కావలి పరిధిలోని ఆముదాల దిన్నే గ్రామ సచివాలయంని జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె రికార్డులను పరిశీలించారు. సచివాలయం పరిధిలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలించి స్థానిక సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన సేవలు అందించాలని ఆమె సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన వేళల్లో సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. బయోమెట్రిక్ అటెండెన్స్ వివరాలు, ఈ సర్వీసెస్, స్పందన ఫిర్యాదు
దళితులుపట్ల జగన్మోహన్రెడ్డి తీరు మారాలి * *తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జన్ని. రమణయ్య
వైకాపా అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో దళితులపై అనేక దాడులు జరిగాయి,దళితుల భూములు బలవంతంగా లాక్కున్నారు, దళి
జిల్లా మహిళ అధ్యక్షురాలు పనబాక.భూలక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇంటికి కూతవేటు దూరంలో దళితమహిళను అత్యాచారం చేస్తే ఈ ప్రభుత్వం చోద్యం చూస్తుంది తప్ప ఎటువంటి చర్యలు తీసుకోలేదని,అలాగే డాక్టర్ సుధాకర్ గారు మాస్కులు అడిగితే అతడిని పిచ్చివాడిగా చిత్రీకరించి ఆ మానసిక క్షోభతో చనిపోయేలా చేసిందని ఈ వైకాపా అధికారంలోకి వచ్చాక దళితులకు రక్షణ కరువైందని అన్నారు.
దళితుల ఓటు బ్యాంకు తో రాజ్యాధికారం పొందిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అదే దళితులపై ఉక్కు పాదం మోపుతున్నారని దళితులు రాబోవు ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దావా పెంచల్రావు ,జిల్లా కార్యదర్శి కనపర్తి. గంగాధర్ , తిరుపతి పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీపతి బాబు జిల్లా ఎస్సిసెల్ ప్రధాన కార్యదర్శి ద్వారా విజయబాబు, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు అరవ. కిశోర్, మాజీ కార్పొరేటర్ ప్రశాంత్,మందా రవి ,selvi,ప్రమీల ,వెంకట లక్ష్మి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు
జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు ప్రజలకు హెల్మెట్ ధారణపై అవగాహన కల్పిస్తున్న నెల్లూరు పోలీసులు
ప్రామాణికత కలిగిన హెల్మెట్ ధారణ అవసరమని డ్రైవ్ నిర్వహణ
మీ కుటుంబ సభ్యుల కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి
మీకోసం ఎదురు చూస్తూ మీ కుటుంబ సభ్యులు ఉన్నారని మరవకండి..
హెల్మెట్ ధరించని వారిపై చట్టప్రకారం
SPS నెల్లూరు జిల్లా యస్.పి. శ్రీ CH.విజయ రావు,IPS., గారి ఆదేశాల మేరకు ద్విచక్రవాహనాలు నడిపే వాహన చోదకులు ప్రతి ఒక్కరు (బి.ఐ.యస్) బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పించిన నెల్లూరు పోలీసులు.
హెల్మెట్ ప్రాణాలకు రక్ష అని, జిల్లాలో సంభవించే రోడ్డు ప్రమాదాలలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవటం వలన ఎక్కువగా మరణాలకు గురి అవుతున్నారని తెలియచేసినారు. హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తే సురక్షితమని, ప్రమాదాలు జరిగేటప్పుడు హెల్మెట్ అనేది ఒక రక్షణ కవచం లాగా కాపాడుతుందని, ప్రతి ఒక్కరూ ప్రయాణం చేసేటప్పుడు బాధ్యతగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని ప్రజలకు సూచించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం మీ జీవితానికి ప్రమాదకరమని, హెల్మెట్ ధరించడం వలన కలిగే లాభాలు మరియు ధరించకపోవడం వలన జరిగే అనర్దాలు గురించి ద్విచక్ర వాహన దారులకు అవగాహన కల్పించడం జరిగింది.
