సంక్షేమం చూశారు..ఇక అభివృద్ధి చూస్తారు : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
సంక్షేమం చూశారు..ఇక అభివృద్ధి చూస్తారు : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
రాబోయే మూడేళ్లూ కనీ విని యెరుగనంత అభివృద్ధి
ఆత్మకూరు నియోజకవర్గంలో పారిశ్రామికరంగానికి సంబంధించి త్వరలో మరో శుభవార్త
ఒక్క రైతు కూడా నష్టపోని విధంగా నివర్ పరిహారం
దేశంలోనే 22 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఒక్కటే
జాయింట్ కలెక్టర్ సహా జిల్లా అధికార యంత్రాంగంతో మంత్రి మేకపాటి సమీక్ష
తుపాను వల్ల కలిగిన కష్ట, నష్టాల అంచనాలపై సమీక్ష నిర్వహించిన మంత్రి మేకపాటి
నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి తన పిల్లలని ప్రభుత్వ బడిలో చేర్పించడమే ప్రభుత్వ పనితీరుకు ఒక ఉదాహరణ
గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన సచివాలయాలు, ఆర్ బీకేలు, జనతా బజార్లు, బడులు, ఆస్పత్రుల నాడు-నేడు సహా అన్నింటి పూర్తికీ మార్చి నెలే డెడ్ లైన్
తుపాను వంటి విపత్తుల సమయంలో ఇంత త్వరగా గతంలో ఏ ప్రభుత్వం స్పందించలేదు
ఈ స్థాయి వేగంగా ఎన్నడూ అంచనాలు వేసి నివేదిక ఇవ్వలేదు
కార్పొరేట్ స్థాయికి తగ్గని విధంగా సకల సదుపాయాలతో ప్రభుత్వ బడులు, ఆస్పత్రులు
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం హయాంలో వేగంగా గ్రామాల అభివృద్ధి
కరోనా సమయంలో కష్టాలొచ్చినా అధిగమించాం, కాస్త ఆలస్యమైనా 90శాతం పనులు పూర్తి చేశాం
పేదలందరికీ పాఠశాల, ఆస్పత్రుల విషయంలో కార్పొరేట్ స్థాయి మౌలిక సదుపాయాలు
మద్దతు ధర సహా రైతుల విషయంలో సీఎం ముందు చూపు వల్లే పంజాబ్ పరిస్థితి ఏపీలో లేదు
సరికొత్త హంగులు, అత్యాధునిక సదుపాయాలతో పోర్టులు, ఎయిర్ పోర్టులు, జాతీయ రహదారులు, పారిశ్రామిక కారిడార్లు
ఈడీబీ నిధుల ద్వారా విశాఖ, చెన్నై కారిడార్లు కూడా త్వరగా అభివృద్ధి
ఆత్మకూరు నియోజకవర్గంలో పారిశ్రామిక, ఎమ్ఎస్ఎమ్ఈలకు సంబంధించి మరింత అభివృద్ధి
అంగన్ వాడీ పాఠశాలలో నియామకమైన మహిళలకు ఆర్డీవో కార్యాలయంలో నియామక పత్రాలు అందజేసిన మంత్రి గౌతమ్ రెడ్డి
ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ
ప్రజల కనీస అవసరాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడే మంత్రి ఆదేశాలు
అంతకు ముందు ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్ స్థాయి అధికారులతో నియోజకవర్గంపై నివర్ తుపాన్ వల్ల పంట నష్టం సహా పలు కీలక అంశాలపై సమీక్ష సమావేశ నిర్వహణ
నిర్మాణంలో ఉన్న ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయ పనులను పరిశీలించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
అత్యాధునిక సదుపాయాలతో మున్సిపల్ కార్యాలయం తయారయ్యేందుకు మరింత శ్రద్ధ చూపాలని మంత్రి ఆదేశం
కొత్త మున్సిపల్ ఆఫీస్ లో వెలుతురు బాగుంది, మిగతా విషయాలపై శ్రద్ధ వహించాలన్న మంత్రి
భవన నిర్మాణానికి, విద్యుత్ సదుపాయాలు, కాంపౌండ్ వాల్ నిర్మాణాలను పరిశీలించిన మంత్రి, అయిన ఖర్చు వివరాలపై అధికారులతో ఆరా
ఇంకా పెండింగ్ లో ఉన్న కొన్ని పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
నిర్మితమవుతున్న సమావేశమందిరం సహా మొత్తం మున్సిపల్ కార్యాలయ భవనాన్ని నలుమూలలా పరిశీలన
ఆర్ అండ్ బీ భవనాన్ని పరిశీలించిన మంత్రి మేకపాటి
వచ్చే ఆరు నెలలో పూర్తికి కృషి చేస్తామని హామీ
రూ. 40 కోట్లు పైన వెచ్చించి వర్షపు నీరు నిలవని విధంగా డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, తోటలు, పార్కుల అభివృద్ధిపై దృష్టి
మొదటి దశలో రూ.20కోట్లతో పనులు వేగంగా పూర్తి చేస్తాం
నియోజకవర్గంలో మంత్రి రాకతో సన్మానాలతో ముంచెత్తిన ఆత్మకూరు నియోజకవర్గ నాయకులు
మంత్రితో పాటు సమావేశాలకు హాజరైన జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. ప్రభాకర్, ఆర్డీవో సువర్ణమ్మ