నెల్లూరు వెంకటాచలం మండలం , చెముడుగుంట వద్ద నున్న శ్రిడ్స్ కళ్యాణమండపం లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల రక్షణకోసం తీసుకువచ్చిన దిశ యాప్ అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ సభాహక్కుల కమిటి చైర్మన్ , సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి , జిల్లా కలెక్టర్ కెవిన్ చక్రధర్ బాబు ,సౌత్ కోస్టల్ జోన్ డి.ఐ.జి త్రివిక్రమ్ వర్మ , జిల్లా యస్.పి. విజయారావు, ఏ ఎస్పీ వెంకటరత్నం పాల్గొన్నారు.నెల్లూరు జిల్లాలో దిశ యాప్ పై అవగాహనకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరగడం ఇదే మొదటిసారి... ముఖ్యమంత్రి మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన ఈ యాప్ పై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించారు.దిశ యాప్ పై అవగాహన కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సర్వేపల్లి ఎమ్మె
కోవూరు మండలం లోని పోతిరెడ్డి పాలెం తిప్ప గిరిజన కాలనీ లో జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి శనివారం సాయంత్రం పర్యటించారు ఈ సందర్భంగా అక్కడ జగనన్న కాలనీ లకు సంబంధించిన లేఅవుట్ ను పరిశీలించారు. లేఔట్లకు సంబంధించి మౌలిక వసతులను పరిశీలించి స్థానిక అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు
నెల్లూరు రూరల్ పరిధిలోని మన్నవరప్పాడు లో జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా సర్వే కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఎం. ధనలక్ష్మి మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ కంఠం భూ సర్వే సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఈవోపీఆర్డీ, సర్వే అధికా
కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు సిటీ జనసేన పార్టీలో ముస్లిం మైనారిటీ నాయకుల చేరిక
----------------
నేడు నెల్లూరు సిటీ, 15 వ డివిజన్, బాలాజీ నగర్ ప్రాంతానికి చెందిన ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ ఖాదర్ బాషా గారు మరియు స్థానిక మైనారిటీ యువత 50 మంది జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీ లో చేరారు. స్థానిక అన్నపూర్ణ అపార్టుమెంట్ సమీపంలో జరిగిన చేరికల కార్యక్రమంలో కేతంరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ కులాలను మతాలను కలుపుకుని పోవడం అనే జనసేన పార్టీ సిద్ధాంతాన్ని మెచ్చి మైనారిటీ యువత పార్టీలో చేరడం జరిగిందన్నారు. జనసేన పార్టీలో పాలిట్ బ్యూరో నుండి అనేక పదవుల్లో ముస్లింలకు పెద్ద పీట వేయడం జరిగిందన్నారు. తమ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ముస్లిం మైనార్టీలంటే ఎనలేని ప్రేమాభిమానాలు ఉన్నాయన్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండన్న జగన్ రెడ్డి గారికి అందరూ అండగా నిలబడి ఛాన్స్ ఇచ్చాక జరుగుతున్న ప్రభుత్వ పరిపాలన తీరుని ప్రజలు తట్టుకోలేకపోతున్నారని, ప్రజాధనాన్ని పప్పు బెల్లాలు పంచినట్లు పంచి వృథా చేస్తూ, ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి, పథకాలకు డబ్బులు సర్దడానికి చెత్తకి కూడా పన్నులు వేసే పరిస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2024లో వేరే ప్రత్యామ్నాయం లేదని, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరి ఆశీస్సులతో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారన్నారు. నెల్లూరు సిటీలో గతమెంతో వైభవంగా ఉన్న ముస్లిం మైనారిటీల పరిస్థితి ప్రస్తుతం ఓటు బ్యాంకు రాజకీయంగా మారిపోయిందని, మైనారిటీలలోనే వర్గాలను సృష్టించి వైసీపీ నాయకులు అభివృద్ధి అనేదే లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చిన నామినేటడ్ పదవుల్లో కూడా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అయిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ముస్లిం