స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓటేసి వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు అడ్డుకట్టవేయలని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు.ఈ రోజు కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యలయములో కోవూరు పట్టణ పార్టీ అధ్యక్షుడు పెనుమల్లి శ్రీహరిరెడ్డి అధ్యక్షతన జరిగిన కోవూరు పట్టణ తెలుగుదేశం పార్టీ సమావేశంలో చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ గత తొమ్మిది నెలల పాలనలో రాష్ట్రం లో అరాచక పాలన కొనసాగుతున్నదని,రాష్ట్రములో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, నవ మాసాల పాలన నవ మోసాల తో నడిచిందని, పేద ప్రజలకు పట్టేడు అన్నం పెడుతున్నఅన్న క్యాంటీన్లు మూసి వేసారని,రేషన్ కార్డులు,పెన్షన్లు తొలిగిస్తున్నారని, పారిశ్రామికవేత్తలను బెదిరించడము తో పెట్టుబడులు వెనక్కి వెళుతున్నాయని ఈ తరుణంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించి వైసీపీ ఆరాసకాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు.ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏలూరు కృష్ణయ్య, పెనుమల్లి శ్రీహరి రెడ్డి,శివుని రమణారెడ్డి, దారా గీత,సూరిశెట్టి శ్రీనివాసులు, యకసిరి వెంకటరమనమ్మ, కలువాయి చెన్నకృష్ణా రెడ్డి, ఇందుపురు మురళీకృష్ణ రెడ్డి, జొన్నదుల రవికుమార్, ఇంటూరు విజయ,ఉయ్యేరు వేణు,వనమ్మ,శేషమ్మ తదితరులు పాల్గొన్నారు