అధికారులారా ..అర్హులకు సంక్షేమ పథకాలను దూరం చేయకండి!
**తహసీల్దారు బదిలీపై వెళ్ళిన ఆమె చేసిన అక్రమాలపై న్యాయ పోరాటం ఆగదు
**
పొదలకూరు మండల టీడీపీ నాయకులు
పొదలకూరు
ప్రభుత్వ సంక్షేమ పథకాలను రాజకీయ నేతల ఒత్తిళ్లలకు తలొగ్గి, నిజమైన అర్హులకు దూరం చేయవద్దని టీడీపీ మండల,పట్టణ అధ్యక్షులు తలచీరు మస్తానయ్య, బొద్దులూరు.మల్లిఖార్జున నాయుడు అన్నారు. సోమవారం స్థానిక సీనియర్ టిడిపి నాయకులు భాస్కర్ రెడ్డి నివాసం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో, లంచాలకు ఆశపడి నిజమైన పేదలకు, అర్హులకు మొండి చేయి చూప వద్దని వారు హితవు పలికారు. పొదలకూరు తహసీల్దారుగా మరో ఏడాది తన పదవీ కాలాన్ని పొడిగించాలని కోరినా, ఆమె చేసిన అక్రమాలు, అవినీతి ఆరోపణలన్ని తో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడంతో తహసీల్దారు పదవీకాలం పొడిగింపు చేయలేదని, సీసీఎల్ ఏకి సరెండర్ చేసిన కలెక్టర్ కి కృతజ్ఞతలు తెలిపారు. తహసీల్దారు బదిలీపై వెళ్ళిన ఆమె చేసిన అన్యాయాలు, అక్రమాలు ఆధారాలతో సహా ఉన్నాయని టీడీపీ న్యాయ పోరాటం నుంచి ఆమె తప్పించుకోలేదన్నారు. తమ దగ్గర వున్న ఆధారాలతో న్యాయస్థానాల్లో న్యాయపోరాటం చేస్తామన్నారు. పేదలకు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా అందాల్సిన సంక్షేమ పథకాలను, రక్షణ ను మండల అధికారుంతా పార్టీలకతీతంగా అందించాలన్నారు. ఈ రెండేళ్ళలో రైతులు పొందిన 1 బీలు, అండగళ్ళలో కొన్నింటిని తహసీల్దారు పోతూ పోతూ వెబ్ ల్యాండ్ లో తొలగించారని,ఆయా రైతులు వాటిని పరిశీలించుకోవాలని సూచించారు.అవినీతి,అక్రమాలపై పోరాటంలో టీడీపీ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కోవూరు. బక్కయ్య నాయుడు, నీలం సుందర్ రామిరెడ్డి,అక్కెం సుధాకర్ రెడ్డి,బొగోలు.భాస్కర్ రెడ్డి, ఆదాల సుగుణమ్మ,కొమ్మి చిరంజీవి,శ్రీనివాసులు,వెంకట రెడ్డి,ఆదాల మురళి పాల్గొన్నారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 79వ ప్రయోగానికి సిద్ధమైంది. నెల్లూరులోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఆగస్టు 12 తెల్లవారుజామున 5.43గంllలకు
జీఎస్ఎల్వీ ఎఫ్13 ప్రయోగం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరోనా కారణంగా దాదాపు 18 నెలలపాటు ప్రయోగాలను నిలిపివేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో పీఎస్ఎల్వీ ప్రయోగం తర్వాత కరోనా విజృంభించడంతో ప్రయోగాలు ఆగిపోయాయి. ఇక ఆగస్టులో తిరిగి లాంచింగ్ కి ఏర్పాట్లు ప్రారంభించారు. కాగా జీఎస్ఎల్వీ ఎఫ్ 10 ప్రయోగం ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడింది. ఐదవసారి విజయవంతం చేయడానికి ఇస్త్రో శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తున్నారు.
జీఎస్‌ఎల్‌వీ ఎఫ్10 ద్వారా 2,268 కిలోల బరువు కలిగిన భూ పరిశీలన ఉపగ్రహం (ఈవోఎస్-03) అనే నూతన ఉప గ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులో భూ స్థిర కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటి వరకు భూమిని పరిశీలించేందుకు సూర్యానువర్థన ధృవ కక్ష్య వరకు మాత్రమే ఉపగ్రహాలు పంపింది భారత్.. సూర్యానువర్థన ధృవ కక్ష్య భూమి నుంచి 506 నుంచి 830 కిలో మీటర్ల ఎత్తులో ఉంటుంది.
