నివర్ తుఫాను బాధితులను పరామర్శ
దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే
నివర్ తుఫాను బాధితులకు న్యాయం చేస్తాం
ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు హామీ
నివర్ తుఫాను ప్రభావంతో ఈ నెల 26 నుండి కురిసిన వర్షాలకు గూడూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న 5 మండలాల్లో పంటలు బాగా దెబ్బతిన్నాయి, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి దింతో ఎన్నో ఇల్లులు దెబ్బతిన్నాయి,ఎన్నో ఇళ్లల్లో కి నీళ్లు వచ్చి పలు ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, ఈ తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు ప్రతి నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటల వివరాలు, నష్టాలు వివరాలు సేకరించాలి అనీ ఆదేశాలు రావడంతో గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు 4 రోజుల నుండి నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించి ప్రజలకు తోడ్పాటు అందిస్తున్నారు, ప్రతీ రోజు ఉదయం నుండి రాత్రి వరకూ వైసీపీ నేతలు, అధికార యంత్రాంగం తో కలిసి పర్యటిస్తూ అందరిని ఆశ్చర్య చకితులను చేస్తున్నారు,
"విస్తృతంగా ఎమ్మెల్యే పర్యటన వివరాలు"
నెలటూరు:గూడూరు మున్సిపల్ పరిధిలోని నేలటూరు సమీపంలోని మర్రిపాల మడుగును ఆదివారం గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వెలగపల్లి వరప్రసాద రావు పరిశీలించి అక్కడ రైతులు సమస్యలుతెలుసుకున్నారుఎమ్మెల్యే వెంట ఇరిగేషన్ అధికారులు మరియు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు మనుబోలు సతీష్ రెడ్డి, కొండూరు సునీల్ రెడ్డి తదితరులు నాయకులు ఉన్నారు..,
గూడూరుపట్టణం:గూడూరు సొసైటీ ప్రాంతంలో వాకింగ్ చేస్తు శాసనసభ్యులు డాక్టర్ వెలగపల్లి వరప్రసాద రావు అక్కడ ఉన్న చిరు వ్యాపారులు ను కలిసి వారికి జగనన్న తోడు రుణం అందిందా లేదా అని విచారణ చేశారు
గూడూరుపట్టణం:గూడూరు పట్టణంలోని అంబేద్కర్ నగర్ కు చెందినటువంటి ఓ మహిళ తన జీవన ఉపాధి చాలా కష్టతరంగా మారింది అని ప్రభుత్వం నుండి బ్యాంకు లోను ఇప్పించ వలసిందిగా ఎమ్మెల్యే ని కోరగా బ్యాంకు మేనేజర్ తో మాట్లాడి తప్పకుండా వారికి న్యాయం చేసి ఆదుకుంటామని ఆ మహిళకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
గూడూరు సొసైటీ ప్రాంతంలో ఒక వికలాంగునికి బ్యాంకు ద్వారా అతనికి రుణాన్ని మంజూరు చేసిన ఎమ్మెల్యే కి ఆ వికలాంగుడు బ్యాంకు రుణం ద్వారా 'అరటి పండ్లు' వ్యాపారం చేసుకుంటూ తన జీవితాన్ని సంతోషంగా జీవిస్తున్నానని వాకింగ్ చేస్తున్న ఎమ్మెల్యే కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశాడు..,
వేముల పాళెం: గూడూరు మున్సిపల్ పరిధిలోని వేముల పాలెం గ్రామంలో తుఫాన్ ప్రభావంతో నష్టపోయినా రైతుల పొలాలను పరిశీలించిన శాసనసభ్యులు డాక్టర్ వెలగపల్లి వరప్రసాద రావు.
