వినాయక చవితి సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి. రవినాయక్..ఎస్ ఐ ఆత్మకూరు
శనివారం నాడు జరగనున్న వినాయక చవితి పండుగను భక్తులు ఎవరి ఇళ్లల్లో వాళ్లే జరుపుకోవాలని భక్తులకు విజ్ఞప్తి... బహిరంగ ప్రదేశాలలో, దేవాలయాల్లో ప్రత్యేక విగ్రహాలు ఏర్పాటు చేసి వేడుకలు నిర్వహించడం పై ప్రభుత్వం నిషేధించబడింది. ఈ కారణంగా ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి వినాయక చవితి పండుగను సాంప్రదాయబద్ధంగా ఎవరి ఇళ్లలో వాళ్లు నిర్వహించుకోవాలి. ఆత్మకూరు పట్టణం, మండలం లోని పలు ప్రాంతాలలో కరోనా వైరస్ కేసులు అధికంగా ఉన్న దృష్ట్యా వినాయక చవితి పండుగను వేడుకగా నిర్వహించుకునేందుకు నిషేధించబడింది.. ఈ నిబంధనను ఉల్లంఘించిన ఎడల నిర్వాహకుల పై కఠినమైన చర్యలు తీసుకోబడును. కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించగలరని విజ్ఞప్తి...
ఇట్లు
M.రవి నాయక్
సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
ఆత్మకూరు పోలీస్ స్టేషన్
ఇట్లు
M.రవి నాయక్
సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
ఆత్మకూరు పోలీస్ స్టేషన్