ఇక ఎప్పుడు పంపే భూ పరిశీలన ఉపగ్రహం (ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్) భూమి నుంచి 36 వేల కిలోమీటర్ల ఎత్తులో ఉండనుంది. ఈసారి ఈవోఎస్-03 అనే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్‌ను మొట్టమొదటిసారిగా భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టేవిధంగా ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు.
ఇక దీని ప్రత్యేకతలను తెలుసుకుందాం
► శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఇప్పటి వరకు 78 ప్రయోగాలు జరిగాయి.. ఇప్పుడు జరిగేది 79వ ప్రయోగం ► జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగాల సిరీస్‌లో 14వ ప్రయోగం.. ► దేశ భద్రత అవసరాలు, రక్షణ వ్యవస్థకు అనుసంధానం, దేశంలో ఉపద్రవాలు/విపత్తులు సంభవించినపుడు ముందస్తు సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఈవోఎస్-03 రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. ► ఈ ఉపగ్రహం భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తు నుంచి అత్యంత పవర్‌ఫుల్ కెమెరాలతో 50 మీటర్ల నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో భూమిపై జరిగే మార్పులను ఎప్పటికప్పుడు ఛాయా చిత్రాలను తీసి పంపిస్తుంది. సుమారు 10 సంవత్సరాలు ఈ ఉపగ్రహం తన సేవలను అందిస్తుంది.
అమరావతి రాజధానిలో రైతుల నిరసనలు 600వ రోజుకు చేరుకున్నాయి. భారీ ర్యాలీలకు రాజధాని రైతులు పిలుపునిచ్చారు. భారీగా పోలీసులు మోహరించారు. రాజధానిలోకి కొత్తవారిని అనుమతించడం లేదు. రాజధానిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
ప్రకాశం బ్యారేజీ, సీతానగరంతో పాటు రాజధాని ప్రాంతంలో బారీగా పోలీసులు మోహరించారు. ప్రకాశం బ్యారేజీ సహా కరకట్ట వెంట పోలీసులు ఆంక్షలు విధించారు. కరకట్టపై 4 చోట్ల చెక్ పోలీసులు ఏర్పాటు చేశారు. కరకట్టపై వాహనాలను అపి చెక్ చేస్తున్నారు.
మరోవైపు రాజధాని ప్రాంతంలోకి మీడియాకు అనుమతి నిరాకరించారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మీడియా ప్రతినిధులను పోలీసులు నిలిపివేస్తున్నారు. కరకట్టపై మంతెన సత్యనారాయణ ఆశ్రమం వద్దే మీడియా ప్రతినిధులను అడ్డగించారు. రాజధానిలోకి మీడియాను పంపించవద్దని పైనుంచి ఆదేశాలు వచ్చాయని పోలీసులు అంటున్నారు.
విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా రాజధానికి వెళ్లే మార్గంలో అడుగడుగునా ఆంక్షలు విధించారు. ప్రకాశం బ్యారేజీ, సహా కరకట్ట వెంట పోలీసుల ఆంక్షలు విధించారు. కరకట్టపై నాలుగు చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున పోలీసులను మొహరించారు.
స్థానికులను మాత్రమే కరకట్ట రహదారిపై అనుమతిస్తున్నారు. ఆధార్ కార్డు లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉంటేనే రాకపోకలకు అనుమతిస్తున్నారు. వాహనాలను పూర్తిగా తనిఖీ చేశాకే పంపిస్తున్నారు. పోలీసు ఆంక్షలతో స్థానుకులు తీవ్ర ఇ
”వరుడు కావలెను” సినిమా రిలీజ్ కు ముందే వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాని బ్యాన్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు
ప్రముఖ పాటల రచయితపై కేసులు నమోదయ్యాయి. దీనికి కారణం ఈ చిత్రంలోని "దిగుదిగు దిగు నాగ" పాట.
మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల 'దిగు దిగు దిగు నాగ' లిరికల్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ చేశారు. తెలంగాణలో 'దిగు దిగు దిగు నాగ' అనేది చాలా పాపులర్ అయిన జానపద గేయం. నాగరాజుపై ప్రేమతో ఈ భజన గేయాన్ని పాడుకుంటారు. అయితే సినిమా పాటలో 'కొంపాకొచ్చిపోరో కోడెనాగ .. కొంపా ముంచుతాందోయ్ ఈడు బాగా' లాంటి పదప్రయోగాలు ఉపయోగించారు. దీనిపై వివాదం రాజుకుంది.