ప్రజలు వారి కోసం వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల కోసం తప్పనిసరిగా ప్రామాణికత కలిగిన బిఐఎస్" మార్క్ కలిగిన హెల్మెట్లు ధరించాలని తెలియజేసినారు. వాహనదారుల నిర్లక్ష్యం మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు పాలిట శాపంగా పరిణమించకుండా చూసుకోవాలని సూచించారు. జిల్లాలో హెల్మెట్ ధరించని వాహనదారులపై కేసులు నమోదు చేసి వారిపై ఈ చలానా విధించటం జరుగుతుందని తెలియచేసినారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేసిన డప్పులు, గజ్జెలు, డ్రెస్సులను నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబందించిన 7 మంది డప్పు కళాకారులకు అందజేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
🔹 పేదరికంలో ఉన్న ఈ కళాకారుల కుటుంబాలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుంది. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
పై కార్యక్రమంలో AMC ఛైర్మెన్ యేసు నాయుడు, వైసీపీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, 2వ డివిజన్ ఇంఛార్జ్ పడిగినేటి రామ్ మోహన్ యాదవ్, షమీ హుస్సేనీ, ASWO హాజరత్తయ్య, HWO విజయ్ కుమార్ గార్లు తదితరులు పాల్గొన్నారు.
వైసీపీ మైనింగ్ మాఫియా అక్రమాలను ఆధారాలతో బయటపెడితే ఎదురుదాడులు, బూతు పంచాంగం, అభూత కల్పనలతో ప్రజలను గందరగోళం చేసేలా ఆరోపణలు చేస్తారా..
మేం వ్యక్తిగతంగా ఎవరిపైనా ఆరోపణలు చేయలేదు..మా పోరాటం వైసీపీ మైనింగ్ మాఫియాపైనే..
జిల్లాలో అవినీతి, అక్రమాలు, అరాచకాలు రాజ్యమేలుతుంటే ఎస్పీ, కలెక్టర్ ఏం చేస్తున్నారు..
ఎస్సైలు వాడుతున్న భాష చూస్తుంటే కడుపురగిలిపోతోంది..
అల్లూరు తహసీల్దార్ రామక్రిష్ణ కార్యాలయాన్ని ఏకంగా అసాంఘిక కార్యకలాపాలకు బాడుగకు ఇస్తున్నారు...
కావలి రూరల్ ఎస్సై ప్రభాకర్ రెడ్డి కూలిచేసుకుని బతికే దళిత కుటుంబాన్ని వారం పాటు స్టేషన్ లో పెట్టి వేధించారు..
అధికారుల ప్రవర్తన మార్చుకోకపోతే వైసీపీ కాదు మా శత్రువు...తహసీల్దార్లు, ఎస్సైలు, సీఐలు, ఆర్డీఓల కుటుంబాలను కూడా రోడ్డుకు ఈడుస్తాం..
జిల్లాలోని అరాచక పరిస్థితులపై నెల్లూరులోని కలెక్టరేట్ వద్ద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన
సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న దౌర్జన్యాలు, అరాచకాలు, గ్రావెల్ మాఫియాపై సోమిరెడ్డి అనేక సార్లు ఆర్టీఐ ద్వారా, స్థానిక ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అధికారులకు తెలియజేసినా పట్టించుకున్న నాథులు లేరు.
మైనింగ్ మాఫియాకు సంబంధించిన టిప్పర్లు, ప్రొక్లెయిన్లు, ట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా తిరుగుతుంటే పట్టించుకోకుండా రైతుల ట్రాక్టర్లను మాత్రం సీజ్ చేసి కోర్టుకు సరెండర్ చేస్తున్నారు..
జంగాలపల్లికి చెందిన పేద మహిళ తన పొలం నుంచి తన ఇంటికే మట్టి తోలుకుంటుంటే వెంకటాచలం ఎస్సై ట్రాక్టర్లను సీజ్ చేసి కేసు నమోదు చేశారు..
మాఫియాకు ఒక న్యాయం, రైతులకు ఒక న్యాయమా అని సామాన్యులే బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు..కలెక్టరే సమాధానం చెప్పాలి...
కంటేపల్లి ఎస్సీ కాలనీ రైతులు విద్యుత్ తీగల ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడి న్యాయం చేయమని నిలదీస్తే దానికి టీడీపీనే తిడతారా..
