నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని నరసింహకొండలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని
🔹 కనుమ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గోపూజలో పాల్గొని, గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
పై కార్యక్రమంలో ఆలయ ఈ.ఓ. శ్రీనివాసులు రెడ్డి మరియు ఛైర్మెన్ ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
స్నూకర్ క్రీడాభివృద్ధికి కృషి
రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హామీ
స్నూకర్ క్రీడాభివృద్ధికి నా సంపూర్ణ సహకారం ఉంటుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హామీనిచ్చారు. మద్రాసు బస్టాండ్ సమీపంలోని స్నూకర్ పార్లర్ లో జిల్లాస్థాయి టోర్నమెంట్ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్నూకర్ చాలా మంచి ఆట అని, ఇటీవల కాలంలో జిల్లాలో అనేక టోర్నమెంట్లు జరుగుతున్నాయని తెలిపారు. నేను జిల్లా స్నూకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా, మల్లికార్జున్ కార్యదర్శిగా, ప్రముఖ న్యాయవాది మల్ రెడ్డి శ్రీనివాసులు రెడ్డి గౌరవాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. నా చిరకాల మిత్రుడు, సీనియర్ జర్నలిస్టు ఫయాజ్ కుమారుడు రాహిల్ తాజ్ ఈ టోర్నమెంట్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇది పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని, భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంట్లు జరపాలని కోరుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ టోర్నమెంట్ కు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. స్నూకర్ టోర్నమెంట్ ఎక్కడ పెట్టినా ఎమ్మెల్యేగా కంటే స్నూకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నా సంపూర్ణ సహకారం ఉంటుందని రాహిల్ తాజ్ కు తెలిపారు. టోర్నమెంట్కు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా టోర్నమెంట్ నిర్వాహకులు రాహిల్ తాజ్ కృతజ్ఞతలు తెలిపారు. టోర్నమెంట్కు స్పాన్సర్ లుగా మనోహర్ రెడ్డి, గోల్డెన్ లైట్స్ విక్రమ్, వైజయంతి ఎలక్ట్రానిక్స్ అధినేత నిరంజన్ రెడ్డి తదితరులు సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి వైజయంతి ఎలక్ట్రానిక్స్ అదినేత నిరంజన్ రెడ్డి, తేజ కార్స్ నిర్వాహకులు ఎం.శ్రీనివాస్, మైనారిటీ నేతలు అతహర్ భాయ్, ఫరూక్ భాయ్, రియాజ్ భాయ్, హాజరయ్యారు.
రెండు కనులు చాలవయ్యా ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానంలో భోగి పండుగ పర్వదినం సందర్భంగా బుధవారం స్వామి
అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు*
భోగి పండుగ రోజు మోటర్ బైక్ ను తగలబెట్టారు...... నెల్లూరు నగరంలోని ఏసీ నగర్ పరిధిలోని రామ్ నగర్ వద్ద ఓ మోటార్ బైక్ ను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు.. బైక్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలాజీ నగర్ ఎస్ఐ అంకమ్మ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు... ఈ సందర్భంగా అక్కడ స్థానికులను విచారించారు... భోగి పండుగ రోజు మోటర్ బైకును తగలబెట్టడంలో ఈ
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్.
దేవాలయాలపై దాడులకు సంబంధించి ఊహాగానాలు, పుకార్లు రేకెత్తించినా సామాన్యులు సంయమనంతో వ్యవహరించారని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు.
ఈ సమయంలో పోలీసులపై వచ్చిన విమర్శలను ఆయన ఖండించారు.
తన సర్వీసులో పోలీసులపై ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ వినలేదన్నారు.
పోలీసులు కులాలు, మతాలకు అనుగుణంగా కాకుండా రాజ్యాంగానికి లోబడే పనిచేస్తారని తెలిపారు.
బుధవారం డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
2020లో అనేక సవాళ్లను ఎదుర్కొన్నామని, కరోనా సమయంలో రాత్రింబవళ్లు కష్టపడి పని చేశామని డీజీపీ వివరించారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలోని 58,871 ఆలయాలకు జియో ట్యాగింగ్‌తో అనుసంధానం చేశామన్నారు.
43,824 సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై సమాచారం ఇవ్వాలని, ఆలయాలపై ప్రత్యేకంగా 93929 03400 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని డీజీపీ తెలిపారు.
కోడి పందాల స్థావరంపై సీ.ఐ మెరుపు దాడి.. ఇద్దరు అరెస్టు.
పొదలకూరు
మండలం ఎర్రబల్లి అటవీ ప్రాంతంలో కోడి పందాలు ఆడుతున్న ఇద్దరు జూదరులను
కోడి పందేలు, ఇతర జూదాల నిర్వహణపై హైకోర్టుతో పాటు ప్రభుత్వం కూడా నిషేధం విధించిందన్నారు. ఎవరైనా బరులను సిద్ధం చేసినా, పందేల నిర్వహణకు ఏర్పాట్లు చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సర్కిల్ పరిధిలో దొంగచాటుగా నిర్వహించే కోడి పందెలాపై సమాచారం తెలిసిన వారు ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు
నెల్లూరుజిల్లా :
సంక్రాంతి పండుగల సందర్భంగా చట్టవ్యతిరేకమైన కోడిపందాల్లో పాల్గొన్న, నిర్వహించిన కఠినమైన చర్యలు తీసుకుంటాం.
ఇప్పటికే కోడిపందాలు జరిగే స్థావరాలపై నిఘా ఏర్పాటు చేశాము.
కోడిపందాలు కేసుల్లో పాత ముద్దాయలను బైండోవర్ చేస్తాము.
సంక్రాంతి సంబరాలపై ఆంక్షలు
వెంకటగిరి కుమ్మరిగుంటలో కనుమ పండుగనాడు ప్రతియేటా జరిగే సాయిబాబా తెప్పోత్సవం ఏకాంతంగా జరుగును. భక్తులెవ్వరికీ ప్రవేశంలేదు.
అదేవిధంగా సామూహిక సంక్రాంతి సంబరాలు జరుపుకునేందుకు కాశీతోటలోకి ప్రజలకు అనుమతిలేదు.