బీదా రవిచంద్ర నివాసానికి చేరుకున్న ఎం ఎస్ రాజు..... నెల్లూరు మాగుంట లేఅవుట్ లోని బీదా రవిచంద్ర నివాసానికి టిడిపి ఎస్సీసెల్ అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు సోమవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన బీద రవిచంద్ర ని శాలువాతో అభినందించారు. నెల్లూరు జిల్లా కు సంబంధించి పలు విషయాలను చర్చించారు ఈ కార్యక్రమంలో టిడిపి ఎస్సీ సెల్ నేతలు జన్ని రమణయ్య, శ్రీపతి బాబు తదితరులు పాల్గొన్నారు...
న్యూఢిల్లీ : బొగ్గు గనుల కేటాయింపు కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు శిక్షలు ఖరారు చేసింది. కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేతో పాటు మరో ఇద్దరు దోషులకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఒక్కొక్కరికి రూ. 10 లక్షల జరిమానా కూడా విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ భరత్ పరాశర్ తీర్పును వెల్లడించారు. 1999లో జార్ఖండ్‌లో బొగ్గు గనుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయి. ఈ నెల 6న మాజీ మంత్రి దిలీప్ రేను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది.
అటల్ బిహారీ వాజ్‌పాయ్ ప్రభుత్వంలో బొగ్గుగనుల సహాయ మంత్రిగా పనిచేసిన దిలీప్‌తోపాటు బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు చెందిన ఉన్నతాధికారులు ప్రదీప్‌కుమార్ బెనర్జీ, నిత్యానంద్ గౌతమ్, క్యాస్ట్రాన్ టెక్నాలజీస్ (సిటిఎల్) డైరెక్టర్ మహేంద్ర కుమార్ అగర్వాలా తదితరులకు కూడా జీవితఖైదు విధించాలని సీబీఐ ఈ నెల 14న కోర్టును కోరిన విషయం తెలిసిందే.
కావలి నియోజకవర్గం కావలి మున్సిపాలిటీ లోని 29వ వార్డు బాపూజీ నగర్ మరియు IDSM ఫ్లాట్స్ తదితర ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా స్థానికులను అడిగి తెలుసుకుంటున్న కావలి ఎమ్మెల్యే శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు.. సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించవలసినది గా అధికారులను ఆదేశించారు..
ఏపీ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ వార్తల్లో నిలిచే నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు చిక్కుల్లో పడ్డారు. ఆయన ఇంటితో పాటు వ్యాపార సంస్థల్లో ఆదాయపన్ను శాఖ(ఐటీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆయన ఇంటితో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏడు ప్రాంతాల్లో ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఈరోజు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఉదయం ఆరు గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో ఆయన వ్యాపారాలకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నాయి. ఇందు, భారత్ సహా పలు కంపెనీల డైరెక్టర్ల నివాసాల్లోనూ ఈ సోదాలు సాగుతున్నట్లు సమాచారం. సాయంత్రం తర్వాత ఐటీ దాడులపై అధికారులు వివరాలు విడుదల చేసే అవకాశముంది. వైసీపీ టికెట్‌పై గెలిచిన రఘురామకృష్ణంరాజు సొంత పార్టీపైనే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. దీంతో వైసీపీ నేతల నుంచి తనకు హాని ఉందని ఆయన కేంద్రాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పించింది.
ఇటీవలే ట్రంప్ కు కరోనా సోకింది. కరోనా బారిన పడిన ట్రంప్ కు వాల్టర్ రీడ్ మిలిటరీ ఆసుపత్రిలో అత్యున్నత చికిత్స అందించారు. నాలుగు రోజులపాటు చికిత్స పొందిన ట్రంప్ తిరిగి వైట్ హౌస్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే, కోలుకున్న తరువాత ట్రంప్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుడి ఆశీర్వాదం వలనే తనకు కరోనా వచ్చిందని, కరోనాకు వైద్యులు అందించే అత్యున్నత చికిత్స గురించి తెలుసుకోగలిగినట్టు ట్రంప్ పేర్కొన్నాడు. తనకు అందించిన అత్యున్నత చికిత్సను దేశంలోని ప్రజలందరికి అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అదీ కూడా ప్రజలకు ఉచితంగా ఈ చికిత్స అందేలా చేస్తామని అన్నారు. ఇది అమెరికన్ ప్రజలకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విశేషం.