*నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి..*
జిల్లాలో ఎడగారు సీజన్ లో రైతులు భారీగా నష్టపోయారు..
కొందరు వైసీపీ నాయకులు, దళారులు నిర్వాకంతో రైతులకు ఈ పరిస్థితి ఏర్పడింది..
మద్దతు ధర రూ.15,700 అయినప్పటికీ రైతులు తాము పండించిన ధాన్యాన్ని పుట్టి రూ.7 వేలు నుంచి రూ.10 వేలు లోపునే అమ్ముకోవాల్సివచ్చింది..
మద్దతు ధరకు ప్రభుత్వానికి అమ్ముకున్న రైతుల వద్ద కూడా పుట్టికి 300 కిలోల వరకు అదనంగా తీసుకున్నారు..
నెల్లూరు జిల్లా చరిత్రలో తొలిసారిగా పుట్టికి అర్ధం మార్చేశారు..
3 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని గొప్పలు చెబుతున్నారు...అందులో అధిక శాతం దళారులు, అధికార పార్టీ చోటా నాయకులు చేతులు మార్చారు...ఈ అక్రమాల వెనుక ఓ ఎమ్మెల్యే హస్తం కచ్చితంగా ఉంది..
నెల్లూరు జిల్లాలో మొదటి సారిగా వడ్ల దొంగలు తయారయ్యారు..
రైతులకు పెట్టుబడి పెరిగిపోయింది...దిగుబడి తగ్గిపోయింది...ధర మరీ ఘోరంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు ఎకరాకు రూ.15 వేలు నష్టపరిహారం చెల్లించాలని మేం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నాం..
రైతులను ఆదుకోవాలని కోరుతూ సీఎంకు లేఖ రాశాను..అక్రమాలపై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ ను కోరాం..
ఎక్కువ మంది ఎమ్మెల్యేలు సంపాదనలో బిజీగా ఉన్నారు...రైతులను పట్టించుకునే పరిస్థితిలో వారు లేరు..
ఈ క్రమంలోనే జిల్లాకు వచ్చిన ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి, ఇన్ చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా చర్చించి జరిగిందంతా తెలుసుకున్నారు..కానీ రైతులకు భరోసా ఇవ్వకపోగా నన్ను విమర్శించి వెళ్లారు..
సీబీఐ విచారణకు సిద్ధమా అని డబుల్ డిగ్రీ ఎమ్మెల్యే అంటున్నారు..
సీబీఐ విచారణ జరగాలంటే హైకోర్టో, సుప్రీం కోర్టో ఆదేశాలించాలి..లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కోరాలి..
సీబీఐ కాదు..ఎఫ్.బీ.ఐ విచారణ అయినా జరిపించండి..మాకెలాంటి అభ్యంతరం లేదు..
కనీసం విజిలెన్స్ డీజీతో కానీ, సీబీసీఐడీ ఎంక్వయిరీ వేసినా బండారం బయటపడిపోతుంది..
ప్రభుత్వం రైతులను దళారులు, రైసుమిల్లర్ల చేతికి అప్పగించేస్తోంది..
ఇప్పుడు కానీ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులోనూ పుట్టికి 1150 కిలోల వరకు తీసుకునే ప్రమాదముంది..
రైతు ప్రభుత్వమని చెప్పుకునే సీఎం జగన్మోహన్ రెడ్డి సర్కారు ఇప్పటికైనా అన్నదాతలను ఆదుకోవాలి..