నెల్లూరు జిల్లా-కోవూరు నియోజకవర్గం
ఇందుకూరుపేట మండలం పల్లిపాడు గ్రామం లో జరుగుతున్న పనులు, కరోనా నియంత్రణకై తీసుకుంటున్న చర్యల పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన
మాజీ మంత్రి, కోవూరు శాసనసభ్యులు
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు
ఈ కార్యక్రమంలో
నెల్లూరు జిల్లా DCMS ఛైర్మన్ వీరి చలపతిరావు , నెల్లూరు జిల్లావిజయ డైరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు, ఇందుకూరుపేట కో-పరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ మవులూరు శ్రీనివాసులురెడ్డి దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, జయరామ్ స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు
చెంగాళమ్మను దర్శించుకున్న శాసనసభ ఉపసభాపతి శ్రీ కోన రఘుపతి కుటుంబ సభ్యులు.
సుళ్లూరుపేట శ్రీ శ్రీ చెంగాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి శ్రీ కోన రఘుపతి కుటుంబ సభ్యులు. చెంగాలమ్మ ఆలయం వద్ద ఉపసభాపతి కి స్వాగతం పలికిన సుళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య,ఆర్డిఓ సరోజిని, మున్సిపాల్ చైర్ పర్సన్, వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొ
జల వనరులు కాదు.... ధన వనరుల శాఖ మంత్రి....
పులిచింతల ప్రాజెక్టు పై అవగాహన తెచ్చుకో
చేతకాని దద్దమ్మ మంత్రి అనిల్
మంత్రి పదవిని రక్షించుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై విమర్శలు
మంత్రి అనిల్ పై విరుచుకుపడ్డ టిడిపి నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి
నెల్లూరు, ఆగస్ట్..7...
ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో మంది దిగ్గజాలు జలవనరుల శాఖ నిర్వహించి మంచి పేరు తీసుకు వచ్చారని కానీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వంటి అవినీతి మంత్రి లేడని జలవనరుల శాఖను ధన వనరుల శాఖగా మార్చి వేసిన ఘనత మంత్రి అనిల్ కే దక్కుతుందని టిడిపి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నెల్లూరు నగరంలోని ఆయన నివాసంలో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అవగాహన లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ముందు పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర వివరాలు తెలుసుకొని మాట్లాడాలని వ్యంగంగా వ్యాఖ్యానించారు. పులిచింతల ప్రాజెక్టును ప్రారంభించింది దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. అప్పుడే జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిపోయిందన్నారు.
డబ్బులు మిగుల్చుకోవాలన్న లక్ష్యంతో 33 గేట్లు పులిచింతలకు పెట్టాల్సి ఉంటే 24 గేట్లు మాత్రమే పెట్టారని వివరించారు.. ఒక్కసారిగా పులిచింతల్లో నీటి ప్రవాహం పెరిగిపోవడంతో గేట్లు కొట్టుకో కావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాదం పెట్టిన తర్వాత రాష్ట్రం అధోగతి పాలు అయిందని కనీసం ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకు కూడా ఆర్థిక పరిస్థితి లేకుండా పోయిందన్నారు. చివరకు రైతులు కూడా క్రాప్ హాలిడే ప్రకటించారంటే ముఖ్యమంత్రి వైయస్ జగన్ పరిపాలన ఎలా ఉందో అర్థమవుతోందన్నారు.. ప్రజా వేదిక కూల్చివేత దగ్గర్నుంచి ముఖ్యమంత్రి వైయస్ జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు
నెల్లూరు పెన్నా నదిలో ఇసుక, గ్రావెల్ తవ్వకాల ద్వారా మంత్రి అనిల్ వందల కోట్లు దోచుకున్నాడని విమర్శించారు. చివరకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పై కూడా కేసు పెట్టడంలో మంత్రి అనిల్ హస్తం ఉందని ఆరోపించారు. సొంత పార్టీ వ్యక్తుల మీద కేసులు పెట్టిస్తున్న మంత్రి అనిల్ ను ఏం పిలవాలో అర్థం కావడం లేదన్నారు. తన మంత్రి పదవి పోతుందన్న సంకేతాలు రావడంతో దానిని కాపాడుకునేందుకు నోటికి ఇష్టం వచ్చినట్లు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నారని ధ్వజ మెత్తారు.
నెల్లూరు వెంకటాచలం మండలం , చెముడుగుంట వద్ద నున్న శ్రిడ్స్ కళ్యాణమండపం లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల రక్షణకోసం తీసుకువచ్చిన దిశ యాప్ అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ సభాహక్కుల కమిటి చైర్మన్ , సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి , జిల్లా కలెక్టర్ కెవిన్ చక్రధర్ బాబు ,సౌత్ కోస్టల్ జోన్ డి.ఐ.జి త్రివిక్రమ్ వర్మ , జిల్లా యస్.పి. విజయారావు, ఏ ఎస్పీ వెంకటరత్నం పాల్గొన్నారు.నెల్లూరు జిల్లాలో దిశ యాప్ పై అవగాహనకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరగడం ఇదే మొదటిసారి... ముఖ్యమంత్రి మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన ఈ యాప్ పై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించారు.దిశ యాప్ పై అవగాహన కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సర్వేపల్లి ఎమ్మె
కోవూరు మండలం లోని పోతిరెడ్డి పాలెం తిప్ప గిరిజన కాలనీ లో జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి శనివారం సాయంత్రం పర్యటించారు ఈ సందర్భంగా అక్కడ జగనన్న కాలనీ లకు సంబంధించిన లేఅవుట్ ను పరిశీలించారు. లేఔట్లకు సంబంధించి మౌలిక వసతులను పరిశీలించి స్థానిక అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు
నెల్లూరు రూరల్ పరిధిలోని మన్నవరప్పాడు లో జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా సర్వే కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఎం. ధనలక్ష్మి మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ కంఠం భూ సర్వే సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఈవోపీఆర్డీ, సర్వే అధికా
కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు సిటీ జనసేన పార్టీలో ముస్లిం మైనారిటీ నాయకుల చేరిక
----------------
నేడు నెల్లూరు సిటీ, 15 వ డివిజన్, బాలాజీ నగర్ ప్రాంతానికి చెందిన ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ ఖాదర్ బాషా గారు మరియు స్థానిక మైనారిటీ యువత 50 మంది జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీ లో చేరారు. స్థానిక అన్నపూర్ణ అపార్టుమెంట్ సమీపంలో జరిగిన చేరికల కార్యక్రమంలో కేతంరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ కులాలను మతాలను కలుపుకుని పోవడం అనే జనసేన పార్టీ సిద్ధాంతాన్ని మెచ్చి మైనారిటీ యువత పార్టీలో చేరడం జరిగిందన్నారు. జనసేన పార్టీలో పాలిట్ బ్యూరో నుండి అనేక పదవుల్లో ముస్లింలకు పెద్ద పీట వేయడం జరిగిందన్నారు. తమ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ముస్లిం మైనార్టీలంటే ఎనలేని ప్రేమాభిమానాలు ఉన్నాయన్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండన్న జగన్ రెడ్డి గారికి అందరూ అండగా నిలబడి ఛాన్స్ ఇచ్చాక జరుగుతున్న ప్రభుత్వ పరిపాలన తీరుని ప్రజలు తట్టుకోలేకపోతున్నారని, ప్రజాధనాన్ని పప్పు బెల్లాలు పంచినట్లు పంచి వృథా చేస్తూ, ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి, పథకాలకు డబ్బులు సర్దడానికి చెత్తకి కూడా పన్నులు వేసే పరిస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2024లో వేరే ప్రత్యామ్నాయం లేదని, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరి ఆశీస్సులతో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారన్నారు. నెల్లూరు సిటీలో గతమెంతో వైభవంగా ఉన్న ముస్లిం మైనారిటీల పరిస్థితి ప్రస్తుతం ఓటు బ్యాంకు రాజకీయంగా మారిపోయిందని, మైనారిటీలలోనే వర్గాలను సృష్టించి వైసీపీ నాయకులు అభివృద్ధి అనేదే లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చిన నామినేటడ్ పదవుల్లో కూడా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అయిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ముస్లిం మైనారిటీలకు అన్యాయం చేసారని తెలిపారు. జనసేన పార్టీ అధికారం లోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితేనే అన్ని వర్గాలకు సమాన న్యాయం జరుగుతుందని ఆ దిశగా అందరం కృషి చేద్దామని నూతనంగా చేరిన మైనారిటీ సోదరులను కేతంరెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, శ్రీను ముదిరాజ్, మోష, శ్రీకాంత్ యాదవ్, గణేష్, హేమంత్ రాయల్, ముస్లిం మైనారిటీ యువత ఖాలేషా, రబ్బాని, గయాజ్, జహీర్ తదితరులు పాల్గొన్నారు.