విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో అకడమిక్ కన్సల్టెంట్ గా బిజినెస్స్ మేనేజ్మెంట్ స్టడీస్ విభాగము లో పనిచేస్తున్న డాక్టర్ టి విజయ్ కుమార్ ప్రమాదపు సాతు రోడ్డు ప్రమాదం లో దుర్మరణం చెందారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రొక్కం సుదర్శన రావు గారు రెక్టర్ ఆచార్య ఎం. చంద్రయ్య గారు, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయ కృష్ణ రెడీ, ప్రిన్సిపాల్ ఆచార్య సుజ ఎస్ నాయర్ మరియు ఇతర అధ్యాపకులు సిబ్బంది నివాళులర్పించారు అనంతరం విశ్వవిద్యాలయనికి తాను చేసిన సేవలను గుర్తు తెచ్చుకున్నారు. అందేవిధంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, మడమనూరు గ్రామ పంచాయతీ పరిధిలో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేసి, గ్రామ సచివాలయంలో అధికారులతో సమీక్షించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల కాలంలోనే మడమనూరు గ్రామ సచివాలయ పరిధిలో 4 కోట్ల 30 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయడం జరిగింది.
గ్రామాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.
జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీను నెరవేరుస్తున్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లను నేరుగా ఇంటికే చేర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది.
జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చంద్రబాబు కోర్టు ల ద్వారా అడ్డుకునే పరిస్థితి
ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన అన్నింటినీ అధిగమించి అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్ల పట్టాలను వారి పేరిట రిజిస్టర్డ్ చేసి ఇస్తాము.
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది.
గ్రామాలలోని ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుంది.
గ్రామాల్లో కూడా ప్రజలతో సమీక్ష నిర్వహించి, వారి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది.
సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మీ ఇంటి బిడ్డలగా, మీకు ఎల్లవేళలా అండగా ఉంటాను.
మమ్మల్ని ఎన్నైనా తిట్టుకోండి..కనీసం రైతుల కష్టాలు తీర్చండి..ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకోని మీరు సిగ్గుతో తలదించుకోవాలి..
నెల్లూరు నగరంలోని దర్గామిట్టలోని St. Josephs E.M. high school లోని గ్రామ,వార్డు సెక్రటేరియట్ పరీక్షా కేంద్రాన్ని శుక్రవారం కలెక్టరు కె.వి.ఎన్. చక్రధర్ బాబు తనిఖీ చేశారు. పరీక్ష రాస్తున్న విద్యార్ధులకు అవసరమైన వసతి సదుపాయాలు ఉన్నాయా? లేదా ? అని పరిశీలించారు. పరీక్ష రాస్తున్న విద్యార్ధులతో మాట్లాడారు. అనంతరం రామలింగాపురం 19వ డివిజన్ లోని 19/1 వార్డ్ సెక్రటేరియట్ ని సందర్శించారు. సచివాలయంలోని సిబ్బందితో మాట్లాడి.., అర్హులైన ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు ఇంటికి వెళ్లి అందించాలన్నారు. 19వ వార్డులో కోవిడ్ నివారణ చర్యలను అడిగి తెలుసుకున్నారు. హోం ఇసోలేషణ్ లో ఉన్నవారిని హెల్త్ సెక్రటరీ ప్రతి రోజూ పరిశీలించాలని, పాజిటివ్ వ్యక్తులు బయట తిరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో సచివాలయ వ్యవస్థ ఎంతో చక్కగా పనిచేస్తోందని, గ్రామాలలో, పట్టణాలలోని వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుతున్నాయన్నారు. ప్రజలు అందరూ వారికీ ఎలాంటి ప్రభుత్వ సేవలు అవసరం అయినా, అప్లికేషన్ నింపి ఆ దరఖాస్తును సచివాలయంలో ఇవ్వాలన్నారు. పింఛన్లతో పాటు ఏ విధమైన ప్రభుత్వ సేవలు అవసరం అయినా?
