నేదురుమల్లి ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు
"" నేదురుమల్లి ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ ""
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ముట్టడికి లాక్ డౌన్ ప్రకటించడంతో ఇళ్ల కే పరిమితమైన కుటుంబాలను ఆదర్శవంతంగా ఆదుకునేలా ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని వైసీపీ యువ నాయకులు నేదురుమల్లి హరిష్ చంద్రా రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా గురువారం కోట మండలం లోని నెల్లూరు పల్లి కొత్తపాలెం పంచాయతీకి చెందిన కుటుంబాలకు మరియు జరుగుమల్లి లో కుటుంబాలకు నిత్యావసరాలైన కూరగాయలను ఆయన చేతుల మీదగా అందజేయడం జరిగింది.కరోనా నేపథ్యంలో గత కొన్ని రోజులుగా నెల్లూరు పల్లి కొత్తపాలెం పంచాయితీలో ఉన్న పలు గ్రామాల్లో ఉన్న కుటుంబాలకు ఇంటింటికి వెళ్లి వారికి నిత్యావసరాలను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా నేదురుమల్లి హరీష్ చంద్రా రెడ్డి మాట్లాడుతూ తమ పంచాయతీలో ప్రజలు నిత్యావసరాల కొరకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఆలోచనతో ప్రతిరోజూ వారికి సరిపడే నిత్యావసరాలను అందజేస్తున్నామని ఆయన అన్నారు.ఈ కరోనా నేపథ్యంలో భాగంగా లాక్ డౌన్ ముగించేంత వరకు వారికి అవసరమైన నిత్యావసరాలను సకాలంలో అందజేస్తానని ఆయన తెలిపారు. అదేవిధంగా పంచాయతీలో పారిశుద్ధ్య పను లైన డ్రైనేజ్ కాలవలను శుభ్రం చేయడం, చెత్తను తొలగించడం, కాలువల్లో పూడికను తీసివేయడం, బ్లీచింగ్ మరియు ఫాగింగ్ క్లోరినేషన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కట్టా.శంకర్ రెడ్డి,తదితర వైసీపీ నాయకులు,నేదురుమల్లి హరీష్ చంద్రా రెడ్డి అభిమానులు,ప్రజలు ఉన్నారు.