‘వరుడు కావలెను' సినిమాను బ్యాన్ చేయాలని శనివారం బాచుపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర రాష్ట్రీయ ధర్మ రక్షాదళ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. 'దిగు దిగు దిగు నాగ' పాట హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందని, ఆ పాటను వెంటనే తొలగించి బేషరుతుగా చిత్ర దర్శక, నిర్మాతలు క్షమాపణలు చెప్పాలని రాష్ట్రీయ ధరమ రక్షాదళ్ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు నరేంద్ర చౌదరి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు. శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాటకు తమన్ స్వరాలు సమకూర్చగా, అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించారు.
మరోవైపు ఇదే పాట వ్యవహారంలో పాటల రచయిత అనంత శ్రీరామ్ పై కేసు నమోదైంది. ఈ పాట దేవుడిని కించపరిచేలా ఉందని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు కేసు పెట్టారు. బీజేపీ మోర్చా నాయకులు నెల్లూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంత శ్రీరామ్ రచన హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు బిందూ రెడ్డి ఆరోపించారు. అనంత శ్రీరామ్‌తో పాటు ఆ సినిమా యూనిట్‌పై చర్యలు తీసుకోవాలని చిల్లకూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివాదాల సంగతి ఎలా ఉన్నా, దిగు దిగు నాగ పాట యూట్యూబ్‌లో మంచి వ్యూస్ దక్కించుకుంది.
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నాగశౌర్య, రీతూ వర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చిత్ర షూటింగ్ దాదాపు పూర్తైంది. కొన్ని రోజుల్లో మూవీని విడుదల చేయనున్నారు.
ఈ అనంత సృష్టిలో ఎన్ని వింతలో..ఎన్నెన్ని విలువైన వనరులో. అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తున్న మనిషి ఆ వనరులను తనకు అనుగుణంగా మార్చుకోవటానికి వాడుకోవటానికి ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాడు. సాధ్యం కానివాటిని కూడా అదుపులోకి తెచ్చుకుని ఉపయోగించుకోవటంలో మనిషి సక్సెస్ అవుతునే ఉన్నాడు. ఈ క్రమంలో మరో అద్భుతమైన అరుదైన అత్యంత విలువైనదానిని దక్కించుకోవటానికి ఆరాటపడుతున్నాడు. ఓ 'రాతి'ముక్క కోటాను కోట్ల రూపాల విలువ చేస్తుందని తెలిసి దాన్ని తేవటానికి యత్నాలు మొదలుపెట్టారు సైంటిస్టులు. అదేదో భూమ్మీద ఉన్నది కాదు..ఈ అనంత విశ్వంలో వాతావరణం లేని చోట తేలియాడుతోంది. అదేనండీ అంతరిక్షంలో.
అంతరిక్షంలో తిరుగుతున్న 'సైకీ' అనే ఓ గ్రహశకలం రూ. 72 లక్షల కోట్ల కోట్లు విలువైనదని తేలింది. అంతరిక్షం నుంచి దాన్ని భూమికి తెచ్చేసుకుంటే 72 పక్కన 19 సున్నాలు పెట్టినంత డబ్బు డబ్బు వస్తుంది. ఆ గ్రహ శకలాన్ని తవ్వి తెచ్చుకుందామని సైంటిస్టులు
ప్లాన్ చేస్తున్నారు. మరి 'సైకీ' అనే గ్రహశకలం విలువే కాదు ఈ పేరు వెనుక కూడా ఓ విశేషముంది. మరి ఆ సైకీ విశేషాలు మీకోసం..మనం కోసం..
సౌరకుటుంబంలో అంగారక, గురుగ్రహాల మధ్యలో ఈ సైకీ అనే ఆస్టరాయిడ్ (గ్రహ శకాలాలు) బెల్ట్ ఉంది. ఇతర గ్రహాల తరహాతో పాటు కొన్ని లక్షల ఆస్టరాయిడ్లు సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. వాటిలో ఈ 'సైకీ' అనే గ్రహ శకలం ఒకటి. ఆస్టరాయిడ్లు అంటే చాలా రకాల సైజుల్లో ఉంటాయి. కొన్ని మీటర్ల వ్యాసంలో ఉంటే మరికొన్ని భారీగా ఉంటాయి. మరికొన్ని ఐదు, పది కిలోమీటర్లంత కూడా ఉంటాయి. కానీ సైకీ వెరీ వెరీ స్పెషల్ అనే చెప్పాలి. సైకీ ఆస్టరాయిడ్ చాలా చాలా పెద్దది. దీని వ్యాసం ఏకంగా 140 మైళ్లు..అంటే 226 కిలోమీటర్లు. అంటే మన చంద్రుడి పరిమాణంలో సుమారు 15వ వంతు ఉంటుందన్నమాట. ఈ సైకీ గ్రహ శకలం భూమికి సుమారు 37 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది.
