ఫీల్డ్ లో బాగా పని చేసిన వారికి ప్రత్యేక గుర్తింపు - యస్పి
అధికారుల అనుభవాలు మాకు పాఠాలుగా నేర్పారు, మా వంతు సహకరిస్తాం - శిక్షణార్థులు
నాల్గవ బ్యాచ్ లో 168 మంది అభ్యర్ధినులు పాసింగ్ ఔట్
నెల్లూరు, పిబ్రవరి 08 : జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం, చెముడుగుంట నందు నాల్గవ బ్యాచ్ గ్రామ/వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల (మహిళా పోలీసు అధికారుల) 2 వారాల శిక్షణ కార్యక్రమం ఈ రోజుతో విజయవంతంగా ముగిసిన సందర్భంలో జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ శిక్షణార్ధులందరినీ అభినందించారు. ఈ సందర్భంగా యస్పి మాట్లాడుతూ మీకు త్వరలో షెడ్యూల్ ఇవ్వబడుతుందని, దానికి అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని, మహిళలు, వృద్ధులు మరియు బాలలకు రక్షణ భద్రత కల్పించడంలో పాటు వారిపై జరిగే నేరాలను అరికట్టే దిశలో రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షల మేరకు మెరుగైన సేవలందించి జిల్లాకు మంచి
పేరు తీసుకురావాలని తెలిపారు. మహిళా పోలీసు అధికారులు అంతా ఐసిడిఎస్ పోలీసుల పరిధిలోకి వచ్చే సమస్యలు ఫీల్డ్ మీద తిరిగితేనే మీకు పూర్తి అవగాహన వస్తుందని, తద్వారా మీ పరిధిలోని సమస్యకు వెంటనే పరిష్కారం చూపగలరని తెలిపారు. అంతేకాకుండా సెక్రటేరియట్ లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, ప్రతి రోజూ పోలీసు స్టేషన్ లకు ఐసిడిఎస్ లకు వెళుతూ ముందస్తు సమాచారం సేకరించాలని, మీ పరిధిలోని సమస్యలను, మీ అవసరాలను నాకు ఏ సమయంలో అయినా తెలపవచ్చని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని సూచించారు. దిశ చట్టం, సఖ(వోఎస్‌సి) వంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు
చేయాలని సూచించారు. మీరంతా మా చెల్లెల్లు, మీ భద్రత మా భాద్యత అని తెలుపుతూ, సురక్షిత వాతావరణంలో విధులు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, ఇక్కడ నేర్పిన యోగా, కరాటే వంటి శారీరక వ్యాయామం రోజూ అలవాటు చేసుకోవాలని, అంతేకాకుండా తెలివితేటలు పెంచుకోవడానికి మంచి పుస్తకాలు చదవడం, జడ్జిమెంట్ లు, కొత్త చటాలు వంటి వ్యాసాలు చదవాలని ఈ సందర్భంగా యస్పి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని డిటిసి వైస్ ప్రిన్సిపాల్ రవీంద్ర రెడ్డి కో ఆర్డినేట్ చేస్తూ ఈ బ్యాచ్ లో మొత్తం 168 మంది శిక్షణ పూర్తి చేసారని, మీరు సేకరించే ముందస్తు సమాచారం ట్రాన్స్పరెంట్ గా ఉండాలని, అందరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. ఐసిడిఎస్-పిడి సుధా భారతి మాట్లాడుతూ యస్పి మహిళలకు ఇచ్చే సపోర్ట్, చేసే కార్యక్రమాలు మరువలేనివని, మీరు ఇంత ఆనందంగా, భద్రతగా శిక్షణ పూర్తి చేయడానికి
కారణం యస్పి అని, బాగా పని చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం జిల్లా యస్పి టాపర్స్ గా నిలిచిన ఎమ్. సుకన్య, కె.ప్రవీణ, ఈ.నవీన, జి.స్వప్న, టి.అఖిల, జి.సాయి పూజితలకు మెరిట్ సర్టిఫికేట్ లు ఇచ్చి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యస్పితో పాటు డిటిసి వైస్ ప్రిన్సిపల్ రవీంద్ర రెడ్డి, ఐసిఎస్‌ఎస్ పిడి బి.సుధా భారతి , డిటిసి రిజర్వు ఇన్స్పెక్టర్ సురేష్, ఎస్‌ఐ, ఆర్‌ఎస్‌ఐ, ఏఎస్‌ఐ శిక్షణా సిబ్బంది పాల్గొన్నారు.