విందూరు: గూడూరు రూరల్ పరిధిలోని విందూరు చెరువును పరిశీలించిన శాసనసభ్యులు డాక్టర్ వెలగపల్లి వరప్రసాద రావు,
అనంతరం గ్రామంలోని తుఫాన్ ప్రభావం వల్ల వంద ఎకరాల పైన నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి ప్రభుత్వం ద్వారా గ్రామ రైతులకు నష్టపరిహారాన్ని అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా గూడూరు రూరల్ పరిధిలోని విందూరు నుండి చెన్నూరు కి వెళ్ళు రోడ్డు మార్గం తుఫాన్ ప్రభావం వలన దాదాపు 400 మీటర్లు వరకు రోడ్డు వరద ప్రవాహాన్ని కి తెగి పోవడంతో ఇరిగేషన్ అధికారులతో కలిసి శాసనసభ్యులు డాక్టర్ వెలగపల్లి వరప్రసాద పరిశీలించారుఅనంతరం గ్రామంలోని తుఫాన్ ప్రభావం వల్ల వంద ఎకరాల పైన నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన ప్రభుత్వం ద్వారా గ్రామ రైతుల కోసంనష్టపరిహారాన్ని అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈయన వెంట వైసీపీ నేతలు, ఇరిగేషన్ అధికారులు తదితరులు ఉన్నారు.
మిట్టత్మకూరు : గూడూరు రూరల్ పరిధిలోని మిట్టత్మకూరు గ్రామంలోని నాగుల గుంట చెరువును ఎమ్మెల్యే పరిశీలించారు, అనంతరం గ్రామంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు , గ్రామంలో ని ప్రజలు తమకు ప్రభుత్వం నుండి ఇస్తున్న రేషన్ బియ్యంను డిల్లర్ షాపుకు వచ్చి ఐదు రోజులు అయినా డిల్లర్లు ఇవ్వడంలేదు అని అడిగితే కరెంటులేదని, సిగ్నల్స్ లేవని ఫింగర్ ప్రింట్ పడడంలేదంటూ (ఎలక్ట్రికల్ మిషన్లు పనిచేయడం లేదు అని) దాని వలన ఇవ్వలేక పోతునము అంటున్నారు వారు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు, తుఫాన్ ప్రభావంతో గ్రామంలోని గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నాం అని తెలుపగా వెంటనే జిల్లా కలెక్టర్ తో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి మ్యాన్యువల్ గా ఐనా వరద ప్రభావం ఉన్న గ్రామంలోని గ్రామస్థులకు రేషన్ బియ్యం ఇవ్వాలని కోరగా,వెంటనే స్పందించిన కలెక్టర్ గ్రామంలోని ప్రజలకు మ్యాన్యువల్ గా రేషన్ బియ్యం ఇస్తామని ఫోన్ లో చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే వెంట వైస్సార్సీపి పార్టీ నాయకులు రైతులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు..,
రామలింగపురం: గూడూరు రూరల్ పరిధిలోని రామలింగాపురం తుఫాన్ ప్రభావం వలన గ్రామంలోని ప్రాథమిక పాఠశాల పూర్తిగా శిధిలావస్థకు గురికాగా శాసనసభ్యులు డాక్టర్ వెలగపల్లి వరప్రసాద రావు పరిశీలించారు,నాడు - నేడు పథకం కింద పాఠశాల మరమ్మతులకు నిధులను మంజూరు చేపిస్తాను గ్రామంలోని ప్రజలకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు, ఎమ్మెల్యే వెంట ప్రభుత్వ అధికారులు వైఎస్సార్సీపీ పార్టీ సీనియర్ నాయకులు మనుబోలు సతీష్ రెడ్డి,కొండూరు సునీల్ రెడ్డి,వెడిచెర్ల బాబు రెడ్డి,జనార్దన్ రెడ్డి, డేగపూడి కృష్ణా రెడ్డి,దామోదర్ రెడ్డి,అట్ల శ్రీనివాస్ రెడ్డి,రమణారెడ్డి, చంద్రారెడ్డి, సుధాకర్ రెడ్డి, చంద్రమోహన్, శ్రీహరి నాయుడు, సుబ్బానాయుడు, నాగిరెడ్డి మరియు గ్రామ రైతులు ఉన్నారు.
తిప్పారపాడు :గూడూరు రూరల్ పరిధిలోని తిప్పరపాడు బేరివాక మడుగును ఎమ్మెల్యే పరిశీలించారు,అనంతరం గ్రామంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే వెంట ప్రభుత్వ అధికారులు వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు మనుబోలు సతీష్ రెడ్డి,మేడనూరు శ్రీనివాసులురెడ్డి, కొండూరు సునీల్ రెడ్డి,డేగపూడి కృష్ణారెడ్డి,కృష్ణయ్య యాదవ్,జనార్దన్ రెడ్డి, వేణు రెడ్డి, పవన్ రెడ్డి, సుధీర్ రెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, సురేష్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, హరి బాబు రెడ్డి, రమణారెడ్డి మరియు గ్రామ రైతులు ఉన్నారు.
నివర్ తుఫాను కారణంగా అతలాకుతలం అయిన నెల్లూరు జిల్లాను వెంటనే ఆదుకోవాలని నెల్లూరు జిల్లా డీసీసీ అధ్యక్షులు చేవూరు.దేవకుమార్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ సంధర్భంగా పత్రికా ప్రకటన విడుదల చేస్తూ...
.జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ప్రజల సహాయయార్ధం సహాయక చర్యలను చేయవలసిందిగా సూచించారు.
.నివర్ కారణంగా పూర్తిగా దెబ్బ తిన్న సుమారు 300 KM ల మేర రోడ్డు మార్గాలను ప్రజల సౌకర్యార్థం వెంటనే మరమ్మతులు చేయాలని ప్రభుత్వానికి అధికారులకు సూచించారు.
.తుఫాను కారణంగా కురిసిన వర్షాలకు దెబ్బ తిన్న సుమారు 150 చెరువులకు పూడికలు,మరమ్మతులు చేసి ప్రజాక్షేమం కోసం సహకటించాలని అధికారులను కోరారు.
.అకాల వర్షాలకు వరద నీరు చేరడంతో జిల్లాలో సుమారు 40 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పండించిన పంటలలు నీట మునిగి నష్టపోయిందని తెలిపారు.
.అంతేగాక తుఫాను ప్రభావంతో పూర్తిగా దెబ్బ తిన్న వరి,చెరుకు తదితర పంటలకు నష్టాన్ని అంచనా వేసి ఎటువంటి మీనమేషాలు లెక్కించకుండా సత్వరమే పంటల నష్ట పరిహారాన్ని పంటలు పండించి నష్టపోయిన రైతులకు అందించి జిల్లా రైతాంగానికి అండగా నిలవాలని ప్రభుత్వాన్ని,సంబంధిత అధికారులను కోరిన చేవూరు.దేవకుమార్ రెడ్డి.
.మరియు వరద నీరు అధిక మొత్తంలో చేరి జిల్లాలో ఉన్న ప్రాజెక్టులపై తీవ్ర ఒత్తిడి పెరిగి ఆందోళనకరంగా ఉన్నాయని ప్రజలకు ఎటువంటి హాని కలగకుండా గేట్లు ఎత్తివేసి ప్రజలను,ప్రాజెక్టులను పాలకులు,శాఖాపరమైన అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు.
వర్షపు నీరు ఎక్కువగా చేరడంతో ఉరకలేస్తున్న పెన్నా నది చూపరులను ఆకర్షించి ఆహ్లాదాన్ని కలిగిస్తుంటే...
పెన్నా నది లోతట్టు పరివాహక ప్రాంతాల ప్రజలకు మాత్రం ఆందోళన కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేసిన చేవూరు.
