శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి వారి దేవస్థానము, రంగనాయకులపేట, నెల్లూరు నందు ఈరోజు అనగా తేది. 24.03.2021 బుధవారం ఉదయం 6.15గంIIలకు ధ్వజారోహణ కార్యక్రమము జరిగినది. ఉభయకర్తలు ‘’పద్మశాలి బహుత్తమ సంఘం తరపున శ్రీ కోలాటి శ్రీనివాసులు తదితరులు’’. శ్రీ స్వామి అమ్మవార్లను ప్రత్యేక అలంకరణ చేసి మంగళవాయిద్యాల మధ్య ద్వజస్తంభాన్ని దర్భతో చేసిన పవిత్ర దర్భాన్ని, వస్త్రాన్ని ధ్వజస్తంభానికి అలంకరించి ప్రత్యేక పూజలు చేసారు. దూపదీప నైవేద్యాన్ని సమర్పించి ధ్వజారోహణ నిర్వహించారు. తరువాత శ్రీ స్వామి అమ్మవార్లను ఉత్సవంను పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమమునకు ఆలయ ఈఓ డబ్బుగుంట వెంకటేశ్వర్లు, దేవస్థాన ఫెస్టివల్ కమిటి శ్రీ శ్రీరామ్ వెంకట సురేష్, శ్రీ టి.వి.నరసింహాచార్యులు, శ్రీ చందులూరు రమేష్, శ్రీమతి పాలకీర్తి అమ్ముణ్ణి, శ్రీమతి మిరియాల శివ కామి, శ్రీ టి.శేషయ్య మరియు దేవస్థాన సిబ్బంది మరియు అర్చకులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్ధ ప్రసాదము స్వీకరించినారు.
తిరుపతి ఎన్నికల్లో తెగించి పోరాడదాం!-మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మీ
🌟 రేపు 24న పనబాక లక్ష్మి నామినేషన్
🌟 నెల్లూరు కలెక్టరేట్ లో ఉదయం 10 గం" లకు నామినేషన్
🌟 24 న ఉదయం 9 గం" లకు వి ఆర్ సి సెంటర్ వద్ద అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారీ ర్యాలీ తో కలెక్టరేట్ లో నామినేషన్
🌟అధికార పార్టీ అక్రమాలకు ఎదురొడ్డడమే ఏకైక మార్గం
🌟మొహమాటాలు ఇక చెల్లవు నేతలకు,కార్యకర్తలకు దిశానిర్దేశం
🌟అంతా బాగుందని చెప్పడం కాదు క్షేత్రస్థాయిలో ఫలితాలు చూపించాలి
🌟అలాంటివారికే పార్టీలో పెద్దపీట
🌟 టీడీపీ నాయకులు, కార్యకర్తలకు తిరుపతి ఉప ఎన్నిక పరివేక్షణ కమిటీ స్పష్టీకరణ
🌟ప్రతి అసెంబ్లీ సెగ్మెంటుకు 25 క్లస్టర్లు
🌟ఒక్కో క్లస్టర్‌కు ఒక ఇన్‌చార్జి
🌟ఒక్కో మాజీ మంత్రికి ఒక్కో సెగ్మెంటు
🌟24న పనబాక లక్ష్మి నామినేషన్‌కు భారీ స్థాయిలో జనసమూహం
🌟రోజుకో అంశంపై గడప గడపకూ ప్రచారం
🌟ఐదుగురు నేతలతో సమన్వయ కమిటీ
🌟విధేయతలు, మొహమాటాలు ఇకపై చెల్లవు .
🌟 సమావేశాలకు వచ్చి అంతా బాగుందని చెప్పడం కాదు.
🌟క్షేత్రస్థాయిలో ఫలితాలు చూపించాలి
🌟అలాంటివారికే పార్టీలో పెద్దపీట వేస్తాం
🌟తిరుపతి ఉప ఎన్నిక పరివేక్షణ కమిటీ
తెగించి పోరాడేవాళ్లకే పార్టీలో గుర్తింపు.. భవిష్యత్తులో అవకాశాలు లభిస్తాయన్నారు. తిరుపతి ఉప ఎన్నికపై ఆమె తిరుపతి పార్టీ నేతలతో సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు, యనమల రామకృష్ణుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్, ఎమ్మెల్యే పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన నేతలు, పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి తదితరులు హాజరయ్యారు.ఈ నెల 20 నుండిఅసెంబ్లీనియోజకవర్గాల వారీగా చర్చలు జరిగాయి
ఇటీవలి ఎన్నికల్లో కూడా వ్యక్తిగతంగా బలంగా పోరాడిన చోట్ల అనుకూల ఫలితాలు వచ్చాయన్నారు. 2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీ స్థానంలోని అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు వచ్చిన ఓట్లకంటే ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి వచ్చిన ఓట్లు ఎక్కువని చెప్పారు. లక్ష్మిని ఆమె జన్మదినం రోజున అభ్యర్థిగా ప్రకటించామని, ఆమె పారీ ్టకోసం అంకితభావంతో కష్టపడుతున్నారని టీడీపీ నేతలు పేర్కొన్నారు.