గ్రావెల్ అక్రమ మైనింగ్ గురించి మేం ఎవరిపైనా వ్యక్తిగతంగా ఆరోపణలు చేయలేదు..మాఫియాపైనే చేశాం..
అధికారుల పరిశీలనలో పట్టుబడిన కాంట్రాక్టర్లే తమ తప్పును ఒప్పుకుని అధికారులకు స్మేట్మెంట్లు ఇచ్చారు..
మీరేమో టీడీపీ నాయకులు దోపిడీ చేశారని తప్పుదారి పట్టిస్తున్నారు..
ఏ రైతు మట్టి ఎత్తుకున్నా, పొలాలను చదును చేసుకున్నా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు..వైసీపీ గ్రావెల్ మాఫియాపైనే మా పోరాటం..
ఈ జిల్లాలో పరిస్థితులు ఘోరాతిఘోరంగా ఉన్నాయి..ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు, అరాచకం..
బీహార్ నుంచి వచ్చి ఇక్కడ పీకేందేందయ్యా అని ఎస్పీని ఒక ఎమ్మెల్యే అడిగితే ఇక ఈ జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి ఏంటి..
ఎస్పీకి అర్జీ ఇస్తే అన్యాయంగా కేసులు పెడుతున్నారు..కలెక్టర్ ను కలిస్తే తహసీల్దారు కార్యాలయాల్లోకి రానీయడం లేదు..
మా నాయకులు, కార్యకర్తలను మీ ఎస్సైలు తిట్టేభాషతో తట్టుకోలేకున్నాం..కడుపు మండిపోతోంది..ఎస్పీ గారూ....
ఈ జిల్లా చరిత్రను ఒక్కసారి తెలుసుకోండి.. 1992,93లో కావలి, అల్లూరులో పోలీసు స్టేషన్లపై తిరగబడి ఎస్సైల గుడ్డలిప్పిన విషయం గుర్తుంచుకోండి..
అధికారుల గురించి మేమైనా మాట్లాడితే పోలీసు, రెవెన్యూ అసోసియేషన్లు స్పందిస్తారు....
ఒక పార్టీ నాయకుల కుటుంబసభ్యుల గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు..
అల్లూరు తహసీల్దార్ రామక్రిష్ణ...తన కార్యాలయాన్ని ఏకంగా రాత్రుళ్లు బాడుగకు ఇస్తున్నాడు..
రూ.3 వేలు ఇస్తే తహసీల్దార్ కార్యాలయం, రూ.5 వేలు ఇస్తే తహసీల్దార్ గదే అప్పగించేస్తున్నాడు...
ఆ రాత్రి అక్కడ బార్ నడుపుకోవచ్చు...ఇంకేమైనా చేసుకోవచ్చు...అది తహసీల్దార్ కార్యాలయమా, బ్రోతల్ హౌస్, బార్ అండ్ రెస్టారెంటా అర్థం కావడం లేదు..
కావలి రూరల్ ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఒక దళితుడిని వారం రోజులుగా నిత్యం తీసుకెళ్లి స్టేషన్ లో నిర్బంధిస్తున్నాడు..మా నాయకులంతా ఫోన్ చేశాం...లాయర్ వెళ్లినా కేసు ఏందో చెప్పడు..ఏ కేసు లేకుండా కూలికి పోయే దళిత కుటుంబాన్ని వేధిస్తున్నాడు..
మీ ఎస్సైలు మా కుటుంబ సభ్యులను ఉద్దేశించి దూషిస్తున్నారు..మేం పొరబాటున నోరుజారి మీ కుటుంబసభ్యుల గురించి మాట్లాడితే పోలీసు అసోసియేషన్ నాయకులు ఊరుకుంటారా..
అధికారుల ప్రవర్తన మార్చుకోకపోతే వైసీపీ కాదు మా శత్రువు...తహసీల్దార్లు, ఎస్సైలు, సీఐలు, ఆర్డీఓల కుటుంబాలను కూడా రోడ్డుకు ఈడుస్తాం..