-
సర్వేపల్లి లో అక్రమ మైనింగ్ మాఫియా
ఎమ్మెల్యే కాకాని ఏం సమాధానం చెబుతారు
అక్రమ మైనింగ్ పై కేసు నమోదు చేసి మీ నిజాయితీ నిరూపించుకోవాలి
కాకాని గట్టిగా మాట్లాడినంత మాత్రాన నిజాలు కావు
టిడిపి నేత అబ్దుల్ అజీజ్ ధ్వజం
సర్వేపల్లి నియోజకవర్గం లో మైనింగ్ మాఫియా ఆగడాలు రోజురోజుకు పెట్రేగి పోతున్నాయని టిడిపి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెంకటాచలం పోలీస్ స్టేషన్లో సోమవారం ఆయన మాట్లాడుతూ ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో మాత్రమే పదేపదే అక్రమ మైనింగ్ జరుగుతోందని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే కాకాని కి తెలియకుండా ఏమీ జరగదని ఆయన కనుసన్నల్లోనే ఈ దందా జరుగుతుందని విమర్శించారు..
సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని ఈదగాలి, సర్వేపల్లి, కంటేపల్లి, కసుమూరు తదితర ప్రాంతాల్లో మైనింగ్ జరుగుతుందని వందలాది ట్రాక్టర్లు మట్టి , గ్రావెల్ తరలిపోతోంది అని విమర్శించారు. కంటే పల్లి లో మట్టి తవ్వకాలను అడ్డుకునేందుకు స్థానికులను టిడిపి నేతలను అరెస్టు చేసి స్టేషన్ లో ఉంచటం దుర్మార్గమన్నారు వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు..
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గట్టిగా మాట్లాడితే అబద్ధం నిజం అయిపోదన్నారు. నిషిద్ద భూముల్లోని మట్టి తవ్వకాలు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు.. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి కి ఏ మాత్రం నిజాయితీ ఉన్న వెంకటాచలం కి వచ్చి అక్రమ తవ్వకాలు చేస్తున్న వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్ చేస్తున్న వారు ఏ పార్టీకి సంబంధించిన వారైనా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 35వ డివిజన్ లేక్ వ్యూ కాలనీ13 వీధిలో పర్యటించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్చార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
🔹లేక్ వ్యూ కాలనీ 13 వీధిలో ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
🔹లేక్ వ్యూ కాలనీ13 వీధిలో వీలైనంత త్వరలో రోడ్డు పనులు పూర్తిచేయాలని అధికారులను కోరిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ
నెల్లూరు నగరంలోని స్థానిక 42 వ డివిజన్ జేమ్స్ స్కూల్ పక్కన దాదాపు 56 అంకణాలు స్థలం పార్కు కోసం కేటాయించడం జరిగింది ఈ
స్థలం కబ్జాకు గురవుతుంది ఏ ఐ వై ఎఫ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి ఆ స్థలాన్ని కాపాడాలని అర్జీ ఇవ్వడం జరిగింది.....
ఈ సందర్భంగా ఏ ఐ వై ఎఫ్ జిల్లా కన్వీనర్ సయ్యద్ సిరాజ్ మాట్లాడుతూ స్థానిక 42 వ డివిజన్ లో ఎక్కువ శాతం మంది ముస్లింలు నివాసముంటున్న ప్రాంతంలో ఒక పార్కు కూడా లేనందువల్ల ఇక్కడ పార్కు నిర్మించాలని చెప్పేసి మున్సిపల్ కార్పొరేషన్ వారు ఇక్కడ పార్కు స్థలాన్ని కేటాయించారు కానీ క్రమేణా ఈ స్థలం స్థానికంగా ఉండే వాళ్ళు ఇష్టానుసారంగా కబ్జా చేస్తూ పోయారు ఇప్పుడు అక్కడ దాదాపు 25 అంకణాలు మాత్రమే మిగిలి ఉంది ఈ స్థలాన్ని కూడా టీసీ కాలేషా అనే వ్యక్తి కబ్జా చేసి గోడను కూడా నిర్మించే ఈ స్థలం నాది అని అంటున్నాడు కనుక ఈ స్థలాన్ని కాపాడాలని మేము మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి అక్కడ గోడ ని తొలగించి పార్కు స్థలంగా కేటాయిస్తామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి నూర్ ఖాన్. మున్నా. పటాన్ భాష. గౌస్ బాష. దస్తగిరి. తదితరులు పాల్గొన్నారు
కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి పై టిడిపి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు పంచ్ లు.... ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న
పులిచింతల ప్రాజెక్టు కాంట్రాక్ట్ నాదని నిరూపిస్తే నేను రాజకీయాల నుండి తప్పుకుంటా...
ఉదయగిరి మాజీ శాసన సభ్యులు బోలినేని రామారావు*
👉సజ్జల రామకృష్ణారెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, సాక్షి మీడియా లకు సవాల్ విసిరిన ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని రామారావు.
👉గత కొద్ది రోజులుగా సాక్షి మీడియా నాపై పులిచింతల ప్రాజెక్టు కట్టింది నేనేనని వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
👉వారికిదే నా సవాల్ పులిచింతల ప్రాజెక్టు కాంట్రాక్ట్ నాదేనని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకునేందుకు సిద్ధం.
👉పులిచింతల ప్రాజెక్టు గేటు విరిగి పోవడానికి కారణం నేనేనని సాక్షి మీడియా నాపై విష ప్రచారం చేస్తుంది ఇదే తొలిసారి కాదు ఇదే మాదిరి 2017 సంవత్సరం నుంచి నాపై అబద్ధపు ప్రచారం.. కథనాలు ప్రచురిస్తున్నది.
👉2004 వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ప్రారంభమైన పులిచింతల ప్రాజెక్టు నాకెలా కాంట్రాక్టు ఇస్తారు, నాకు గాని నా కంపెనీకి సంబంధం లేని విషయంలో మీరు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
👉గతంలో సాక్షి పత్రిక లో నేను 280 కోట్ల అవినీతి చేసినట్లు తప్పుడు ప్రచారాలు చేశారు కిరాణా షాపుల మాదిరిగా పట్టిక తయారు చేసి ప్రచురించారు ఇసుకలో 150కోట్లు అవినీతి చేసినట్లు తప్పుడు ఆరోపణలు చేశారు.
👉ఉదయగిరి నియోజకవర్గంలో ఇసుక ఎక్కడ దొరుకుతుందో మీరే చెప్పండి అని నేను ప్రశ్నిస్తున్నా. అలాంటిది ఇసుక లేని దగ్గర 150 కోట్ల అవినీతి ఎలా చేస్తాను ఉదయగిరి నియోజకవర్గం లో పెన్నానది లేదు.
👉పులిచింతల ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లు మీ పార్టీ సభ్యులే ప్రస్తుతం మీ పార్టీలోనే ఉన్నారు దీని పై నిజ నిజాలు తెలుసుకుని మాట్లాడమని సజ్జల,అనిల్ కుమార్ యాదవ్ గార్లకు తెలియజేస్తున్నాను.
👉నా కంపెనీ పేరు శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ నేను ఈ రాష్ట్రంలో కాంట్రాక్టు పనులు చేయటం లేదు.. పక్క రాష్ట్రంలో పనులు చేసుకుంటున్నాను.
నా పై ఇక ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం సరి కాదు నాపై చేసిన తప్పుడు ఆరోపణలకు క్షమాపణ చెప్పకపోతే సాక్షి మీడియా పై లీగల్ గా పరువు నష్టం దావా వేయాల్సి వస్తుంది.