'సైకీ' పేరు వెనుక కథ.. ఇటలీకి చెందిన అంతరిక్ష పరిశోధకుడు అన్నిబేల్ గస్పారిస్ 1852 మార్చి 17న ఈ ఆస్టరాయిడ్‌ను తొలిసారిగా గుర్తించారు. గ్రీకుల 'ఆత్మ' దేవత 'సైకీ' పేరును దానికి పెట్టారు. ప్రేమకు దేవుడైన ఈరోస్ (రోమన్ మన్మథుడు) ను వివాహం చేసుకున్న ఆత్మ యొక్క గ్రీకు దేవత పేరు సైకీ. ఆ పేరునే ఈ గ్రహశకలానికి పెట్టారు. సైంటిస్టులు చాలా కాలంగా ఈ ఆస్టరాయిడ్‌పై పరిశోధనలు చేస్తున్నారు. నాసా వచ్చే ఏడాది దీని దగ్గరికి వ్యోమనౌకను పంపునుంది.
సైకీ ప్రత్యేకత.. సౌర కుటుంబంలో గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్లు ఏవైనా రాళ్లు, వివిధ మూలకాలతో కూడిన నేల, వాయువులు, మంచుతో కూడి ఉంటాయి. ముఖ్యంగా సిలికేట్లు ఎక్కువగా ఉంటాయి. కానీ 'సైకీ' ఆస్టరాయిడ్ మాత్రం చాలా వరకు లోహాలతో కూడి ఉన్నట్టు అమెరికా సైంటిస్టులు గుర్తించారు. ముఖ్యంగా ఇనుము, నికెల్‌తోపాటు బంగారం, ప్లాటినం, రాగి ఇతర అరుదైన లోహాలు ఉన్నట్టు అంచనా వేశారు. సౌర కుటుంబంలో ఇప్పటివరకు గుర్తించిన అన్ని గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్లలో అన్నింటికన్నా 'సైకీ' ఆస్టరాయిడ్ భిన్నమైనదని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన సైంటిస్టు కేథరిన్ డిక్లీర్ తెలిపారు. సైకీ మీద ఉన్న లోహాలను భూమ్మీదికి తేగలిగితే.. ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చంటున్నారు. సైకీపై ఉన్న లోహాల విలువ కనీసం 72 లక్షల కోట్ల కోట్లు (10 వేల క్వాడ్రిలియన్ డాలర్లు) ఉంటుందని శాస్త్రవేత్త డాక్టర్ ఎల్కిన్స్ టాంటన్ అంచనా వేశారు.
భారీ ఆస్టరాయిడ్‌నో ఢీకొని ముక్కలై మధ్యభాగం సైకీ..
సౌర కుటుంబం ఏర్పడిన తొలినాళ్లలోని ఓ గ్రహం మధ్యభాగమే (కోర్) ఈ ఆస్టరాయిడ్ అని అంచనా వేస్తున్నారు. సాధారణంగా గ్రహాలు ఏర్పడినప్పుడు తీవ్ర ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఆ సమయంలో బరువుగా ఉండే ఇనుము, ఇతర లోహాలు ద్రవస్థితిలో గ్రహం మధ్యభాగం (కోర్)లోకి చేరుతాయి. మన భూమి, అంగారకుడు, ఇతర గ్రహాల మధ్యభాగంలో కొన్ని వందల కిలోమీటర్ల మేర లోహాలు ఉంటాయి. అలాంటి ఓ గ్రహం వేరే గ్రహాన్నో, భారీ ఆస్టరాయిడ్‌నో ఢీకొని ముక్కలై ఉంటుందని.. దాని మధ్యల ముక్కే ఈ 'సైకీ' ఆస్టరాయిడ్ అని సైంటిస్టులు చెప్తున్నారు. దీనిని పరిశీలించడం ద్వారా గ్రహాలు ఏర్పడినప్పటి పరిస్థితులను తెలుసుకోవచ్చని.. కోర్ ఎలా ఏర్పడుతుంది? దాంట్లో ఏమేమి ఉంటాయి? అనేది పరిశోధనల ద్వారా గుర్తించవచ్చని అంటున్నారు.
