నెల్లూరు రూరల్ నియోజకవర్గం 25వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ మిట్ట ఈ ప్రాంతంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కార్యాలయ ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు నగర కమిషనర్ దినేష్ కుమార్ లు శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ రహదారులతో పాటు మౌలిక వసతులను పరిశీలించారు.. రూరల్ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీ మిట్ట ప్రాంతంలో అత్యధికంగా రోజువారి కూలి పనులు చేసుకునే కార్మికులు, పేద ప్రజలు జీవనం సాగిస్తున్నారన్నారు.. ఈ ప్రాంతం ఏర్పడి 10 సంవత్సరాలు గడుస్తున్న ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదన్నారు. అందుకనే ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు .నెల్లూరు నగర కార్పొరేషన్ కమిషనర్ కు ఈ ప్రాంత సమస్యలను ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేసామన్నారు... 25 వ డివిజన్ అభివృద్ధికి ఎక్కువ నిధులు కేటాయిస్తామని కోటం రెడ్డి పేర్కొన్నారు... రూరల్ లోని అన్ని ప్రాంతాల పై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి డివిజన్ ను ప్రస్తావించినప్పుడు 24వ డివిజన్ గా పేర్కొనడం గమనార్హం... తిరిగి ఆయన 25 వ డివిజన్ గా గుర్తించి మీడియా ప్రతినిధులతో మాట్లాడేటప్పుడు సరిచేశారు*
అబుదాబి వేదికగా గతరాత్రి బెంగళూరుతో తలపడిన మ్యాచ్‌లో ముంబయి బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్(79*) చెలరేగడంతో ఆ జట్టు సునాయాస విజయం సాధించింది. దాంతో ఈ సీజన్లో ప్లేఆఫ్స్‌కు చేరిన తొలి టీమ్‌గా ముంబయి నిలిచింది. ఈ నేపథ్యంలోనే ముంబయి ఇన్నింగ్స్‌లో 13వ ఓవర్ పూర్తికాగానే బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. సూర్యకుమార్ వద్దకెళ్లి స్లెడ్జింగ్ చేశాడని సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్‌గా మారింది.
డేల్ స్టెయిన్ వేసిన 13వ ఓవర్లో ఒక లెగ్‌బైస్ రావడంతో పాటు సూర్యకుమార్ మూడు ఫోర్లు కొట్టాడు. దాంతో అతడు 40 పరుగులకు చేరుకొని ప్రమాదకరంగా మారుతున్నాడు. అప్పటికి ముంబయి స్కోర్ 99/3. బెంగళూరుకు కూడా విజయావకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కోహ్లీకి కోపం వచ్చి సూర్య వద్దకు వెళ్లాడు.
అప్పుడే ముంబయి బ్యాట్స్‌మన్ బెంగళూరు కెప్టెన్‌ను పట్టించుకోకుండా పక్కకు తప్పుకున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. కోహ్లీ స్లెడ్జింగ్ చేశాడని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.