గల్ఫ్ దేశం ఒమన్‌కు వెళ్లాల్సిన అన్ని విమానాలను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. వారం రోజుల పాటు రెండు దేశాల మధ్య రాకపోకలు నిలిపివేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఒమన్ వారం పాటు అన్ని దేశాలకు చెందిన విమానాలను మూసివేయాలని సుల్తానేట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎయిరిండియా విమానాలను రద్దు చేసింది. ఇప్పటికే బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను కేంద్రం ఈ నెల 31వ వరకు రద్దు చేసింది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ వ్యాప్తి దృష్ట్యా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విమానాశ్రయాలలో కొవిడ్ టెస్టులు నిర్వహిస్తామని, పరీక్షల్లో పాజిటివ్ వస్తే నిర్బంధ క్వారంటైన్‌కు పంపనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. సోమవారం అర్ధరాతి నుంచి యూకే నుంచి వచ్చిన విమానాలపై సస్పెన్షన్ విధిస్తుండగా.. ఈ ఏడాది చివరి రోజు అర్ధరాత్రి వరకు తాత్కాలిక నిషేధం కొనసాగుతుందని మంత్రిత్వశాఖ పేర్కొంది.
కొత్త రకం కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో దాన్ని అరికట్టడానికి లండన్ సహా దక్షిణ ఇంగ్లాండ్‌లో లాక్‌డౌన్ విధించారు. కొత్తరకం కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ 70 శాతం ఎక్కువ వేగంగా ఇది వ్యాప్తి చెందుతోంది. బుధవారం నుంచి నమోదైన కేసుల్లో 60 శాతం కంటే ఎక్కువే కొత్తరకం వైరస్ కేసులున్నాయి. ఇటలీలోనూ పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించారు. క్రిస్మస్ షాపింగ్ కోసం ప్రజలు బహిరంగంగా గుమిగూడే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఇటలీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 24 నుంచి జనవరి 6 వరకు ఇటలీలో రెడ్‌జోన్ ప్రకటించారు. కొత్తరకం కరోనా వైరస్‌తో అప్రమత్తమైన బ్రిటన్ ప్రభుత్వం కఠిన లాక్‌డౌన్ అమలు చేస్తోంది. క్రిస్మస్ వేళ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం అక్కడి టైర్-4 నిబంధనలను అమలు చేస్తోంది.
నిత్యావసరం కాని సరకుల దుకాణాలు, వ్యాపారాలు, వ్యాయామశాలలు, సినిమా హాళ్లు, సెలూన్లను రెండు వారాలు మూసివేశారు. దక్షిణ ఇంగ్లాండ్‌లో తాజా వైరస్ ఎక్కువగా ప్రబలుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. భారత్ కూడా నూతన రకం వైరస్ వ్యాప్తిని నివారించేందుకు సన్నద్ధమవుతోంది. యూకే పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. ప్రస్తుతానికి భయపడాల్సిందేమీ లేదనన్నారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్. బ్రిటన్ నుంచి విమానాల రాకపోకలపై భారత్ ఆంక్షలు విధించింది. డిసెంబరు 31వరకు బ్రిటన్‌కు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమానాలను రద్దు చేసింది. యూకే నుంచి డిసెంబరు 22 అర్ధరాత్రిలోపు భారత్‌కు వచ్చే ప్రయాణికులు విమానాశ్రయాల్లో ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించింది. ఒకవేళ ఆర్‌టీ పీసీఆర్ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలితే వారిని ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌కు పంపుతామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరి తెలిపారు. పరీక్షల్లో వైరస్ నెగెటివ్ వచ్చినా కూడా ఆయా ప్రయాణికులు ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.
జనరంజక నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా సైదాపురం మండల కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఆనం ::
✍️ జన నేత మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ Y.S జగన్ మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టమైన సేవా కార్యక్రమాలను వారి జన్మదిన వేళ అభిమానులు, పార్టీ నాయకులు చేపట్టడం చాలా హర్షణీయమని
ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన జగన్ జన్మదిన వేడుకలను ఆర్భాటాలతో కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా Y.S అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ప్రారంభించడం తనకు చాలా సంతోషంగా ఉందని మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు పేర్కొన్నారు
కొత్తూరు అంబాపురం దగ్గర 6 కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్లు, స్మశాన వాటికల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నెల్లూరు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, విజయ డైరీ ఛైర్మెన్ కొండ్రెడ్డి రంగారెడ్డి మరియు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గార్లు.
🔹 కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలాగా ప్రజలతో సంబంధాలు ఉండేవాళ్లు చాలా తక్కువగా ఉంటారు. పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు.
🔹 31 & 32 డివిజన్లకు ఇప్పటి వరకు 18 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. కానీ ఇంకా చెయ్యాల్సిన పనులు కూడా ఉన్నాయి. వాటిని కూడా త్వరితగతిన పూర్తిచేస్తాం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔹 గౌరవ పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారితో మాట్లాడి, రూరల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషిచేయాలి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔹 గౌరవ పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పూర్తిగా రూరల్ నియోజకవర్గానికి సహకరిస్తున్నారు. తన ఎమ్.పి. నిధుల నుంచికూడా రూరల్ నియోజకవర్గానికి పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారు. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి
రక్తదానం ప్రాణదానం తో సమానమని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు నెల్లూరు లోని రాజన్న భవన్ వద్ద సోమవారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆయన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు
అంతకుముందు ఈ శిబిరాన్ని పరిశీలించారు అధిక సంఖ్యలో
పాల్గొన్న యువకులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించడం ఎంతో సంతోషదాయకం అని పేర్కొన్నారు.
యువకులు కూడా అధిక సంఖ్యలో ముందుకు రావడం మరెంతో స్ఫూర్తినిచ్చే విషయం అని అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ ను ప్రతి ఒక్కరూ అభినందించాలని సూచించారు.
మంత్రి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో
విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి, వైసీపీ ముఖ్య నేతలు ముక్కాల ద్వారకానాథ్, రూప్ కుమార్ యాదవ్,
స్వర్ణ వెంకయ్య, నూనె మల్లికార్జున యాదవ్, కోటేశ్వర్ రెడ్డి , నరసింహారావు, మధు, అల్లాబక్షు తదితరులు పాల్గొన్నారు
జిల్లాలో నిఘా అధికారుల వైఫల్యం..