2022 లోనే నాసా వ్యోమనౌక ప్రయాణం సైకీ ఆస్టరాయిడ్‌పై విస్తృతంగా పరిశోధన చేయడం కోసం నాసా శాస్త్రవేత్తలు వ్యోమనౌకను పంపనున్నారు. 2022 మార్చిలో అమెరికాలోని ఫ్లారిడా నుంచి ఈ 'సైకీ స్పేస్‌క్రాఫ్ట్'ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వ్యోమోనౌక సుమారు మూడున్నరేళ్లు ప్రయాణించి సైకీని చేరుకుంటుంది. అంటే 2022లో బయలుదేరితే అది సైకీని 2026లో చేరుకుంటుందన్నమాట. అలా వెళ్లిన వ్యోమోనౌక రెండు సంవత్సరాలపాటు సైకీ చుట్టు చక్కర్లు కొట్టి..పరిశోధనలు చేస్తుంది.వాటిని సైంటిస్టులకు చేరవేస్తుంది.
ఒక అథ్లెట్‌గా రాణించాలంటే శారీరక ధృఢత్వం చాలా అవసరం. అన్ని విధాలా ఫిట్‌గా ఉన్నవారు మాత్రమే అథ్లెట్‌గా విజయాలు సాధించగలరు.
పీటీ ఉష, అంజూ బాబీ జార్జ్, మిల్ఖా సింగ్ వంటి కొద్ది మంది భారతీయులు మాత్రమే అథ్లెటిక్స్‌లో ప్రపంచ స్థాయి విజయాలు సాధించారు. ఈ ముగ్గురూ కొద్ది పాటి తేడాతో ఒలింపిక్ పతకాలకు దూరమయ్యారు. ఆ వెలితిని నీరజ్ చోప్రా భర్తీ చేశారు.
టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌ను 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నారు. అయితే, నీరజ్ చోప్రా జావెలిన్ విసరడం ఎప్పుడు ప్రారంభించారో తెలుసా? ఒలింపిక్ పతకం వరకూ ఆయన సాగించిన ప్రయాణంలోని అయిదు కీలకమైన మలుపులివే.
1. పానిపట్ కుర్రాడి 11 ఏళ్ల శ్రమ
హర్యానాలోని పానిపట్ సమీపంలో ఉన్న ఖాండ్రా గ్రామంలో నీరజ్ జన్మించారు. వారిది రైతు కుటుంబం. నీరజ్ 2010లో పానిపట్‌లోని క్రీడా మైదానంలో జస్బీర్ సింగ్ జావెలిన్ విసురుతుంటే చూశారు. అప్పుడు ఆయన వయసు 11 ఏళ్లు. అది ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన దృశ్యం.
"ఆ ఆటలోని వేగం నన్ను మురిపించింది. జస్బీర్ దేహ దారుఢ్యం, అతను పరిగెట్టే తీరు నాకెంతో స్ఫూర్తినిచ్చింది. ఆటలు చూడడం నాకిష్టంగా ఉండేది. కానీ, ఈ ఆట చూశాక నాకే ఆడాలనిపించింది" అని నీరజ్ కొన్నేళ్ల కిందట చెప్పారు.
BEN STANSALL
2. అప్పుడు నీరజ్ బరువు 80 కిలోలు
పాలు, వెన్న అమ్ముకునే రైతు కుటుంబంలో పెరిగిన నీరజ్ అప్పుడు చాలా బరువుగా ఉండేవారు. వాళ్ల నాన్న అతడిని బరువు తగ్గించడం కోసం పానిపట్‌కు తీసుకొచ్చారు. జావెలిన్ ప్రాక్టీస్‌లోనే ఉంటే బరువు తగ్గవచ్చని ఆయన భావించారు.
నీరజ్‌కు ఆ ఆట బాగా నచ్చింది. అదే ఆయనకు సర్వస్వమైపోయింది. మొదట్లో ఆయన పానిపట్‌లో జై చౌదరి వద్ద శిక్షణ తీసుకున్నారు. ఆ తరువాత పాటియాలా స్పోర్ట్స్ అథారిటీ సెంటర్లో ప్రపంచ ప్రఖ్యాత జావెలిన్ క్రీడాకారుడు యువే హూన్ స్వయంగా నీరజ్‌కు ప్రొఫెషనల్ శిక్షణ ఇచ్చారు. జావెలిన్‌లో 100 మీటర్ల రికార్డును సృష్టించిన ఏకైక క్రీడాకారుడు యువే హూన్.
