నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడంతో పాటు కరోనా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ పిలుపునిచ్చారు. కరోన సెకండ్ వేవ్ ఉదృతంగా వ్యాపిస్తుండడంతో నెల్లూరు నగరంలోని ఆర్టీసీ వద్ద అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వయంగా జిల్లా ఎస్పీ వాహనదారులకు మాస్కులు తొడిగారు. ఇంట్లో నుండి బయటికి వచ్చేటప్పుడు కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు
దేవినేని ఉమామహేశ్వరరావు
నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యలయములో ఏర్పాటు చేసిన పాత్రకా విలేఖరుల సమావేశంలోమాజీ మంత్రి వర్యుల శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావుమాట్లాడుతు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తుందని,మంత్రులు వాలంటీర్లు తో సమావేశాలు ఏర్పాటు చేసి తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి ఓటు వేయించాలని చెప్పి అధికార దుర్వినియోగం చేస్తున్నారని వారిపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో తెలుగుదేశం నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీ అబ్దుల్ అజీజ్ ,జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి శ్రీ చేజర్ల వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు
👉.. సవాల్ చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు ముగ్గురు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారని రేపు తిరుపతిలో గెలుపొందే పనబాక లక్ష్మితో కలుపుకుంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం నలుగురు ఎంపీలు రాజీనామా చేస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ కు ఉన్న 21 ఎంపీల చేత రాజీనామాలు చేయించే దమ్ము ధైర్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ఉందా అని టిడిపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవాల్ చేశారు. సూళ్లూరుపేట తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో తనకు అత్యధిక ఎంపీలు ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తానని ప్రగల్భాలు పలికిన జగన్ నేడు సాగిలపడ్డాడని ధ్వజమెత్తారు.. తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదని ఇప్పటికే ఆ పార్టీ నాయకులకు అర్థం అయిందని దీంతో రేపటి నుంచి డబ్బు సంచులతో వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు వివిధ ప్రాంతాల్లో ప్రత్యక్షం అవుతారని టిడిపి నేతలు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. గత రెండేళ్లలో నిత్యవసర వస్తువులు ఆకాశాన్నంటాయని అన్ని రంగాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘోర వైఫల్యం చెందారన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని తనదైన శైలిలో విమర్శలు సంధించారు
నెల్లూరు జిల్లాలో