ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బస్సు యాత్రకు సంబంధించిన కరపత్ర ఆవిష్కరణలో భాగంగా నెల్లూరు జిల్లా చేరుకోవడం జరిగింది. నెల్లూరు జిల్లాలో ఉన్న ముస్లిం ప్రజా సంఘాలు మరియు వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న మైనారిటీ నాయకులు సమక్షంలో కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది... ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఉద్దేశం ముస్లిం సమస్యల పరిష్కారానికై ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలుకై.. త్వరలో మదనపల్లి నుంచి వైజాగ్ వరకు బస్సు యాత్ర చేయబోతున్నాము.. ఈ బస్సు యాత్ర జయప్రదం చేయాలని నెల్లూరు జిల్లాలో ఉండే నాయకులను కోరడం జరిగినది,ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ షేక్ దస్తగిరి,ముఖ్య సలహాదారుగా షేక్ మస్తాన్ వలీ, అధికార ప్రతినిధి జియావుల్ హక్ రాష్ట్ర కో కన్వీనర్ షేక్ హమీద్,మిడియా ప్రతినిధి ఉమర్ నెల్లూరు జిల్లా కన్వీనర్ సయ్యద్ జాకీర్,ఈ కార్యక్రమంలో మైనారిటీ రైట్స్ ఫోరం నెల్లూరు జిల్లా మొయిన్ గారు, కలాం గారు, ఫిరోజ్ గారు పాల్గొనడం జరి
ఈనెల 12న జిఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం,శ్రీహరికోటలో సర్వం సిద్ధం
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) నుంచి ఈ నెల 12వ తేదీనా జిఎస్ఎల్వీ - ఎఫ్ 10 రాకెట్ ప్రయోగం జరగనుంది. షార్ లోని రెండో ప్రయోగ వేదిక నుండి 12వ తేదీ ఉదయం 5.43 గంటలకు ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. దేశ రక్షణ వ్యవస్థ, విపత్తుల నిర్వహణకు ఉపకరించే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్–3 అనే ఉపగ్రహాన్ని ఈ ప్రయోగం ద్వారా రోదసిలోకి పంపనున్నారు. 2,268 కిలోల బరువు కలిగిన ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్‌ను (దూర పరిశీలనా ఉపగ్రహం) భూస్థిర కక్ష్యలోకి మొట్ట మొదటిసారిగా పంపిస్తున్నారు. జీఎస్‌ఎల్‌వీ మార్క్2 సిరీస్‌లో ఇది 14వ ప్రయోగం. 2020 జనవరి నెలలోనే ఈ ప్రయోగాన్ని నిర్వహించాల్సి ఉండగా సాంకేతిక లోపాలు తలెత్తిన కారణంగా 4 సార్లు ప్రయోగం వాయిదా పడింది. ఈ ఏడాది కరోనా వల్ల ప్రయోగాలన్నీ వాయిదా పడ్డాయి. అవరోధాలన్నీ అధిగమించి ఈ నెల 12న ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఈ ఏడాదిలో ఇది రెండో ప్రయోగం కావడం విశేషం.
అదుపుతప్పి పొలాల్లోకి తీసుకెళ్లినా ఆర్టీసీ బస్సు.
నెల్లూరు నుండి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్ పెళ్లకూరు మండలం తెంకాయతోపు వద్ద అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది ఆర్.టి.సి బస్సులో ప్రయాణిస్తున్న ఒక్కరికీ మాత్రమే స్వల్ప గాయలు గాక మిగతా ప్రయాణిస్తున్న వాళ్ళు క్షేమంగా ఉన్నారని పెళ్లకూరు ఎస్ఐ మనోజ్ కుమార్ తెలియజేశారు.పొలంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఏమైనా గాయాలు అయి ఉంటాయని అక్కడే ఉన్న స్థానికులు 108కు సమాచారం అందించగా 108 వాహనం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుoది.అనంతరం పెళ్లకూరు పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ క్లియర్ చేస్తూ వాహనాలను తరలిస్తున్నారు..