శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని ఆయన నివాసంలో
ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన శ్రీమతి షేక్ సైదాని గారికి అభినందనలు తెలియజేసిన ఎమ్మెల్యే కాకాణి.
నెల్లూరు స్పెషల్ ఎన్ఫోస్మెంట్ అధికారులు గంజాయి అక్రమ రవాణాపై మెరుపు దాడులు నిర్వహించారు.విశాఖపట్నం నుండి చెన్నైకి ఆర్టీసీ బస్సులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి రూపంలో ఉన్న ద్రావణాన్ని ,గంజాయిని సీజ్ చేశారు.. ముందస్తు సమాచారంతో నెల్లూరులోని సుబ్బారెడ్డి స్టేడియం వద్ద ఆర్టీసీ బస్సును అపి అధికారులు తనిఖీలు చేయగా.. అందులో గంజాయి గుర్తించారు..మరోవైపు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ద్రవ రూపంలో ఉండే గంజాయి ద్రవాన్ని స్వాధీనం చేసుకున్నారు.వీటి విలువ సుమారు నాలుగు లక్షల ముప్పై వేలు ఉంటుందని అధికారులు తెలిపారు.
విశాఖనుంచి బెంగుళూరు ,చెన్నై కు అక్రమంగా తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో ఈ దాడులు నిర్వహించామని తెలియజేశారు.జిల్లాలో తొలిసారిగా లిక్విడ్ గంజాయి పట్టుకోవటం జరిగిందన్నారు.
గంజాయి తరలిస్తున్న ప్రవీణ్ రాజ్,హరీష్ రాజ్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని తెలియజేశారు.
కవల పిల్లలు హత్య కేసును ఛేదించిన పోలీసులు
కసాయి తండ్రి అరెస్ట్
తన భార్యపై అనుమానంతో పుట్టిన కవలపిల్లల లకు గుళికలు ను పాలలో కలిపి తండ్రే హత్య చేసినట్లు పోలీసులు కేసు దర్యాప్తులో తేల్చారు. గూడూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి మనుబోలు పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం ఆదివారం నిర్వహించారు. జూన్ నెల 20 వ తేదీన మనుబోలు మండలం వీరంపల్లి పంచాయతి పరిధిలోని రాజవోలు పాడు చెందిన పుట్టా వెంకట రమణయ్య బాలయపల్లె మండలం వెంగమాంబాపురం నకు చెందిన నగిరిపాటి నాగ రత్నమ్మను ప్రేమించి పెద్దలను ఎదిరించి కసుమూరులో పెండ్లి చేసుకున్నాడు.మొదటి పెళ్లి గురించి చెప్పకుండా దాచిందని భార్య మోసము చేసిందని భావించి, పిల్లలు ఇద్దరినీ చంపి భార్య మీద ఆ నింద మోపితే ఎలాగైనా విడిపించుకోవచ్చని క్రూర పూరితంగా అలోచించి, పిల్లలు తాగే పాలలో గుళికలు మందు కలిపి త్రాగించి, ఎవరికీ అనుమానము రాకుండా, ఏమి తెలియనట్లుగా అందరితో కలిసి పిల్లలను హాస్పిటల్స్ కు తిప్పుతూ, చివరికి చనిపోయినట్లు తెలపడంతో, ఇద్దరు పిల్లలను స్వగ్రామమునకు తీసుకునివచ్చినాడు,ఏమి తెలియనట్లుగా అందరితో కలిసి పిల్లల వద్ద కూర్చుని ఏడ్చినట్లు నటించాడు.ఈ కేసు దర్యాప్తులో భాగంగా కేసు వివరములు కుణ్ణంగా పరిశీలించి తేది.17.07.2021 న మద్యాహ్నము సుమారు 4.00 గంటలకు ముద్దాయిని వీరంపల్లి రోడ్ జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ కు తీసుకుని వచ్చి గూడూరు రూరల్ సి.ఐ శ్రీనివాసులు రెడ్డి మనుబోలు SI ముత్యాల రావు విచారణ చేపట్టారు. ముద్దాయి తన నేరాన్ని ఒప్పుకోవడంతో, ముద్దాయి ని 17.07.2021 న సాయంత్రం 5.30 గంటలకు మనుబోలు పోలీస్ స్టేషన్ నందు అరెస్ట్ చేయడమైనని పోలీసులు తెలిపారు.
ఈ కేసులో ముద్దాయిని అరెస్ట్ చేయుటలో కీలక పాత్ర పోషించిన గూడూరు రూరల్ సి ఐ పి. శ్రీనివాస రెడ్డి, మనుబోలు ఎస్ ఐ కె.ముత్యాలరావు, రాజు,నారయ్య, ఆదినారాయణ,విష్ణు,లాజర్ ల ను గూడూరు డి.యస్.పి. శ్రీ రాజగోపాల్ రెడ్డి అభినందించి, రివార్డులు అందజేసినాడు.
నుడా చైర్మన్ గా ఎంపికైన అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గార్లను మర్యాదపూర్వకంగా కలసి, పుష్పగుచ్చము అందించడం జరిగింది. అనంతరం రూరల్ ఎమ్మెల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆయనను శాలువాతో సత్క
ఏపి ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గా నియమించబడిన శ్రీమతి ఎస్.కె. సైదాని గారిని నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో అభినందించి సన్మానించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
🔹 దేశచరిత్రలోనే ఎన్నడూలేనివిధంగా ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనారిటీలకు 50% అన్ని రంగాలలోను పదవులు కేటాయించిన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔹 మహిళలు ఇంటికే పరిమితం కాకుండా రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో వారికి తాను అన్నిటికి అండగా ఉంటూ, భరోసా కల్పిస్తూ మహిళలకు రాజకీయంగా అధిక ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి గారిని ప్రశంసించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔹 మొదటినుంచి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన ఎస్.కే. రియాజ్ సతీమణి సైదాని గారిని ముఖ్యమంత్రి గారికి మానసపుత్రికగా ఉన్న ఏపి ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గా నియమించడం సంతోషించే విషయం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔹 పార్టీకోసం కష్టపడి పనిచేసిన ప్రతిఒక్కరికి తప్పకుండా ఫలితం దక్కుతుంది అనేదానికి నిదర్శనం నేడు సైదాని గారిని ఏపి ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గా నియమించడం. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి గారికి, జిల్లా మంత్రులకు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.