మరోవైపు తిరుపతి ఉప ఎన్నిక కోసం పైస్థాయిలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసిన అధినేత చంద్రబాబు నాయుడు ఇందులో అచ్చెన్నాయుడు, లోకేశ్, సోమిరెడ్డి, రవిచంద్రయాదవ్, పనబాక కృష్ణయ్య సభ్యులుగా నియమించి కేడర్ ను ఉత్తేజ పరిచారు అన్నారు.
పార్లమెంటరీ ఇన్‌చార్జి నరసింహయాదవ్ కూడా వీరితో కలిసి పనిచేస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని 25 క్లస్టర్లుగా విభజించి ఒక్కోదానికి ఒక రాష్ట్ర నాయకుడిని ఇన్‌చార్జిగా నియమిస్తారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంటుకు ఒక్కో మాజీ మంత్రిని ఇన్‌చార్జిగా చంద్రబాబు నియమించారు.
కార్యకర్తలతో సమావేశాలు పూర్తి
పనబాక లక్ష్మి 20 నుంచి పూర్తి స్థాయిలో ప్రచారంలోకి దిగారు. 20 నుంచి 23వ తేదీ వరకు ఒక్కో రోజు కొన్ని అసెంబ్లీ స్థానాల్లోని కార్యకర్తలతో భేటీ అయ్యారు. నాలుగురోజుల పాటు ఇలా కార్యకర్తలందరితో సమావేశమై అందరితో మమేకమై పార్టీ కేడర్ లో జోష్ పెంచారు.. 24న నామినేషన్ దాఖలు చేస్తారు. ఆమె తన నామినేషన్‌ను నెల్లూరు కలెక్టరేట్‌లో వేస్తారు.
నామినేషన్ అనంతరం వరుసగా 10రోజుల పాటు రోజుకో అంశంపై గడప గడపకూ ప్రచారం చేయాలని అధిష్టానం నిర్ణయించింది. ఇసుక కొరత, మద్యం విధానంలో లోపాలు, అరాచకాలు-దాడులు, అవినీతి.. తదితర అంశాలపై ప్రచారం నిర్వహిస్తారు.
క్లస్టర్ల ఇన్‌చార్జులుగా వెళ్లే నాయకులు తమ వెంట కార్యకర్తలను కూడా తీసుకెళ్లాలన్నారు. పార్లమెంటు పరిధిలోకి వచ్చే నెల్లూరు జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లకు కలిపి నెల్లూరు జిల్లాలో ఒక కార్యాలయం, చిత్తూరు జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి తిరుపతిలో ఒక కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు.
సమావేశాల్లో సోమిరెడ్డి ప్రత్యేక ఆకర్షణ- వైసీపీ పైఘాటు ఘాటు వ్యాఖ్యలు
తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యంగా మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కార్యకర్తలు,నాయకులకు హిత బోధ చేశారు,క్లస్టర్ల ఇన్‌చార్జులు వారి ప్రాంతాల్లోని 25 బూత్‌లకు చెందిన కమిటీలను చైతన్యవంతం చేసి సమన్వయం చేయాలని చెప్పారు. గ్రామస్థాయి పార్టీ కేడర్‌ను క్రియాశీలం చేసి తగిన దిశానిర్దేశం చేయాలని నిర్దేశించారు. జైల్లో పెట్టినా అందుకు సిద్ధమే.. తెగించి పోరాడతాం అని సోమిరెడ్డి సందర్భంగా అన్నారు.
