రౌడీ షీటర్ మల్లి ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నావని తమ కార్యకర్తలు సెంటర్ లో ఉంటే వారిపై దాడి చేశాడని..
- కమిషనర్ దినేష్ కుమార్
క్లీన్ ఆంధ్రప్రదేశ్ (CLAP) కార్యక్రమంలో భాగంగా పటిష్టమైన ప్రణాళికలతో ప్రతీ ఇంటి నుంచి చెత్తను సేకరించి, శాస్త్రీయ విధానంలో చెత్తనుంచి సంపద సృష్టించేందుకు విధానాలు అమలు చేస్తున్నామని, ప్రజలంతా సహకరించాలని నగర పాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. కార్యాలయంలో పారిశుద్ధ్య విభాగం అధికారులు, సచివాలయ కార్యదర్శులు, సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు పనిభారం తగ్గించేలా రాష్ట్ర ప్రభుత్వం నూతన వాహనాలను సమకూర్చుతోందని, ఆయా వాహనాల ద్వారా తడి, పొడి చెత్తలను వేరు వేరుగా సేకరించగలమని తెలిపారు. తడి చెత్తను సేంద్రీయ ఎరువులుగా, పొడి చెత్తను రీ సైకిల్ చేసి నూతన ఉత్పత్తుల తయారీకి, ప్లాస్టిక్ వ్యర్ధాల నుంచి ఇంధనాలను ఉత్పత్తి చేసే అధునాతన యంత్రాలను అందుబాటులోకి తెస్తున్నామని కమిషనర్ వివరించారు. నగర పాలక సంస్థ పరిధిలోని 167 సచివాలయాలకు ఒక్కో వాహనం వంతున అందజేసి, ప్రతీ ఇంటినుంచి నిర్దిష్ట సమయంలో చెత్తను సేకరించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. జులై నెల 8 వ తేదీన తొలి విడతగా కొన్ని వాహనాలు కార్పొరేషన్ కు చేరుకుంటాయని, అప్పటినుంచి చెత్త సేకరణ పనులు వేగవంతం చేస్తామని కమిషనర్ ఆకాంక్షించారు. స్వచ్ఛ నెల్లూరు సాకారానికి నగర ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, తమ వంతు బాధ్యతగా పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి దోహద పడాలని ఆయన కోరారు. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో రోజుకు రూ.4/- వంతున ప్రతీ ఇంటికి, స్లమ్ ప్రాంతాల్లో రోజుకు రూ.2/-- వంతున యూసర్ ఛార్జ్ వసూలు చేసేలా విధానాలు రూపొందించామని కమిషనర్ స్పష్టం చేసారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ ప్రసాద్, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, సెక్రటరీ హైమావతి తదితరులు పాల్గొన్నారు.
షెడ్యూల్డ్ కులాల మెజారిటీ గ్రామాల అభివృద్ధి కొరకు ప్రధాన్ మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన (పిఎమ్‌జివై) పథకం 2018-19 నుండి అమలు జరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుండి, ఈ పథకం ప్రధాన్ మంత్రి అనుసుచిత్ జాతి అభ్యుదయ్ యోజన (PM-AJAY) లో ఒక భాగంగా అమలు చేయబడుతుంది. ఈ పథకం మార్గదర్శకాల ప్రకారం ఎక్కువ ఎస్సీ మెజారిటీ గ్రామాలకు, సమర్థ అధికారం మరియు ప్రయోజనాలను విస్తరించే ఉద్దేశంతో ప్రస్తుత ఆర్దిక సంవత్సరం 2021-22 క్రింద దేశంలో 6055 గ్రామాలు దీని పరిధిని విస్తరించింది. అందులో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 54 అర్హత గల గ్రామాలను ఎంపిక చేయగా, అందులో 16 గ్రామాలు శ్రీపోట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లో ఈ పథకము అమలు కోసం అంగీకారం కొరియున్నారు. ఈ పథకము క్రింద ప్రతి గ్రామానికి 20.00 లక్ష్యల చొప్పున గ్రామ అభివృద్ధి పనులకు నిధులు మంజూరవుతాయి.
👉కోర్టుకు వెళ్తాం.. కార్యకర్తలను కాపాడుకుంటాం..
👉పిల్ల రౌడీలు కూడా విమర్శలు చేస్తుంటే నవ్వొస్తుంది..
👉ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది..
👉 ఈ ఘటనపై కోవూరు పెద్ద మనిషి
స్పందించాలి.. గౌరవాన్ని కాపాడుకోవాలి..
👉 పోలీసులు చేసే ఓవర్ యాక్షన్ ను గుర్తు పెట్టుకుంటాం..
👉వైసీపి అంతా బెట్టింగ్ రాయుళ్లు, మాఫియా డాన్లు, సాండ్ స్మగ్లర్ల్.