మైనారిటీలకు అన్యాయం చేసారని తెలిపారు. జనసేన పార్టీ అధికారం లోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితేనే అన్ని వర్గాలకు సమాన న్యాయం జరుగుతుందని ఆ దిశగా అందరం కృషి చేద్దామని నూతనంగా చేరిన మైనారిటీ సోదరులను కేతంరెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, శ్రీను ముదిరాజ్, మోష, శ్రీకాంత్ యాదవ్, గణేష్, హేమంత్ రాయల్, ముస్లిం మైనారిటీ యువత ఖాలేషా, రబ్బాని, గయాజ్, జహీర్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేటీకరించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కె అజయ్ కుమార్, నగర కార్యదర్శి జి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ మంగళవారం నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడారు. 33 మంది అమరవీరుల త్యాగ ఫలితం విశాఖ ఉక్కు అని దీన్ని అమ్మే హక్కు కేంద్రానికి లేదని అన్నారు. నాడు పార్టీలకు అతీతంగా 70 మంది శాసనసభ్యులు తమ పదవులకు రాజీనామాలు చేసి కేంద్రం మెడలు వంచి విశాఖ ఉక్కు పరిశ్రమను సాధించారని దీన్ని అమ్మాలని చూస్తే ఆంధ్రులు సహించబోరని కేంద్రాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలోని ఏకైక ప్రభుత్వరంగ సంస్థ విశాఖ ఉక్కు అని, నవరత్నాల్లో ఒకటైన విశాఖ ఉక్కుకు గనులు కేటాయించకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని అయినా విశాఖ ఉక్కు కార్మికులు పట్టుదలతో పరిశ్రమకు ఆదాయాలు వచ్చేలా కష్టించి పనిచేస్తున్నారని అన్నారు. కరోనా కష్టకాలంలో భారతదేశంలోని అనేక రాష్ర్టాలకు విశాఖ ఉక్కు పరిశ్రమ ఆక్సిజన్ అందించిన విషయం కేంద్రంలోని పెద్దలు గ్రహించాలని హితవు పలికారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అన్నారు. లక్ష కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే పరిశ్రమని కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని లేకుంటే పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మూలం రమేష్, నగర అధ్యక్షులు ఏ శ్రీనివాసులు, సిఐటియూ జిల్లా కమిటీ సభ్యులు కత్తి శ్రీనివాసులు, కె పెంచలనర్సయ్య, నగర కమిటీ సభ్యులు పి సూర్యనారాయణ, మూలం ప్రసాద్, జీ సుధాకర్ రెడ్డి, సుధాకర్, ఆటో యూనియన్ నగర నాయకులు మురళి, నాగూర్, జగదీష్, లక్ష్మీనారాయణ, కొట్టుముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు రామయ్య, శ్రీనివాసులు, హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు కాశయ్య, ఎన్ వెంకటేశ్వర్లు, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.
పి.ఎం.జి.కే.ఏ.వై కింద
ఏ మేరకు సబ్సిడీ బియ్యాన్ని కేటాయించారు?
పార్లమెంట్లో అడిగిన నెల్లూరు ఎంపీ ఆదాల
గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పి.ఎం.జి.కె.ఏ.వై) కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఏడాది జూలై -నవంబర్ నెలల్లో ఏ మేరకు సబ్సిడీ బియ్యాన్ని కేటాయించారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మంగళవారం లోక్ సభలో ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగో విడత కింద కేటాయించిన మొత్తం కోటా ఎంత అని కూడా అడిగారు. దీనికి కేంద్ర గ్రామీణ అభివృద్ధి, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి రాత పూర్వకంగా సమాధానం చెబుతూ 198.78 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ఈ ఏడాది జులై -నవంబర్ నెలలకు ఈ కోటా కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది జులై- నవంబర్ నెలలకు ఆంధ్రప్రదేశ్ కు
6,70,552.58
మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను కేటాయించగా 2,466.909 కోట్ల రూపాయల సబ్సిడీ లభించినట్లు తెలిపారు. అలాగే మే- జూన్ నెలల్లో 268223.23 మెట్రిక్ టన్నులు కేటాయించామన్నారు. ఇందుకుగానూ కేంద్ర ప్రభుత్వం 986.77 కోట్ల రూపాయల సబ్సిడీని అం