వాలంటీర్లు ఇంటికే వచ్చి అందిస్తారన్నారు త్వరలోనే ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని, ఇల్లు లేని అర్హులైన నిరుపేదలు సచివాలయంలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. వారికీ కూడా లే అవుట్ లో ప్లాట్లు ఇస్తామన్నారు. జిల్లా అధికారులు ప్రతివారం ఐదు సచివాలయాలు సందర్శించి.., ప్రభుత్వ సేవలు ప్రజలకు అందుతున్నాయో లేదో గమనించాలని అదేశించామన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈఓ పి.సుశీల, DSO బాలకృష్ణ సచివాలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
MRPS వ్యవస్ధాపకుడు మందాకృష్ణ మాదిగ ఈనెల 30 వ తేదీన కావలి మండలం సిరిపురంలో జరుగు జిల్లా స్ధాయి MRPS ,అనుబంధ సంఘాల కార్యకర్తల సమీక్ష సమావేశంకు హజరవుతున్నట్లు ఈ సభను జయప్రదం చేయవల్సిందిగా MRPS జిల్లా ఇన్చార్జ్ గొల్లపల్లి శ్రీనివాస మాదిగ తెలియజేసారు. శుక్రవారం స్ధానిక జర్నలిస్ట్ క్లబ్ నందు వారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడుతూ సిరిపురంలో మందాకృష్ణ మాదిగ పొల్గొనే సభా స్ధలంను mef జాతీయ నాయకులు పరుసు రమేష్ మాదిగ ,Mrps రాష్ట్ర ఉపాద్యక్షుడు గోసిపాతల వెంకటేశ్వర్లు మాదిగ ,మండల అద్యక్షుడు అక్కిలగుంట ఏసు మాదిగ ,గ్రామ పెద్దలతో కలసి పరిశీలించటం జరిగిందన్నారు. అలానే ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తామన్న తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు అసంబ్లీలో తీర్మానం చేసి వర్గీకరణకు సహకరించాలన్నారు. మమందాకృష్ణ మాదిగ పాల్గొనే ఈ సభలో డివిజన్ లోని అన్ని మండలాల mrps ,mef,msf,mys,MMS,vhps,నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈకార్యక్రమంలోmrps రాష్ట్ర ఉపాధ్యక్షులు గోసిపాతల వెంకటేశ్వర్లు మాదిగ ,జిల్లా అధికార ప్రతినిధి పందింటి అంబెడ్కర్ మాదిగ, కావలి మండల అద్యక్షులు అక్కిలగుంట ఏసు మాదిగ ,పట్టణ అద్యక్షుడు చేవూరి కిరణ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
అమృత కంఠం మూగబోయింది. గాన గంధర్వుడు, ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మనకిక లేరు. కరోనా సోకడంతో గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలకు గురైన ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 1.04గంటలకు తుదిశ్వాస విడిచారు. తన గానంతో కోట్లాది మంది సంగీత ప్రియుల్ని వీనుల విందు చేసిన సంగీత యోధుడి మరణం యావత్ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఆగస్టు 5న ఎస్పీబీ తనకు కరోనా సోకినట్టు ప్రకటించారు. ఆ తర్వాత చికిత్స నిమిత్తం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి అక్కడే చికిత్స పొందుతున్న బాలు ఆరోగ్యం గతంలో ఓసారి విషమించడంతో ఎక్మో, వెంటిలేటర్ సాయంతో చికిత్స కొనసాగిస్తూ వచ్చారు. అయినా ఫలితం లేకపోయింది.
కొన్ని రోజుల కిందట కరోనా నెగెటివ్ రావడంతో ఎస్పీబీ కోలుకున్నారని, పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తారని అభిమానులంతా భావించారు. బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్ ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యంపై సమాచారం అందిస్తూ వచ్చారు. 'నాన్న ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోంది. ఫిజియో థెరఫీ కొనసాగుతోంది. ద్రవ పదార్థాలు తీసుకుంటున్నారు. ఆస్పత్రి నుంచి బయటపడాలనే ఆతృతతో ఉన్నారు' అంటూ కొద్ది రోజుల కింద ప్రకటించడంతో బాలు క్షేమంగా బయటకొస్తారని, మళ్లీ సంగీతంతో తమను అలరిస్తారని అందరూ సంతోషించారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. తాజాగా మరోసారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఎస్పీబీ కన్నుమూశారు. బాలు మృతి పట్ల యావత్ సినీ, సంగీత ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సంతాపం తెలిపారు. ఒక మహోన్నత గాయకుడిని దేశం కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.
రైతులను ఆదుకునే నాథుడే లేడు అనుకున్న టువంటి కష్టతరం లో రైతులకు పెద్ద ముప్పు ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది.
రైతులు పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే కొత్త చట్టం ద్వారా అది వ్యాపారస్తులకు ఉపయోగపడుతుంది రైతులకు ఏమాత్రం ఉపయోగపడని ములి వెంగయ్య గారు తెలిపారు అలాగే కార్పొరేట్ శక్తులు రైతులతో కుమ్మక్కయి నేను చెప్పిన పంటను పండిస్తే మీకు మేము అధిక వేతనం ఇస్తామని తీరా పంట పండక పంటలో నాణ్యత లేదని రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుందని వారు తెలిపారు.
ఎంత పంట నైనా నిలువ చేసే చట్టం ద్వారా కూడా రైతులకు ఇబ్బందికరమే అని వారు తెలిపారు రైతుల పంటను కొనేటప్పుడు తక్కువ వేతనంతో కొని నిల్వ చేసి అధిక రేట్లకు అమ్ముకోవడానికి అవకాశం ఉందని మౌళి వెంకయ్య గారు తెలిపారు మరొక చట్టం పంపుసెట్లకు మీటర్లు బిగించడం ,ఈ చట్టం ద్వారా రైతుల మెడలో ఉరితాడుబిగించిన అట్లే అని వారు తెలిపారు సహకార బ్యాంకుల ను రద్దు చేసే విషయంపై కూడా రైతులకు నష్టం చేకూరుస్తుందని ములి వెంగయ్య గారు తెలిపారు ఈ ఐదు బిల్లులను ఆమోదించవద్దని రాష్ట్రపతికి మనవి చేసుకుంటున్నా ములి వెంగయ్య గారు తెలిపారు