నీరజ్ 2016లో అండర్-20 వరల్డ్ చాంపియన్‌షిప్ గెలిచారు. 2018 కామన్‌వెల్త్, ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు గెల్చుకున్నారు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయ జావెలిన్ ఆటగాడు నీరజ్. ప్రస్తుతం ఆయన స్వీడన్‌కు చెందిన క్లాజ్ బార్టోనెజ్ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు.
3. ఒలింపిక్స్‌కు ముందు కుడి చేతికి గాయం
ఆటల్లో గాయాలు అవుతూనే ఉంటాయి. అయితే, కొన్ని గాయాలు కెరీర్‌ను దెబ్బతీసేవిగా ఉంటాయి. 2012లో పానిపట్‌లో బాస్కెట్ బాల్ ఆడుతున్నప్పుడు నీరజ్ మణికట్టుకు గాయమైంది. ఆ గాయం నుంచి కోలుకుని మళ్లీ ఆట కొనసాగించారు.
మళ్లీ 2019లో అదే చేతికి గాయమై దాదాపు 8 నెలలు క్రీడకు దూరమయ్యారు. ఆ గాయం నుంచి కోలుకోవడం నీరజ్‌కు సవాలుగా మారింది. ఎట్టకేలకు ఇండియన్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ నిర్వహించిన టెస్ట్ కాంపిటీషన్లో ఆయన 83 మీటర్ల దూరానికి జావెలిన్ విసరగలిగారు.
ఆయన పట్టుదల, నిర్విరామ శ్రమ ఎలాంటిదో అసలైన వేదిక మీద నిరూపితమైంది. ఒలింపిక్స్‌లో నీరజ్ 87.58 మీటర్ల దూరానికి జావెలిన్ త్రో చేసి గోల్డ్ మెడల్ సాధించారు.
4. స్కూలు చదువు వదిలేయాల్సి వచ్చింది
పన్నెండేళ్ల వయసులో జావెలిన్ త్రో ఆడడం ప్రారంభించిన నీరజ్ స్కూలు చదువును మధ్యలోనే వదులుకోవాల్సి వచ్చింది. 10, 12 తరగతుల ప్రైవేటుగా కట్టి పాసయ్యారు.
ఇప్పుడు కురుక్షేత్ర యూనివర్సిటీ నుంచి కరెస్పాండెన్స్ బీఏ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. 18 ఏళ్ల వయసులో స్పోర్ట్స్ కోటా ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం వచ్చింది డిగ్రీ లేకపోయినా ఆయనకు డిప్యూటీ సుబేదార్‌గా ప్రమోషన్ ఇచ్చారు.
రాజ్‌పుతానా రైఫిల్స్‌లో ఉన్న నీరజ్‌కు ఒలింపిక్ మెడల్ గెలవగానే మొదటి ప్రశంసలు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నుంచే లభించాయి.
5. నీరజ్ ఇప్పటిదాకా గెలిచిన పతకాలు, అవార్డులు
19 ఏళ్ల వయసులో అండర్-20 ప్రపంచ చాంపియన్‌షిప్ గెలవడంతో నీరజ్ మొదటిసారి వార్తల్లోకెక్కారు. అప్పుడు కూడా ఆయన 86.48 మీటర్లతో ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆ ఘనత సాధించినందుకు ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ ఆయనను అభినందిస్తూ ఒక పోస్ట్ రాశారు.
2018లో నీరజ్ కామన్‌వెల్త్ క్రీడల్లో, ఆసియన్ గేమ్స్‌లో స్వర్ణ పతకాలు గెలిచారు. అదే ఏడాది భారత ప్రభుత్వం ఆయనను అర్జన అవార్డుతో సత్కరించింది.
ఇదీ పానిపట్ పల్లె నుంచి టోక్యో ఒలింపిక్ గోల్డ్ దాకా నీరజ్ సాగించిన ప్రయాణం. ఈ ప్రయాణంలో ఆయన ప్రతి దశలోనూ ముందడుగే వేశారు. స్థిరంగా ఎదుగుతూ వచ్చారు.
శ్రీ పెనుశిల లక్ష్మి నరసింహ స్వామి వారి క్షేత్రంలో.. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి..స్వామి వారి ఆశీస్సులు పొందిన మాజీమంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి