అమెరికాలో దారుణం జరిగింది. మూడేళ్ల టెక్సాస్ చిన్నారి తన పుట్టినరోజు వేడుకలో తనకు దొరికిన తుపాకీ ట్రిగ్గర్ నొక్కడంతో ప్రాణాలు కోల్పోయాడు. హూస్టన్ కు ఈశాన్యంగా 25 మైళ్ల (40 కిలోమీటర్లు) పోర్టర్ లో శనివారం ఈ ఘటన జరిగింది. అక్కడ అందరూ కూడా సంతోషంగా వేడుకలు జరుపుకుంటున్నారు. పెద్దలు కార్డులు ఆడుతున్నప్పుడు తుపాకీ కాల్పులు విని చూడగా…
బాలుడి ఛాతీకి తుపాకీ గాయం అయింది. వెంటనే బాలుడ్ని ఆస్పత్రికి తరలించగా ప్రాణాలు కోల్పోయాడు. బంధువుల జేబులోంచి పడిపోయిన పిస్టల్ ను బాలుడు గుర్తించి ఆడుకున్నాడని అప్పుడు ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఈ ఏడాది మొత్తంలో 229 పిల్లలకు తుపాకీ గాయాలు కాగా 97 మంది మరణించారు. యుఎస్ రాజ్యాంగంలోని రెండవ సవరణ ద్వారా తుపాకీలను సొంతం చేసుకునే హక్కు ఉంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... ముందుగా చెప్పినట్లుగానే 'వైయస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్' పథకం రెండో సంవత్సరం, రెండో విడత నిధులను విడుదల చేసింది. ఒక్కో రైతు కుటుంబానికీ... రూ.2000 చొప్పున... వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేసింది. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం సంవత్సరానికి మూడు విడుతల్లో మొత్తం రూ.13,500 చెల్లిస్తూ... ఐదేళ్లలో రూ.67,500 ఇవ్వనుంది. ఈ డబ్బుతో రైతులు విత్తనాలు, పురుగు మందులు కొనుక్కునేందుకు వీలు కానుంది. ఖరీఫ్ సీజన్లో రూ.7500 చొప్పున ఇచ్చిన ప్రభుత్వం... ఆగస్టులో రూ.2000, ఇప్పుడు మరో రూ.2000 చొప్పున ఇచ్చి... మిగతా... రూ.2000ను వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి సమయంలో ఇవ్వనుంది. ఇందుకు సంబంధించి సీఎం క్యాంప్ ఆఫీసులో... సీఎం కిరణ్ కుమార్ రెడ్డి... కంప్యూటర్లో బటన్ నొక్కారు. అంతే... క్షణాల్లో డబ్బు... రైతుల అకౌంట్లలోకి వెళ్లిపోయింది.
అరకోటి మందికిపైగా రైతులకు దాదాపు రూ.6,797 కోట్లను వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ కింద అందిస్తున్నారు. రాష్ట్రంలో కోటి యాభై లక్షల కుటుంబాలు ఉంటే... వాటిలో ప్రతి మూడింటిలో ఒక కుటుంబానికి ఈ పథకం ద్వారా మేలు జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. దేశ చరిత్రలో ఎక్కడా కూడా రైతుకు రూ.13500 ఇచ్చిన దాఖలాలు లేవని వివరించింది.నిజానికి ప్రభుత్వం ఈ పథకం కింద... ప్రతి రైతుకూ ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లు ఇస్తామని వైసీపీ తన మేనిఫెస్టోలో చెప్పింది. అధికారంలోకి వచ్చాక... ఐదేళ్లు ఇవ్వాలని డిసైడైంది. అలాగే... మరో రూ.1000 పెంచి... ఏడాదికి రూ.13500 ఇస్తోంది. రాష్ట్రంలో 50 శాతం మంది రైతులకు కేవలం అర హెక్టారు లోపే భూమి ఉందన్న ప్రభుత్వం 1.25 ఎకరాల్లోపు ఉన్నవారే 50 శాతం రైతులు ఉన్నారని తెలిపింది. అలాగే... 2.5 ఎకరాల్లోపు రైతులు 70 శాతం ఉన్నారని వివరించింది.
రైతు భరోసా రెండో విడత సొమ్ముతోపాటు ఈఏడాది, ఈ సీజన్లో అకాల వర్షాల వల్ల, వరదల వల్ల నష్టపోయిన 1.66 లక్షలమంది రైతులకు రూ.135.73 కోట్లను కూడా వారి ఖాతాల్లోకి కూడా జమచేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబరులో నష్టపోయిన రైతులకు ఇప్పుడు చెల్లిస్తున్నట్లు వివరించింది. అక్టోబరులో జరిగిన పంట నష్టంపై అంచనాలు తయారవుతున్నాయన్న సర్కారు... వారికి నవంబర్లోపే డబ్బు ఇస్తామని హామీ ఇచ్చింది.
కొమరం భీమ్ పాత్రలో ఉన్న ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ అయిన దగ్గర్నుంచి మొదలైంది రచ్చ. కొమరం భీమ్ జయంతి సందర్భంగా.. భీమ్ టీజర్ రిలీజ్ చేసిన జక్కన్న అందులో ఎన్టీఆర్ కు టోపీ పెట్టడంతో గొడవ స్టార్ట్ అయింది. అసలు భీమ్ పాత్రకు ఆయన జయంతి రోజు.. ఆ టోపీ పెట్టాల్సిన అవసరం ఏంటనేది ఇంకో విషయం. కానీ.. జక్కన్న చేసిన పనికి మాత్రం తిట్లు తప్పడం లేదు.
ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూ రావు.. జక్కన్న రిలీజ్ చేసిన త్రిబుల్ టీజర్ పై సీరియస్ గా ఉన్నారు. ఆ టీజర్ డిలీట్ చేయడంతో పాటు.. సినిమాలో కూడా టోపీ ఉన్న సీన్లు ఉండడానికి వీళ్లేదని డిమాండ్ చేశారు. లేదంటే ఆదివాసీలను అవమానించినట్లే అవుతుందని.. దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని.. రాజమౌళిని త్రిబుల్ ఆర్ టీమ్ కి వార్నింగ్ ఇచ్చారు. నిజాంలకు వ్యతిరేకంగా పోరాడిన భీమ్ కు వాళ్ల టోపీ పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇలాగే రిలీజ్ చేస్తే.. ఆదివాసీల ఆగ్రహం తప్పదన్నారు. థియేటర్లలో గొడవ తప్పదు అని సీరియస్ అయ్యారు. మీ కలెక్షన్ల కోసం మా ఆరాధ్య దైవాన్ని కించపరిస్తే సహించేది లేదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు ఎంపీ సోయం బాపూ రావు.