మోకాల్లోతు నీళ్ళల్లో పరిస్థితులు పర్యవేక్షిస్తున్న జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి.....తడ మండలం పారిజాత పంచాయతీ పాముల మిట్ట వద్ద ప్రమాదకరంగా చెరువు ఉండటంతో మోకాలు లోతు నెలల్లోనే వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, తడ మండలం తహసిల్దార్ శివయ్య , ఇరిగేషన్ శాఖ
విక్రమ సింహపురి యూనివర్సిటీ ఆచార్యుడిపై కమిటీ వేసి విచారణకు ఏబీవీపీ డిమాండ్
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నెల్లూరు నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక శివాజీ భవన్ లో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు . విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి చెందిన ఒక ఆచార్యుడు ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక ఆచార్యుని రాసిన పరిశోధనా వ్యాసాన్ని తన పేరిట జర్నల్లో ప్రచురించుకోవడం జరిగిందని దీనిపై నిజ నిర్ధారణ కమిటీ వేసి విచారణ చేయాలని ఏబీవీపీ యూనివర్సిటీ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తుంది.
ఈ సందర్భంగా జిల్లా సంఘటన కార్యదర్శి నాగేష్ మాట్లాడుతూ యూనివర్సిటీలోని ఒక ప్రొఫెసర్ పై వచ్చిన ఆరోపణల పై పూర్తిస్థాయిలో కమిటీ వేసి అతని పై యూజీసీ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
యూనివర్సిటీ పరిధిలో విద్యాప్రమాణాలు పెంచే విధంగా ఉండాలి కానీ దిగజారుడు విధంగా ఉండకూడదన్నారు. భవిష్యత్తుకు పరిశోధన ప్రమాణాలు అందించే విధంగా ఆదర్శంగా ఉండాలి కానీ దొంగ పరిశోధనలను ప్రచురించికొనే విధంగా ఉండకూడదన్నారు. ఈ విషయం 2019 లో ఉత్తరప్రదేశ్ వాసి అప్పటి రిజిస్టర్ అంజని ప్రసాద్ గారికి మెయిల్ ద్వారా తెలియజేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినప్పటికీ, యూనివర్సిటీ యాజమాన్యం ఒక సంవత్సరం గడుస్తున్నా ప్రొఫెసర్ పైన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం సిగ్గుచేటన్నారు.
ఈ విషయాన్ని కప్పిపుచ్చి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేకుండా ఉంచడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా యూనివర్సిటీ యాజమాన్యం స్పందించి కమిటీ వేసి విచారణ జరిపించి అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. విచారణ చేయని యెడల ఈ విషయంపై ఉన్నత విద్యా మండలి దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి జయంత్, సహాయ కార్యదర్శి సాయికృష్ణ , శ్రీను తదితరులు పాల్గొన్నారు.
కనుపూరు కాలువకు గండి...
పరిస్థితిని పరిశీలించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
నివర్ తుఫాన్ కారణంగా రూరల్ నియోజకవర్గ పరిధిలోని సౌత్ మోపూరు గ్రామం లో కనుపూరు కాలువ గండి పడిన విషయం తెలుసుకొని వెంటనే ఇరిగేషన్ అధికారులతో కలిసి అక్కడికి చేరుకున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్చార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
🔹 గ్రామస్తులు ఎవరూ ఆందోళన చెందవద్దని. యుద్ధ ప్రాతిపదికన అధికారులు వెంటనే గండి పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
హుటా హుటీనా చేరుకున్న జిల్లా కలెక్టర్
దగదర్తి మండలం లింగాలపాడు చెరువు కు గండి పడి ప్రవాహం గ్రామంలోకి రావడంతో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర బాబు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. చెరువు కళుజు ఉద్ధృతంగా ప్రవహిస్తూ నిర్భయ మార్గం లేకపోవడంతో చెరువు కోతకు గురై నీటి ప్రవాహం గ్రామం లోకి రావడం జరిగిందని, వెంటనే గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రొక్లైన్ సహాయంతో రోడ్డు కట్ చేసి వరద నీరు పోయేలా ఏర్పాట్లు చేపట్టినట్లు ఇరిగేషన్ అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు. మండలంలో ఉన్న చెరువుల అన్నిటి పరిస్థితిని అడిగి తెలుసుకొని ఇసుక బస్తాలతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. అధికారులు అందరూ మండల కేంద్రంలో ఉండి తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని, …అలాగే ప్రజలకు ఇబ్బంది లేకుండా సహాయక చర్యలను వేగవంతంగా చేపట్టాలని తెలియజేశారు.
ఈ పర్యటనలో మండల ప్రత్యేక అధికారి శ్రీ వెంకటయ్య, ఎం.పి.డి.ఓ శ్రీ కళాధర రావు, ఎం.ఈ. ఓ శ్రీ భాస్కర్, ఇరిగేషన్ ఎ. ఇ. హరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
లోతట్టు ప్రాంతాలపై దృష్టి సారించండి
- వైసీపీ ఇన్ చార్జ్ లు రాత్రికి ప్రజల దగ్గరే ఉండాలి
- మంత్రి అనిల్ కుమార్ యాదవ్
నివర్ తుఫాన్ ప్రభావం వల్ల నెల్లూరు జిల్లాలో ఎటువంటి ప్రాణ ,ఆస్తి నష్టాలు సంభవించ కుండా జిల్లా అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు... ఎటువంటి అవసరం వచ్చినా తనకు ఫోన్ చేయాలని రాత్రంతా తాను అందుబాటులో ఉంటానని ప్రకటించారు... విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ఆయన ఇరిగేషన్ అధికారులతో అట్టహాసంగా సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమశిల డ్యామ్ లో ఉన్న నీటి నిల్వలను అడిగి తెలుసుకున్నారు... సోమశిల జలాశయం నుంచి పెన్నానదిలో కి లక్ష 16 వేల క్యూసెక్యులను పైగా నీటిని విడుదల చేస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే తుఫాను పునరావాస కేంద్రాలకు తరలించారు అని మంత్రి ఆదేశించారు ఇందుకు సంబంధించి నెల్లూరు నగరంలో మరిన్ని పునరా వాస కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.జిల్లా అధికార యంత్రాంగం తో పాటు నెల్లూరులో వైఎస్సార్సీపీ ఇంఛార్జి లందరు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.... అధికారులకు వైసీపీ ఇన్ చార్జ్ లకు ఎటువంటి అవసరం వచ్చినా తనకు ఫోన్ చేయాలని సూచించారు..రేపు కేబినెట్ సమావేశం ఉందని అందుకనే నెల్లూరుకు రాలేకపోయానని వివరించారు... నెల్లూరు జిల్లా పరిస్థితి పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అందుబాటులోనే ఉన్నానన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగానికి ఆయన పలు సూచనలు జారీచేశారు... ఎక్కడైనా అత్యవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బలగాలను వినియోగించుకోవాలన్నారు.. ఈ సమీక్షా సమావేశంలో తెలుగు గంగ చీఫ్ ఇంజనీర్ హరి నారాయణ రెడ్డి సోమశిల ఎస్ఈ కృష్ణా రావు తో పలువురు అధికారులు పాల్గొన్నారు