పెన్నా, సోమశిల సహా నీటి ప్రాజెక్టులపైనా వెంటనే ఒత్తిడి తగ్గించాలి : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
* సాగునీటి రంగ నిపుణుల సూచనలను పాటిస్తూ ఎన్ని క్యూసెక్కులు విడుదల చేయాలో అధికారులకు ఆదేశించిన జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్*
గేట్ల వద్ద ఉన్న ఒత్తిడి పెరిగితే గేటు సహా కొట్టుకుపోయే అవకాశముందని టెక్నికల్ గా వివరించిన మంత్రి మేకపాటి
ముఖ్యమంత్రి నాయకత్వంలో, దేవుడి దయవల్ల నీరు పుష్కలంగా ఉంది
వరుస వర్షాలు, వరదలు, రానున్న తుపానుల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలి
ఎగువ నుంచి వరద ప్రభావం ఉన్న నేపథ్యంలో నీటిని వీలైనంత విడుదల చేయడం ప్రజలకు, ప్రాజెక్టులకు శ్రేయస్కరం
గేట్లపై ఒత్తిడి పడితే చాలా ప్రమాదాన్ని ఊహించలేమని హెచ్చరించిన మంత్రి
వరదలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని మంత్రి మేకపాటి ఆదేశం
పంట నష్టం, దెబ్బతిన్న ఇళ్లు, రోడ్ల మరమ్మతుల విషయంలో యుద్ధప్రాతిపదికన నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించిన మంత్రులు
జిల్లా జాయింట్ కలెక్టర్లు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో నెల్లూరు జిల్లా మంత్రుల అత్యవసర సమావేశం
ఏయే ప్రాజెక్టులో ఎంత నీరుంది, ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను ఆరా తీసిన మంత్రి అనిల్ యాదవ్
గత పదేళ్లలో ఎప్పుడూ నిండని ప్రాజెక్టులు ఉన్నాయి, కొన్నింటికి గండ్లు పడ్డాయని మంత్రులకు వివరించిన ఇరిగేషన్ అధికారులు
కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్లు, ఇరిగేషన్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్లు, విజయ డైరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి,తదితరులు
నెల్లూరు వెంకటేశ్వర పురం భగత్ సింగ్ కాలనీ లో పర్యటించిన అనంతరం మీడియాతో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడారు..
మంత్రి అనిల్: వరదలకు పూర్తిగా దెబ్బతిన్న రహదారులను చెరువులను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నాం ప్రస్తుత వరదల నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపడతాం జిల్లా చరిత్రలోనే ప్రస్తుత వార్తలు రెండో అత్యధికంగా చెబుతున్నారు.. మూడున్నర లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది నెల్లూరు పెన్నా బ్యారేజి నుంచి వెంకటేశ్వరపురం జాతీయ రహదారి బ్రిడ్జి వరకు ప్రజలు ఇక నుంచి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రెండు పక్కల బండ్స్ వేసి అత్యాధునిక నిర్మాణం చేపడతాం.. అందుకు అంచనాలు కూడా తయారవుతున్నాయి ఎనిమిది లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వరకు ఇది తట్టుకుంటుంది ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ నిర్మాణంలో కొన్ని ఇల్లు తొలగించాల్సి వచ్చిన స్థానికులు సహకరించండి వారికి పక్కన ప్రాంతంలో ఇళ్లు కేటాయిస్తాం. వరద ప్రవాహం లో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం... అలాగే వద్ద నీటి ప్రవాహం ఇబ్బందులు పడుతున్న ప్రజలు కు సంబంధించి కూడా సహాయం చేస్తాం
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి : సోదరుడు మంత్రి అనిల్ కుమార్ యాదవ్, తాను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పరిస్థితి ని తీసుకువెళ్లి తప్పకుండా న్యాయం చేస్తాం ప్రస్తుత పరిస్థితుల నుంచి చాలా నేర్చుకున్నామని భవిష్యత్తులో వరద నీటిని ఎలా ఎదుర్కోవాలో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు నివర్ తుఫాన్ వల్ల వ్యవసాయరంగానికి తీవ్ర నష్టం కలిగిందని వీరందరికీ ఆదుకుంటామన్నారు..
పేర్ని నానిపై హత్యాయత్నం.. మంత్రిపై తాపీతో దాడి చేసిన ఆగంతకుడు.. షాకైన పోలీసు యంత్రాంగం
ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం చేశారు దుండగుడు. మచిలీపట్నంలో ఆయన నివాసం వద్ద గుర్తు తెలియని వ్యకి తాపీతో దాడి చేశాడు. మంత్రి నాని తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వెంటనే నిందితుడిని పట్టుకున్న అనుచరులు..పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ దాడిలో మంత్రి చొక్కా పూర్తిగా చినిగిపోయింది.