఎద్దల నరేందర్ రెడ్డి గారికి జిల్లా మహిళా మోర్చ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు.....
ఈ కార్యక్రమంలో నే భాగంగా మోడీ గారు కు దీర్ఘాయుష్షును అందివ్వాలని పెళ్లకూరు మండలం గ్రామ దేవత కోటాలమ్మ తల్లి గుడి దగ్గర, గ్రామస్తులు అందరితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించడం చేసాము.....
ఈ కార్యక్రమంలో పెళ్లకూరు మండల అధ్యక్షుడు మురళి గారు,మండల కమిటీ నేతలు, మహిళా మోర్చ నేతలు వరలక్ష్మి, తదితరులు, కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో నేను కూడా భాగం అయినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను🙏🏼.....
తిరుపతి పార్లమెంటు జిల్లా బిజెపి మహిళా మోర్చ అధ్యక్షురాలు.
శాంతియుత సమాజం కోసం యువత కృషి చేయాలి
లయన్స్ క్లబ్ జిల్లా అదనపు కార్యదర్శి