ఆర్టీసీ డ్రైవర్ కు ఆర్ధిక సహాయం
ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు 1 డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న ఎస్ కే ఎం భాషా, అనారోగ్యానికి గురై, మెడికల్ ఫిట్నెస్ లో, అన్ఫిట్ అయినందున మానసిక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఎస్ డబ్ల్యూ ఎఫ్ గురువారం 10 వేల ఆర్థిక సహాయం అందజేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సి ఐ టి యు నాయకులు మూలం రమేష్, కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ గా పని చేస్తూ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎస్ కె ఎం భా షా కు ఎస్ డబ్ల్యూ ఎఫ్ రీజినల్ కమిటీ ఆదేశానుసారం ఆర్థిక సహాయ చేయూత కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. కార్మికుల సమస్యల సాధనకు సి ఐ టి యు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ డబ్ల్యూ ఎఫ్ కార్యదర్శి కె కె మూర్తి, సభ్యులు రమేష్, ఎస్కే గౌస్ భాషా, పి జమీర్ తదితరులు పాల్గొన్నారు.