కళాకారులకు రుణాలు మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్ హరేందిరా ప్రసాద్ కు బీజేపీ సీనియర్ నాయకులు రమేష్ సోమవారం విజ్ఞప్తి చేశారు.. నెల్లూరు పరిసర ప్రాంతాలలో పౌరాణిక జానపద నాటకాలు ప్రదర్శించే కళాకారులు 65 మంది ఉన్నారని covid 19 మూలంగా వారందరూ జీవన ఉపాధి కోల్పోయారన్నారు.ఆర్థిక ఇబ్బందులలోఉ న్న కళాకారులకు వ్యక్తిగత రుణాలు గానీ సామూహిక రుణాలు గానీ బ్యాంకుల ద్వారా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేశారు.. . ఈ కార్యక్రమంలో ఉడతా ప్రభాకర్ టిసాయి కుమారి సురేషు బెల్లంకొండ రామకృష్ణ బండారు సురేష్ నాయుడు పాల్గొన్నారు
కలువాయి మండలం వెరుబోట్లపల్లిలో అస్వస్థతకు గురై నెల్లూరులోని జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న పశ్చిమ బెంగాల్ వలస కూలీలను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పత్తిపాటి పుల్లారావు, నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, సిటీ నియోజకవర్గ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, సీనియర్ నాయకులు డాక్టర్ జెడ్ శివప్రసాద్ తదితరులు..
కూలీల ఆరోగ్య పరిస్థితిపై వైద్యాధికారులతో చర్చించి మెరుగైన వైద్యం అందించాలని సూచించిన సోమిరెడ్డి, పత్తిపాటి
సోమిరెడ్డి కామెంట్స్
పొట్టకూటి కోసం నెల్లూరుకు వచ్చిన బెంగాల్ వలస కూలీలు ఊహించనిరీతిలో అస్వస్థతకు గురికావడం బాధాకరమైన ఘటన..
ఘటన జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా ఇప్పటికీ స్పష్టమైన కారణాన్ని గుర్తించలేకపోవడం దురదృష్టకరం..
నీటి కాలుష్యంతోనే కూలీలు అస్వస్థతకు గురయ్యారని భావిస్తున్న తరుణంలో వాళ్లు నీళ్లు తాగిన బోరును మూడు రోజుల తర్వాత లాక్ చేస్తారా...అంత నిర్లక్ష్యమా..
ఇంకా పలువురు ఐసీయూలో ఉన్నారు...వారికి మరింత మెరుగైన వైద్యం అందించేందుకు తిరుపతి, విజయవాడ, చెన్నై, హైదరాబాదులోని ఆస్పత్రులకు తరలించండి..
బెంగాల్ వాసులైనప్పటికీ ఆంధ్రా వాళ్ల ప్రాణాలతో సమానంగా చూడండి...
చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా, చికిత్స పొందుతున్న కూలీలకు రూ.50 వేలు వంతున ప్రభుత్వం సాయం అందించాలి...
పశ్చిమబెంగాల్ లోనూ మీ ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా ఉదారంగా సాయం చేయాలని జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నా..
నెల్లూరు జీజీహెచ్ లో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్న వైద్యాధికారులకు నా అభినందనలు..
ఎంతో పేరు ప్రఖ్యాతులున్న ఈ ఆస్పత్రిలో సెల్లార్ లో నీళ్లు రావడం, కరెంట్ లేక వాటిని తోడలేకపోవడం, చివరకు వెంటిలేటర్లపై ఉన్న వారు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం బాధాకరం..
మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉండటంతో పాటు కోవిడ్ ఆస్పత్రిగా ఉన్న జీజీహెచ్ నిర్వహణ విషయంలో ఇంత నిర్లక్ష్యమెందుకు...
మరోమారు ఇలాంటి పరిస్థితులు పునరావతం కాకుండా చర్యలు తీసుకోవాలి..
ఏలూరులో ప్రజలు అస్వస్థతకు కారణమవడానికి కూడా ఇప్పటివరకు కారణం చెప్పలేకపోతున్నారు..ఇంకా ఎన్ని రోజులు కావాలి..
ప్రజల ప్రాణాల విషయంలో మేం రాజకీయాలు చేయబోం..కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి..
పత్తిపాటి పుల్లారావు కామెంట్స్
నారేతల కోసం నెల్లూరుకు వచ్చిన బెంగాల్ వలస కూలీలకు మెరుగైన వైద్యం అందించాలి..
మొన్న ఏలూరు, నిన్న నెల్లూరు...ఈ ఘటనల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది..
రోజులు గడుస్తున్నా ప్రజలు అస్వస్థతకు గురవడానికి కారణాలు వెల్లడించలేకపోతున్నారు..
ఎవరి పాపాన వారు పోతారు..అనే ధోరణిలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది..
కట్టుబట్టలతో ఉన్న బెంగాల్ కూలీలకు మానవతా దృక్ఫథంతో సాయం చేసి వారిని సొంత రాష్ట్రానికి గౌరవంగా పంపాలి...
విధ్వంసం, వినాశకాలు, ధనార్జనే ధ్యేయంగా పెట్టుకోకుండా ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు స్పందించడం కూడా అలవరుచుకోవాలి...
రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం లో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాలమేరకు పబ్లిక్ హెల్త్, కార్పొరేషన్ అధికారులు మరియు కాంట్రాక్టర్ లతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
🔹 రూరల్ నియోజకవర్గం కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ బ్యాలన్స్ పనులు, మ్యాన్ హోల్స్ బ్యాలన్స్ ప్యాచ్ వర్కులు ఇవన్ని కార్పొరేషన్ అధికారులతో సమన్వయం చేసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన పనులు పూర్తిచేయాలని అధికారులను కోరిన రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి..
నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, గుడ్లూరువారి పాళెం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
స్క్రోలింగ్ పాయింట్స్:
👉సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం.
👉ఈ రోజు సిమెంట్ రోడ్లు, సైడు డ్రైన్ల నిర్మాణం కోసం 3కోట్ల 65 లక్షల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరం.
👉గతంలో గ్రామాల్లో కక్ష్య పూరిత వాతావరణాన్ని తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుని వచ్చింది.
👉కానీ ప్రస్తుతం ఎక్కడా వివాదాలు లేకుండా శాంతియుత వాతావరణం తీసుకొని రావడం జరిగింది.
👉గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే అజెండాగా అందరం కలసి కట్టుగా పనిచేద్దాం.
👉 సర్వేపల్లి నియోజకవర్గం లోని ప్రజల సంక్షేమం కోసం, ప్రాంతాల అభివృద్ధి కోసం కట్టుబడి పని చేస్తా.
నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సర్వేపల్లి నియోజకవర్గ సమీక్ష సమావేశం..
కేడర్ కు దిశానిర్దేశనం చేసిన మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పత్తిపాటి పుల్లరావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు నరసింహయాదవ్, రైతు విభాగం అధ్యక్షుడు రాధాక్రిష్ణమనాయుడు, రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, సోమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, పొన్నూరు రామకృష్ణయ్య, కుంకాల దశరధనాగేంద్ర ప్రసాద్, మేదరమెట్ల కోదండరామ నాయుడు, అన్ని మండలాల నాయకులు..
పార్టీ నూతన మండల అధ్యక్షులుగా సన్నారెడ్డి సురేష్ రెడ్డి(తోటపల్లి గూడూరు), పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి(ముత్తుకూరు), గుమ్మడి రాజాయాదవ్(వెంకటాచలం), గాలి రామక్రిష్ణారెడ్డి(మనుబోలు), తలచీరు మస్తాన్ బాబు(పొదలకూరు)ని నియమిస్తున్నట్టు ప్రకటించిన సోమిరెడ్డి..వైసీపీ నేతల అవినీతి, అరాచకం, అన్యాయాలు, దోపిడీతో ప్రజలు పూర్తిస్థాయిలో విసుగుచెందుతున్నారు..
రైతు పండించిన ధాన్యం ధర కంటే ఏట్లో దొరికే ఇసుక ధర ఎక్కువగా ఉన్న పరిస్థితి వైసీపీ పాలనలో నెలకొంది..
ఉచితంగా లభించే ఇసుకకు ప్రభుత్వం నిర్ణయించిన రూ.1,600 ధర, ట్రాక్టర్ బాడుగ కన్నా వైసీపీ నేతలు తమకు ఓట్లేసిన ప్రజలపై అదనంగా విధిస్తున్న మూడింతల సుంకమే భారంగా మారింది...
ఒక్క విరువూరు ఇసుక రీచ్ నుంచే పెద్దరెడ్డి సొంత ఖజానాకు నెలకు రూ.40 లక్షలు జమవుతున్నాయి..
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వైసీపీ నేతలతో కలిచి ఇసుక రీచ్ అక్రమాల్లో భాగస్వాములవడంతో పరిపాలన ప్రశ్నార్థకంగా మారింది...
గత ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసిన పాపానికి జనంపై పన్నుల మీద పన్నులు వేస్తున్నారు..
నిత్యావసర వస్తువుల ధరల నుంచి లిక్కర్ రేట్లు వరకు అన్నీ గణనీయంగా పెరిగిపోయాయి...
ప్రజల సొత్తును నెలకు రూ.90 వేలు జీతంగా తీసుకుంటున్న ఎంపీడీఓలు ఎమ్మెల్యే, వైసీపీ నేతల అనుమతి లేనిదే పంచాయతీ కుళాయి కనెక్షన్లు ఇవ్వలేని పరిస్థితి కొనసాగుతోంది..
కొందరు అధికారులు వైసీపీకి తొత్తులుగా మారి అవినీతిలో మునిగితేలుతూ ప్రజలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు..కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్నారు...
ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల మనోభావాలకు అద్దం పట్టేలా తిరుపతి ఎన్నికల ఫలితాన్ని తెచ్చుకునే బాధ్యత మనందరిపై ఉంది..
కేంద్ర మంత్రిగా పనిచేసి, మచ్చలేని నాయకురాలిగా పేరుతెచ్చుకున్న పనబాక లక్ష్మిని ఎంపీగా గెలిపించుకుందాం..
పత్తిపాటి పుల్లారావు కామెంట్స్
విధ్వంసం, వినాశకం, అవినీతి, అక్రమాలు, దోపిడీనే ధ్యేయంగా వైసీపీ పాలన సాగుతోంది..
ఒక్క ఛాన్స్ పేరుతో ప్రజలిచ్చిన అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యాపార కేంద్రంగా మార్చుకున్నారు..
వైసీపీకి ఓటేసిన వారు కూడా ఈ రోజు పాలన చూసి విరక్తిచెందిన పరిస్థితి నెలకొంది...
వైసీపీ రెండో సారి అధికారంలోకి రావడం అసంభవం..
సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనల్లో మార్పు తెచ్చేందుకు, వైసీపీ నేతల భ్రమలను తొలగించేందుకు తిరుపతి ఉప ఎన్నిక ఫలితం దోహదం చేస్తుంది..
తిరుపతి ఎంపీగా పనబాక లక్ష్మిని గెలిపించుకుని చరిత్ర తిరగరాద్దాం...
నరసింహ యాదవ్ కామెంట్స్
ఏ ఘటన జరిగినా నోరువిప్పని ముఖ్యమంత్రి ఎవరైనా దేశంలో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కరే..
లక్షలాది మంది పేదల రేషన్ కార్డులు తొలగిస్తున్న ఘనత కూడా ఈ ప్రభుత్వానిదే..
రాష్ట్రంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పలకడం తిరుపతి నుంచే ప్రారంభం కావాలి..
రాబోయే మూడేళ్లూ కనీ విని యెరుగనంత అభివృద్ధి
ఆత్మకూరు నియోజకవర్గంలో పారిశ్రామికరంగానికి సంబంధించి త్వరలో మరో శుభవార్త
ఒక్క రైతు కూడా నష్టపోని విధంగా నివర్ పరిహారం
దేశంలోనే 22 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఒక్కటే
జాయింట్ కలెక్టర్ సహా జిల్లా అధికార యంత్రాంగంతో మంత్రి మేకపాటి సమీక్ష
తుపాను వల్ల కలిగిన కష్ట, నష్టాల అంచనాలపై సమీక్ష నిర్వహించిన మంత్రి మేకపాటి
నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి తన పిల్లలని ప్రభుత్వ బడిలో చేర్పించడమే ప్రభుత్వ పనితీరుకు ఒక ఉదాహరణ
గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన సచివాలయాలు, ఆర్ బీకేలు, జనతా బజార్లు, బడులు, ఆస్పత్రుల నాడు-నేడు సహా అన్నింటి పూర్తికీ మార్చి నెలే డెడ్ లైన్
తుపాను వంటి విపత్తుల సమయంలో ఇంత త్వరగా గతంలో ఏ ప్రభుత్వం స్పందించలేదు
ఈ స్థాయి వేగంగా ఎన్నడూ అంచనాలు వేసి నివేదిక ఇవ్వలేదు
కార్పొరేట్ స్థాయికి తగ్గని విధంగా సకల సదుపాయాలతో ప్రభుత్వ బడులు, ఆస్పత్రులు
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం హయాంలో వేగంగా గ్రామాల అభివృద్ధి
కరోనా సమయంలో కష్టాలొచ్చినా అధిగమించాం, కాస్త ఆలస్యమైనా 90శాతం పనులు పూర్తి చేశాం
పేదలందరికీ పాఠశాల, ఆస్పత్రుల విషయంలో కార్పొరేట్ స్థాయి మౌలిక సదుపాయాలు
మద్దతు ధర సహా రైతుల విషయంలో సీఎం ముందు చూపు వల్లే పంజాబ్ పరిస్థితి ఏపీలో లేదు
సరికొత్త హంగులు, అత్యాధునిక సదుపాయాలతో పోర్టులు, ఎయిర్ పోర్టులు, జాతీయ రహదారులు, పారిశ్రామిక కారిడార్లు
ఈడీబీ నిధుల ద్వారా విశాఖ, చెన్నై కారిడార్లు కూడా త్వరగా అభివృద్ధి
ఆత్మకూరు నియోజకవర్గంలో పారిశ్రామిక, ఎమ్ఎస్ఎమ్ఈలకు సంబంధించి మరింత అభివృద్ధి
అంగన్ వాడీ పాఠశాలలో నియామకమైన మహిళలకు ఆర్డీవో కార్యాలయంలో నియామక పత్రాలు అందజేసిన మంత్రి గౌతమ్ రెడ్డి
ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ
ప్రజల కనీస అవసరాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడే మంత్రి ఆదేశాలు
అంతకు ముందు ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్ స్థాయి అధికారులతో నియోజకవర్గంపై నివర్ తుపాన్ వల్ల పంట నష్టం సహా పలు కీలక అంశాలపై సమీక్ష సమావేశ నిర్వహణ
నిర్మాణంలో ఉన్న ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయ పనులను పరిశీలించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
అత్యాధునిక సదుపాయాలతో మున్సిపల్ కార్యాలయం తయారయ్యేందుకు మరింత శ్రద్ధ చూపాలని మంత్రి ఆదేశం
కొత్త మున్సిపల్ ఆఫీస్ లో వెలుతురు బాగుంది, మిగతా విషయాలపై శ్రద్ధ వహించాలన్న మంత్రి
భవన నిర్మాణానికి, విద్యుత్ సదుపాయాలు, కాంపౌండ్ వాల్ నిర్మాణాలను పరిశీలించిన మంత్రి, అయిన ఖర్చు వివరాలపై అధికారులతో ఆరా
ఇంకా పెండింగ్ లో ఉన్న కొన్ని పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
నిర్మితమవుతున్న సమావేశమందిరం సహా మొత్తం మున్సిపల్ కార్యాలయ భవనాన్ని నలుమూలలా పరిశీలన
ఆర్ అండ్ బీ భవనాన్ని పరిశీలించిన మంత్రి మేకపాటి
వచ్చే ఆరు నెలలో పూర్తికి కృషి చేస్తామని హామీ
రూ. 40 కోట్లు పైన వెచ్చించి వర్షపు నీరు నిలవని విధంగా డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, తోటలు, పార్కుల అభివృద్ధిపై దృష్టి
మొదటి దశలో రూ.20కోట్లతో పనులు వేగంగా పూర్తి చేస్తాం
నియోజకవర్గంలో మంత్రి రాకతో సన్మానాలతో ముంచెత్తిన ఆత్మకూరు నియోజకవర్గ నాయకులు
మంత్రితో పాటు సమావేశాలకు హాజరైన జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. ప్రభాకర్, ఆర్డీవో సువర్ణమ్మ
______________
జలదంకి మండలం వేములపాడు ఘర్షణ ఘటనలో పోతల రమణయ్య తీవ్రంగా గాయపడిన నేపధ్యంలో నిందితులైన 13 మందిని సోమవారం చామదల క్రాస్ వద్ద జలదంకి యస్ ఐ వెంకట్రావు అరెస్టు చేసినట్లు డి.యస్.పి ప్రసాద్, సి.ఐ అక్కేశ్వరరావు తెలిపారు.అరెస్టు అయిన వారిలో బద్దిపూడి తిరుపాలు,చేవూరి నాగార్జున, సుబ్రహ్మణ్యం, కూసుపాటి ఏసేబు,మొద్దు అంజయ్య, మొద్దు జయరామయ్య,మొద్దు లక్ష్మయ్య,మొద్దు రామయ్య,మొద్దు రామకృష్ణ,మొద్దు రాంబాబు,పోతల రవిబాబు,పోతల శ్రీ ను, పోతల వెంకటేష్ లు ఉన్నట్లు డి యస్ పి తెలిపారు. యస్ ఐ వెంకట్రావు సమయస్ఫూర్తి తో ప్రమాద తీవ్రత నెలకొందని, సి.ఐ అక్కేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రశాంత త నెలకొల్పినట్లు తెలిపారు. రమణయ్య వర్గానికి చెందిన నలుగురు ఆసుపత్రి లో ఉన్నా రని వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని డి యస్ పి ప్రసాద్ వివరించారు @ జయప్రతాప్ రెడ్డి