శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం గ్రామంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల ప్రచారం నిర్వహించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
స్క్రోలింగ్ పాయింట్స్:
👉 ఏప్రిల్ 8 వ తేదీ జరిగే ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో ఏప్రిల్ 17వ తేదీన జరుగనున్న తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారు అందిస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేస్తున్నాం.
👉 ఆంధ్ర రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చేయని విధంగా కరోనా నేపథ్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని కుటుంబాలకు 3 కోట్ల 50 లక్షల విలువైన బియ్యం, వంటనూనెను పంపిణీ చేశాం.
👉 ఆంధ్రరాష్ట్రంలో ఏ శాసన సభ్యుడు సాధించని విధంగా 22 రెండు నెలల కాలవ్యవధిలో సర్వేపల్లి నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు, సిమెంటు డ్రైన్ల నిర్మాణం కోసం 320కోట్ల రూపాయలు, ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి అమర్చడం కోసం 36 కోట్ల నిధులు మంజూరు చేయించి, అభివృద్ధి పనులు చేపడుతున్నాం.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో గతంలో మాదిరిగా వర్గాలు సృష్టించి, ఉద్రిక్తతలు రేకెత్తించి, రాజకీయ లబ్ది ఆశించకుండా, సర్వేపల్లి నియోజకవర్గాన్ని శాంతి, సామరస్యాలతో తీర్చిదిద్దుతున్నాం.
👉 పోటీ చేయడం, ఓటమి పాలవడం ఎన్నికలు వస్తే పగటి వేషాలు వేసుకుని ప్రజలను మభ్యపెట్టే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి.
👉 తిరుపతి పార్లమెంటు పరిధిలోని మన సర్వేపల్లి నియోజకవర్గంలో అత్యధిక శాతం ఓట్లు పోలింగ్ చేయించి, భారీ మెజారిటీతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తిగారిని గెలిపించుకోవడానికి కృషి చేద్దాం.
సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు పంచాయతీ పరిధిలోని యాదవవీధి, కాకుమాను లేఅవుట్, తోకంచిలో
తిరుపతి ఎంపీగా శ్రీమతి పనబాక లక్ష్మిని గెలిపించాలని కోరుతూ ప్రచారం..
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, వైసీపీ రెండేళ్ల పాలనలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, అరాచకాలు వివరిస్తూ ప్రచారంలో ముందుకు సాగిన సోమిరెడ్డి..
చేతులు కట్టుకుని వైసీపీ ఎమ్మెల్యేల కింద బానిసలుగా బతికితే తప్ప ఎవరూ స్వతంత్రంగా జీవించడానికి లేదనేవిధంగా పరిస్థితులు..
అక్రమ కేసులు, అరెస్టులు, పోలీసులు, రెవెన్యూ అధికారులతో వేధింపులు, కక్షసాధింపులు..
రెండేళ్లలో సాధించిందేమన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ పాలనలో మేం చేపట్టిన పథకాలు, పనులు ఆపడమే...
తిరుపతి ఎంపీగా పనబాక లక్ష్మిని గెలిపిస్తే వచ్చే మూడేళ్లు వైసీపీ ఎమ్మెల్యేలు వళ్లు దగ్గరపెట్టుకుని పాలన సాగిస్తారని పిలుపు...
-ధ్వజమెత్తిన జనసేన నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
-------------------
రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ మంత్రి అయ్యాక తాను నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనే విషయం మరచినట్టు ప్రవర్తిస్తున్నారని, ఓట్లేసి గెలిపించిన నెల్లూరు సిటీ ప్రజలకు తూట్లు పొడుస్తున్నారని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన నెల్లూరు సిటీ 16వ డివిజన్ గుర్రాలమడుగు సంఘం, సర్వేపల్లి కాలువ ప్రాంతాల్లో పర్యటించారు. కాలువ ఆధునీకరణ పేరుతో ఏళ్ళ తరబడి నివాసం ఉండే పేదల గృహాలకు మంత్రి అనిల్ ఎసరు పెట్టారనే విషయం తెలుసుకుని బాధితులకు అండగా నిలిచేందుకు వెళ్లారు.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండే సమయంలో మంత్రి అనిల్ పేదలకు సంబంధించి ఎక్కడ గృహాలు తొలగిస్తున్నా తీవ్రంగా విరుచుకుపడే వారని గుర్తు చేసారు. ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేగా, అది కూడా మంత్రి హోదాలో అనిల్ చేస్తున్న పనులు చూస్తుంటే ఆనాడు సానుభూతి డ్రామాలు ఆడినట్లు కనిపిస్తుంది తప్పించి ప్రజల క్షేమం కోసం కాదని తెలుస్తుందన్నారు. డిసెంబర్ 25న నెల్లూరు సిటీలో పేద ప్రజలందరికీ ఇళ్ళ పట్టాలు ఇచ్చేశాం అని ఘనంగా ప్రకటించిన అనిల్ కనీసం పది శాతం లబ్దిదారులకు కూడా పట్టాలు ఇవ్వలేదని ఎద్దేవా చేసారు. ఇళ్ళ పట్టాలు రాక ప్రజలు సచివాలయాల చుట్టూ తిరుగుతుంటే ఇప్పుడేమో పట్టాలిచ్చేసాం కదా లేచి పోండని నెల్లూరు సిటీలో పలు ప్రాంతాల్లోని ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక్క గుర్రాలమడుగు సంఘం, సర్వేపల్లి కాలువ ప్రాంతంలోనే మూడొందలకు పైగా ఇళ్ళను తొలగించే ఏర్పాట్లు చేస్తున్నారని, ఆధునీకరణ పేరుతో బినామీ కాంట్రాక్టులు చేసుకుంటూ కోట్ల రూపాయలను కొల్లగొట్టే చర్య తప్పించి ఇది ప్రజల బాగు కోసం కాదని తెలిపారు. ఇక్కడి ప్రజలకు పీఎంఎవై అపార్ట్మ్మెంట్లలో కానీ, ఇళ్ళ స్థలం ఇచ్చి ఇళ్ళు కట్టించి పూర్తి స్థాయిలో గృహ ప్రవేశాలు జరిగిన తర్వాత మాత్రమే ఈ ఇళ్ళ జోలికి రావాలని, లేనిచో జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ప్రతిఘటిస్తామని కేతంరెడ్డి హెచ్చరించారు.
పై కార్యక్రమంలో.. నాయకులు పావుజెన్నీ చంద్రశేఖర్ రెడ్డి, 16 డివిజన్ నాయకులు శిరీషా రెడ్డి,
వెంకట్, శ్రీను, నాని, నాయకులు కుక్క ప్రభాకర్, రాజా, నాసర్, హేమంత్, సాయి మరియు స్థానికులు పాల్గొన్నారు.