గూడూరు పరిధిలోని A5 లో జరిగిన గూడూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో సోమిరెడ్డి పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు, ఈ మధ్య పార్టీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని వారం రోజులు జైల్లో పెట్టారు. ఆయనతో మాట్లాడాను. జైల్లో అటాచ్డ్ బాత్‌రూం ఉందా అని అడిగాను. ఉందన్నారు. ఇక ఇబ్బంది లేదు. జైల్లో పెట్టినా వెనకాడేది లేదు. తెగించి పోరాటం చేస్తా అని అన్నట్లు సమాచారం.
మీ కొడలకు ఒక్క అవకాశం ఇవ్వండి- పనబాక
తిరుపతి సభలో పనబాక లక్ష్మి మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడి, అంకితభావంతో పనిచేస్తానన్నారు. ప్రతి రోజూ ప్రజలను కలుస్తానని చెప్పారు.రేపు జరిగే నామినేషన్ కార్యక్రమానికి భారీగా టీడీపి నాయకులు,కార్యకర్తలు తరలి రావాలి అనీ పిలుపునిచ్చారు, మీ కోడలు,మీ బిడ్డకు తిరుపతి ఎంపీ గా ఒక్క అవకాశం ఇవ్వాలని పనబాక లక్ష్మీ కోరారు.
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు ఈ నెల 16 న మంగళవారం నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో వెనువెంటనే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. డాక్టర్ గురుమూర్తిని పార్టీ అభ్యర్థిగా వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలోనే ఖరారు చేశారు,ఈ విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని ప్రకటించారు. బుధవారం నుండి నామినేషన్ దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో
ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ,పంచాయతీరాజ్ శాఖ మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలుమాట్లాడుతూతిరుపతి ఉప ఎన్నికలో రికార్డ్ సృష్టిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. 3 లక్షల పైచిలుకుమెజారిటీసాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతి లోక్‌సభ పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ భారీగా గెలిచామని తెలిపారు. సీఎం జగన్ పరిపాలన వల్లే ఈ ఫలితాలన్నీ వచ్చాయి అని పేర్కొన్నారు.
తిరుపతి ఎంపీగా ఉన్న బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో ఉప ఎన్నిక జరుగుతోంది. దివంగత దుర్గాప్రసాద్ కుమారుడు బల్లి కల్యాణ చక్రవర్తికి ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి డాక్టర్ గురుమూర్తిని లోక్‌సభ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది అన్నారు,నమ్మిన సిద్ధాంతం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉంటారు అన్నారు.
సాధారణ ఫిజియోథెరపిస్ట్ అయిన గురుమూర్తి మొదటి నుంచి వైఎస్సార్ కుటుంబానికి, వైసీపీకి విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. వైసీపీ పెట్టినప్పటి నుంచి సీఎం జగన్ వెంట సామాన్య కార్యకర్తగా పని చేస్తూ వస్తున్నారు. ఫిజియోథెరపిస్ట్ కెరీర్‌నే వదులుకుని వైఎస్ ఫ్యామిలీ వెంట నిలిచారు. జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లిన సమయంలో ఆయన సోదరి షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టగా ఆమె వెంటే నిలిచారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా జగన్ పాదయాత్ర చేపట్టగా, వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్‌గా గురుమూర్తి ఆయన వెంటే రాష్ట్రమంతా తిరిగారు. దీంతో సీఎం జగన్‌కు గురిమూర్తి అంటే ప్రత్యేక అభిమానం ఉందని అందరూ చెబుతుంటారు. పలు సందర్భాల్లో మంచి స్థానంలో నిలబెడతానని సీఎం జగన్ గురుమూర్తికి చెప్పారని వారు వెల్లడించారు.
ఈ తరుణంలో తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కన్నుమూయగా, ప్రతిపక్ష పార్టీలు పోటీకి సిద్ధం కావడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో అధికార వైసీపీ గత సంప్రదాయాలను పక్కన పెట్టి.. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యుడికి కాకుండా తన వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తికి సీఎం జగన్ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఈ విధంగా గురుమూర్తిపై తన అభిమానాన్ని చాటుకోవడంతో పాటు పార్టీ కేడర్‌కు సైతం గురుమూర్తి విజయం కోసం శ్రమించి భారీ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ ఇవ్వాలి అనీ పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి , తిరుపతి పార్లమెంట్ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి, తిరుపతి పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ శాసనసభ్యులు, వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి,కరుణాకర్ రెడ్డి,బియ్యం మధుసూదన్ రెడ్డి,కిలివేటి సంజీవయ్య, ఆనం రామనారాయణ రెడ్డి,వెలగపల్లి వరప్రసాద్ రావు,వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు