అధికారులతో సంక్షేమ పథకాల పురోగతి, ఇళ్ల పట్టాల పంపిణీపై సమీక్ష, సమావేశం జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు
నెల్లూరు నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు, జిల్లా అధికారులతో సంక్షేమ పథకాల పురోగతి, ఇళ్ల పట్టాల పంపిణీపై సమీక్ష, సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 25న ఇళ్ల పట్టాల పంపిణీపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్.., జిల్లాలోని 1447 లే అవుట్స్ లో 1,57, 887 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. పట్టాలు పంపిణీ చేసిన రోజునే ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభమవ్వాలన్నారు. టిడ్కో హౌసింగ్ లో భాగంగా ఇప్పటికే పూర్తైన ఇళ్ల పంపిణీపై అధికారులను అడిగి వివరాలు తెలుకున్నారు. పెండింగ్ పనులు పూర్తై, చివరి దశలో ఉన్న టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. లే అవుట్స్ లోని మౌలిక సదుపాయాలు, అంతర్గత రోడ్లు, మొక్కలు నాటే ప్రక్రియపై డ్వామా పి.డి ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. కచ్చితంగా డెడ్ లైన్ లోపు పనులన్నీ పూర్తి కావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్.బి.కెలు, విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని.., జిల్లాలోని 661 గ్రామ, వార్డు సచివాలయాలను వాటికి అనుబంధంగా రైతు భరోసా కేంద్రాల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న కలెక్టర్.., నిర్మాణం దాదాపు పూర్తై, పెయింటింగ్ పెండింగ్ ఉన్న పాఠశాలను త్వరితగతిన పూర్తిచేయాలని, పనుల్లో నాణ్యతాలోపం ఉండరాదని, వాష్ రూంలు, మినరల్ వాటర్ ప్లాంట్ కచ్చితంగా నిర్మించాలన్నారు. నివర్ తుఫాను కారణంగా జిల్లాలో జరిగిన పంటనష్టంపై అధికారులతో కలెక్టర్ చర్చించారు. తుఫాను కారణంగా 29 మండలాల్లోని 177 గ్రామాల్లోని 81, 600 మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారని.., 32 కచ్చా ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని, 82 కచ్చా ఇళ్లకు పాక్షిక నష్టం వాటిల్లిందని అధికారులు కలెక్టర్ కి తెలిపారు. 17,163 మందిని రిలీఫ్ కేంద్రాలకు తరలించామని, 24,470 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందన్నారు. రోడ్లు, ఆక్వా కల్చర్, చేనేత కార్మికులు, హ్యాండ్ లూమ్స్ టెక్సటైల్స్ పరిశ్రమలకు నష్టం వాటిల్లిందని.., జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక అందించామని అధికారులు కలెక్టర్ కి తెలిపారు. జగనన్నతోడు పథకం ద్వారా లబ్దిపొందిన చిరు వ్యాపారుల ద్వారా యూనిట్స్ లాంఛింగ్ అయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. వైఎస్ఆర్ ఆసరా పథకం లబ్ది దారుల ద్వారా గొర్రెలు, మేకల పెంపకం యూనిట్స్ ఏర్పాటు చేయడంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమీక్షా, సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి, ఇంఛార్జి జాయింట్ కలెక్టర్ ( ఆసరా) నాగలక్ష్మి, డి.పి.ఓ ధనలక్ష్మి, డ్వామా పి.డి సాంబశివారెడ్డి., డి.ఈ.ఓ రమేష్ వ్యవసాయ శాఖ, ఫిషరీస్, పశు సంవర్థక శాఖ జె.డి లు, అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.