లాక్ డౌన్ కారణంగా నిత్యావసరవస్తువులు దొరక్క ఇబ్బందిపడుతూ,కూరకాయలరేట్లు అమాంతంగా పెరిగిన నేపథ్యంలో 17వ డివిజన్ సిపిఎం ఆధ్వర్యంలో , 1000కేజీల కూరకాయలను శ్రామికనగర్, అప్పోలో సెంటర్, మదురానగర్ ప్రాంతాలల్లో ఏడురకాల కూరకాయలను ప్రజలకు పంచారు .ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి మూలం రమేష్ గారు , 17డివిజన్ కార్యదర్శి కె. సతీష్ ,నాయకులు చాంద్ బాష, నజీర్ , ప్రసాద్, కర్ణ , మల్లికార్జున, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.