రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు కావలి పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులు మున్సిపల్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు గౌరవ అధ్యక్షులు పి పెంచలయ్య మాట్లాడుతూ గత ఎన్నో సంవత్సరాలుగా పారిశుద్ధ్య కార్మికులు పనులు చేస్తున్నారని ఎన్ని ప్రభుత్వాలు మారినా వీరి కష్టాలు మాత్రం తీరడం లేదని అతి తక్కువ వేతనాలతో ఎక్కువ పనులు చేస్తున్నారని గత ప్రభుత్వం తీసుకువచ్చిన 279 జీవో RTMS విధానం కార్మికులకు పని భారం పెంచే విధంగా ప్రజలపై భారాలు పడే విధంగా ఉండటంతో గత టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పారిశుద్ధ్య కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. 279 జీవో కార్మికులకు ప్రజలకు వ్యతిరేకమైనది ఈ GO ను ఉపసంహరించుకోవాలని పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. ఈ పోరాట ఫలితంగా గత టీడీపీ ప్రభుత్వం ఆ జీవోను అమలు చేయకుండా ఆపివేసింది అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేస్తే ప్రభుత్వానికి అభ్యంతరం ఏమిటిని అసెంబ్లీలో ప్రశ్నించడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు పాదయాత్రల సందర్భంలోనూ ఎన్నికల వాగ్దానాలను నేను అధికారంలోకి వస్తే పారిశుధ్య కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తానని 279 జీవో RTMS విధానాన్ని రద్దు చేస్తానని కార్మికులకు హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 17 నెలలు ప్రభుత్వ పరిపాలనలో పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేసే ఆలోచన చేయకపోవడం చాలా విచారకరమైన విషయం. అంతేకాకుండా పర్మినెంటు చేయకపోగా RTMS విధానాన్ని అమలు చేయాలని చూడటం చాలా దుర్మార్గమైన విషయం ఈ విధానం వలన కార్మికులకు పని భారం పెరగడం తో పాటు ప్రజలపై చెత్త పన్ను నీటి పన్ను ఇంటి పన్నులు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని ముఖ్యంగా కార్మికులకు విపరీతమైన పని భారం పెరిగి కార్మికులు పని చేయ లేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయని కార్మికుల ఐక్యతను దెబ్బ తీసే ప్రమాదం ఉందని కార్మికులను సచివాలయాలకు బదలాయించి కార్మికుల చేత శ్రమదోపిడి చేస్తారని, అధికారులు కూడా ఇప్పటికే తీవ్రమైన ఒత్తిడి తెచ్చి పనులు చేయిస్తున్నారని మేస్త్రి దగ్గరనుండి సచివాలయ కార్యదర్శి, ఇన్స్పెక్టర్, మున్సిపల్ కమిషనర్ గారు కార్మికుల చేత ఒకరు మార్చి ఒకరు అధికారులు పనులు చేయిస్తున్నారని రకరకాల పద్ధతిలో పనులు చెప్పి కార్మికులకు పని భారం పెంచుతున్నారని 60 సంవత్సరాలు నిండిన పారిశుద్ధ్య కార్మికులను ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా ఇంటికి పంపుతున్నారని ఇది చాలా అన్యాయం 60 సంవత్సరాలు పైబడిన కార్మికులను తొలగించాలి అనుకుంటే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 15 లక్షల రూపాయలు డబ్బులు, పెన్షన్ ఏర్పాటు చేసి కార్మికులను తొలగించాలని అప్పటిదాకా తొలగింపును ఆపాలని ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టామని పోరాటాల ద్వారానే మన సమస్యలను పరిష్కరించుకోగలమని అందుకు కు కార్మికులు ఐక్యంగా