ప్రభుత్వ నిబంధనల ప్రకారం దీపావళి జరుపుకోవాలి - కోట ఎస్సై బి బి మహేంద్ర నాయక్
November 12, 2020
The AP government has Issued orders allowing the use of postage for only two hours. Fort Essay B B Mahendra Nayak reveals that he has instructed to shoot tapas only from 8 pm to 10 pm
కరోనా సమయంలో దీపావళి సంబరాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేవలం రెండు గంటల పాటు మాత్రమే టపాసుల వినియోగంకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని సూచనలు చేసింది అనీ కోట ఎస్సై బి బి మహేంద్ర నాయక్ వెల్లడించారు.*
గురువారం కోట పోలీసు స్టేషన్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఎస్సై మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరోనా బాధితులను దృష్టిలో పెట్టుకొని ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అన్నారు, టపాసుల అమ్మకాలపై కూడా కొన్ని నిషేధ ఆజ్ఞలు జారీ చేసింది. కేవలం కాలుష్యరహిత టపాసులు మాత్రమే అమ్మకాలు జరపాలని ఆదేశించింది. ప్రతి షాపుకి మధ్య 10 అడుగుల దూరం ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. షాపుల వద్ద కొనుగోలు దారుల మధ్య ఖచ్చితంగా 6 అడుగులు దూరం పాటించాలని సూచించింది. దీపావళి సామగ్రి అమ్మే షాపుల వద్ద శానిటైజర్ వాడొద్దని ప్రభుత్వం సూచించింది అనీ వెల్లడించారు.
ఈ ఏడాది దీపావళి పండుగకు సంబంధించి కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ పండుగ జరుపుకోవాలని టపాసులు తయారుచేసే వారికి ఎలాంటి అనుమతులూ ఇవ్వడం లేదని గూడూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి, వాకాడు సి ఐ నరసింహరావు ఆదేశాలు జారీచేశారు అనీ తెలిపారు.
నవంబర్ 14 వ తేదీన దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాంఅన్నారు,పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా సేఫ్ అండ్ క్లీన్ దీపావళిజరుపుకోవాలని గూడూరు డిఎస్పీ ఆదేశాలు మేరకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు.
కెమికల్స్, క్రాకర్స్ వాడకుండా,పర్యావరణహితంగా పండుగ జరుపుకోవాలని కోరారు
పండుగరోజున దీపాలను వెలిగించాలని, అదే విధంగా ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉంటూపండుగజరుపుకోవాలన్నారు.కోవిడ్-19వలనప్రపంచంలోనూ,మనదేశంలో,రాష్ట్రంలోఅనేకకుటుంబాలు ఎన్నోఇబ్బందులుఎదుర్కొన్నారని, కొందరు తమ కుటుంబసభ్యులనుకూడాకోల్పోయారని.., అలాంటి కఠినమైన పరిస్థితుల్లో ఈ పండుగనుమనంజరువుకుంటున్నామన్నారు,కోట మండల ప్రజలందరికీ మరోసారి దీపావళి శుభాకాంక్షలు ఎస్సై బి బి మహేంద్ర నాయక్ తెలిపారు.