సూళ్లూరు పేటలో వెలిసియున్న దక్షిణ కాళి శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శ్రీమతి ప్రశాంతి గార్లు దంపతులు బుధవారం దర్శించుకున్నారు.
ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, కార్యనిర్వహాణాధికారి ఆళ్ళ శ్రీనివాస రెడ్డి వీరికి స్వాగతం పలికి, పూజలు నిర్వహించి అనంతరం ఆలయ మర్యాదలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కళత్తూరు శేఖర్ రెడ్డి, దబ్బల శ్రీమంత్ రెడ్డి, అల్లూరు అనిల్ రెడ్డి, శ్రీ చెంగాలమ్మ దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు గోగులు తిరుపాలు, శ్రీమతి ముంగర అమరావతి తదితరులు పాల్గొన్నారు.
"సర్వేపల్లిలో అట్టహాసంగా రెండో విడత అమ్మఒడి కార్యక్రమం."
ఆట పాటలతో ఆలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు.
ట్రిపుల్ ఐటీలో ప్రతిభ కనబరచి, అడ్మిషన్లు సంపాదించిన విద్యార్థులను సన్మానించిన ఎమ్మెల్యే కాకాణి.
స్క్రోలింగ్ పాయింట్స్:
👉 సృష్టిలో అమ్మ ఒడి మాధుర్యాన్ని అనుభవించని బిడ్డ ఉండదు.
👉 బిడ్డలకు వయసు వచ్చేకొద్ది స్కూళ్లకు వెళ్లడం ప్రారంభించిన తర్వాత క్రమేపీ అమ్మ ఒడికి దూరమవుతారు.
👉 స్కూళ్లకు వెళ్లే బిడ్డలకు కూడా అమ్మఒడి మాధుర్యాన్ని కొనసాగించాలని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టారు.
👉 భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో అమ్మ ఒడి పథకాన్ని అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో రెండో విడత అమ్మఒడి పథకం కింద 23,112 తల్లుల ఖాతాల్లో 34 కోట్ల 66 లక్షల 80వేల రూపాయల నిధులు జమ చేశారు.
👉 "జగనన్న అమ్మ ఒడి" ద్వారా ఆర్ధిక సహాయం, "నాడు - నేడు" పేరిట పాఠశాలల అభివృద్ధి, "జగనన్న విద్యా కానుక" కిట్లు, "జగనన్న గోరుముద్ద" పేరిట పోషకాహారం అందజేత లాంటి కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తున్నారు.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో అమ్మ ఒడి పథకాన్ని విజయవంతంగా అందించడానికి సహకరించిన మండల విద్యా శాఖ అధికారులకు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు, ప్రధానోపాధ్యాయులకు, అధ్యాపకులకు, సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు నా ప్రత్యేక ధన్యవాదాలు.
💠 తోళ్ల శుద్ధి కర్మాగారం ను రద్దు చేయాలని మంత్రికి వినతిపత్రం
💠 తోళ్ల శుద్ధి పరిశ్రమ తప్ప ప్రజలకు ఉపయోగపడే పరిశ్రమలను ఏర్పాటు చేయండి
💠 తోళ్ల పరిశ్రమ కు వ్యతిరేకంగా 10 ఏళ్ళు పోరాటం చేసాం
💠 ఇప్పుడు కూడా పార్టీలకు అతీతంగా ఉద్యమాలకు సిద్ధం
💠 తోళ్ల శుద్ధి పరిశ్రమను ఏర్పాటును రద్దు చేస్తాం- మంత్రి గౌతమ్ రెడ్డి
💠ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిశ్రమలను ఏర్పాటు చేస్తాం
💠 మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడి
నెల్లూరు : కోట మండలం లోని తీరప్రాంత గ్రామాలు కొత్తపట్నం పంచాయతీ పరిధిలోని వావిళ్ళ దొరువు గ్రామ సమీపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తోళ్ల శుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు మేము పూర్తి వ్యతిరేకం అనీ అవసరం అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి తెలియజేసి తోళ్ల శుద్ధి పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం అనీ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి వెల్లడించారు,
గురువారం నెల్లూరు లోని మంత్రి గౌతమ్ కుమార్ రెడ్డి అతిథి గృహంలో పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఉప్పల ప్రభాకర్ గౌడ్ మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి తోళ్ల శుద్ధి పరిశ్రమను రద్దు చేసి ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిశ్రమను ఏర్పాటు చేసి తీరప్రాంత ప్రజలకు,యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలి అనీ వినతిపత్రం అందజేసీ కోరారు, వెంటనే స్పందించిన మంత్రి గౌతమ్ రెడ్డి తోళ్ల శుద్ధి కర్మాగారం ను రద్దు చేసి పొల్యూషన్ లేని ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిశ్రమ ను ఏర్పాటు చేస్తాం అనీ పేర్నాటి కి హామీ ఇచ్చారు,
ఇప్పుడు తోళ్ల శుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి అనీ, అందువలన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అన్నీ విషయాలు క్షుణ్ణంగా వివరించాం అనీ, ఆయనకూడాసానుకూలంగా స్పందించి తోళ్ల శుద్ధి పరిశ్రమ ను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అని తెలిపారు,
గత కాంగ్రెస్ ప్రభుత్వం లో పునాదులు పడ్డ తోళ్ల శుద్ధి పరిశ్రమకు వ్యతిరేకంగా 10 ఏళ్ల పాటు ప్రజల పక్షాన నిలబడి సుదీర్ఘ పోరాటాలు చేశాం అనీ తెలిపారు, గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆనాడు వైసీపీ అధికారంలోకి వస్తే తోళ్ల శుద్ధి పరిశ్రమ ను రద్దు చేస్తాం అని హామీ ఇచ్చారు అనీ ఈ సందర్భంగా పేర్నాటి గుర్తు చేశారు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ కుమార్ రెడ్డి కూడా తీరప్రాంత ప్రజల సమస్యలను అర్ధం చేసుకుని తోళ్ల శుద్ధి పరిశ్రమను రద్దు చేస్తాం అని హామీ ఇచ్చారు అని ఆయనకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నారు.
ప్రాణాలు అర్పించి తోళ్ల శుద్ధి పరిశ్రమను అడ్డుకుంటాం
అత్యంత ప్రమాదకరమైన తోళ్ల శుద్ధి పరిశ్రమను అడ్డుకొనేందు ఎంతటి పోరాటాలకు అయినా సిద్ధం అనీ పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి హెచ్చరించారు, అవసరం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియజేసి తోళ్ల శుద్ధి పరిశ్రమ కు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం అన్నారు, ఒక్కసారి తోళ్ల పరిశ్రమ ఏర్పాటు అయితే తీరప్రాంత ల్లో ఉన్న మత్స్యకారులు రోగాలు బారిన పడి జీవనోపాధి కోల్పోయి వీధిన పడే అవకాశాలు ఉన్నాయి అన్నారు, పరిశ్రమ వలన భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని, పచ్చని పల్లెలు నాశనం అవుతాయి అనీ తెలిపారు,తనకు అధికారం ముఖ్యం కాదు అని ప్రజల సంక్షేమం ముఖ్యం అన్నారు.
అమ్మ ఒడి రెండో విడత కార్యక్రమానికి మ్యుఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు ఈ నెల 11వ తేదీన నెల్లూరుకు విచ్చేయుచున్న సందర్భంగా నెల్లూరు నగరంలోని మహేశ్వరీ కళ్యాణ మండపం నందు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో రాష్ట్ర జలవనరుల శాఖ
- నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాల జప్తు
- కమిషనర్ దినేష్ కుమార్
నగరంలోని సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ సంస్థలు వ్యాపారం నిర్వహించుకోవడానికి ముందుగా కార్పొరేషన్ నుంచి లైసెన్సును పొందాలని, ప్రభుత్వం నిర్దేశించిన ఆరోగ్య ప్రమాణాల మేరకు తప్పనిసరిగా నడుచుకోవాలని కమిషనర్ దినేష్ కుమార్ స్పష్టం చేసారు. సెప్టిక్ ట్యాంక్ సంస్థల నిర్వాహకులు, పారిశుద్ధ్య కార్మికులతో కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసే కార్మికులు రక్షణా ఉపకరణాలను కచ్చితంగా వాడాలని, కార్మికుల జీవన భద్రత కోసం అన్ని సంస్థలూ ఒక అసోసియేషన్ గా ఏర్పడాలని సూచించారు. నగరంలోని వెంకటేశ్వరపురం మురుగు నీటి శుద్ధి కేంద్రంలో మాత్రమే సెప్టిక్ ట్యాంక్ వ్యర్ధాలను విసర్జించాలని, ఇతర ప్రాంతాల్లో ఏలాంటి వ్యర్ధాలు విడుదల చేసినా వాహనాన్ని జప్తు చేసి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. సెప్టిక్ ట్యాంక్ వ్యర్ధాలను తరలించే ప్రతీ వాహనం విధిగా లైసెన్స్ పొందడంతో పాటు ప్రయాణ మార్గాన్ని సూచించే జిపిఎస్ పరికరాన్ని కచ్చితంగా అమర్చుకోవాలని సూచించారు. సచివాలయాల శానిటేషన్ విభాగం ద్వారా సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ సేవలు అవసరమైన ప్రజల వివరాలను ఎప్పటికప్పుడు ఆయా క్లీనింగ్ సిబ్బందికి అందజేసి, శుభ్రం చేసే ప్రక్రియ ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షిస్తామని కమిషనర్ పేర్కొన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేక సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రక్రియను పటిష్టంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్ వెల్లడించారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ ఎస్ఈ సంజయ్, ప్రజారోగ్య శాఖ ఈఈ జానీ బాషా, పారిశుద్ధ్య విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.