కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో జిజిహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ రెడ్డి అద్భుతమైన సేవలందించారని జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రశంసించారు... నెల్లూరు నగరంలోని జిజిహెచ్ కలాం సెమినార్ హాల్లో సూపరి టెండెంట్ సుధాకర్ రెడ్త్ ఉద్యోగ విరమణ కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా బాధితులకు సేవలందించడంలో సుధాకర్ రెడ్డి తన వంతు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు .. జిజిహెచ్ వైద్యులు , సిబ్బందిని ఒక్కతాటిపై నడిపించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలందించి జిల్లాను నెంబర్ వన్ స్థానానికి తీసుకు రావడంలో సుధాకర్ రెడ్డి పాత్ర కూడా ఉందన్నారు.. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ సర్వసాధారణమని, ఆయన శేష జీవితం సాఫీగా జరిగి పోవాలని ఆకాంక్షించారు... ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ రాజ్యలక్ష్మి, చైర్మన్ లక్ష్మి సునంద, పలువురు డాక్టర్ల పాల్గొన్నారు*
నెల్లూరు ఆర్టిసీ బస్టాండ్ వద్ద ప్రమాదం..... తిరుపతి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఇద్దరు మహిళలను ఢీకొట్టింది... ఈ ప్రమాదంలో ఒక మహిళ పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో హుటా హుటీనా నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు... స్థానిక ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.. గాయపడిన మహిళల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది*