నెల్లూరు జిల్లా,సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండల పరిషత్ కార్యాలయంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి
గ్రామాల వారీగా అర్జీలు స్వీకరించి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు అందజేస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కాకాణి.
స్క్రోలింగ్ పాయింట్స్:
👉 జగన్మోహన్ రెడ్డి ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు.
👉అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి పార్టీలకతీతంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అధికారులకు సూచించాము.
👉 బడాబాబులు ఆక్రమించిన ప్రభుత్వ భూములను వారి కబంధహస్తాల నుంచి విడిపించి అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాల రూపంలో పంపిణీ చేస్తాం తప్ప, మరొక ఉద్దేశ్యం లేదు.
👉 పేదవారి అనుభవంలో ఉన్న భూములను విడిచిపెట్టి, బడాబాబుల ఆక్రమణల చెరలో ఉన్న వాటిపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించాం.
👉 పొదలకూరు మండలంలో ఇళ్ల స్థలాల పంపిణీకి లేఅవుట్ల ఎంపిక , మరియు అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యాయి.
👉 పేదలందరికీ ఇళ్లు పథకంలో ఖరీదైన స్థలాలను పేదలకు ఇళ్ల స్థలాలుగా అందజేస్తున్నాం.
👉 గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలకు సంబంధించి, ఇళ్ల స్థలాలు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి.
👉 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలను సేకరించి, ప్రభుత్వ భూములు లేని చోట పట్టా భూములను కొనుగోలు చేసి,లేఅవుట్లు అభివృద్ధి చేసి ఇళ్ల స్థలాలు అందజేస్తున్నాము.
👉 అధికారులు గ్రామాలలో తిరిగి విచారణ చేపట్టి అర్హుల జాబితాను పారదర్శకంగా తయారు చేయాలి.
👉సర్వేపల్లి నియోజకవర్గంలో పేదలకు అందజేసే ప్రభుత్వ పథకాలలో అర్హత కలిగిన వారికి అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదు.