చేజర్ల, ఫిబ్రవరి 04, (రవికిరణాలు) : చేజర్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ హజరత్ ఖాదర్ వళీ దర్గాను వైసీపీ నాయకులు దర్గా గౌరవ అధ్యక్షులు షేక్. సిరాజుద్దీన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిరాజుద్దీన్ మాట్లాడుతూ గత 90 సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న నాగూర్ వలి దర్గా గంధము సందర్భంగా ఇక్కడ దర్గాలో ప్రత్యాక పూజలు గంధమోహోత్సవాన్ని నిర్వహిచడం ఆనవాయితీ గత కొద్ది సంవత్సరాలుగా దర్గా శిథిలావస్థకు చేరడంతో పూర్తిగా ప్రత్యేక పూజలు గంధమహోత్సవ నిర్వహణ పూర్తి స్థాయిలో జరగలేదు. దర్గా పునరుద్ధరణ కార్యక్రమాన్ని గ్రామపెద్దల కోరిక మేరకు నిర్మాణ కార్యక్రమం చెపెట్టడం జరిగింది. కులమతాలకు అతీతంగా గ్రామంలోని హిందూ సహోదరులు పూర్తి సహకారం తో దర్గా నిర్మాణాన్నీ పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక పూజలు అన్నదానం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి గంధం ఊరేగింపు ఫకీర్ల జరబ్ లతో గంధం దర్గా షరీఫ్ చేరిన పిమ్మట భక్తులకు గందాన్ని పంచడం జరుగుతుందని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనే ఈ కార్యక్రమంలో అన్నివసతులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఈ రోజు అన్నదాతలుగా డాక్టర్ మౌలాలి కుటుంబసభ్యులు సాదిక్ టీచర్ భక్తులకు, గ్రామ ప్రజలకు అన్నదానం ఏర్పాటు చేశారు. దర్గాకు పూల అలంకరణ, లైటింగ్, డెకరేషన్ అంగరంగ
వైభవంగా ముస్తాబు గావించారు.హాజీ ఖాదర్ బాష ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ఖాదర్ వళీ దర్గాను ప్రారంభించినందుకు శుభాకాంక్షలు తెలియచేశారు. గంధమహోత్సవ కార్యక్రమంలో చేజర్ల మండల వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు బూదళ్ల వీరరాఘవరెడ్డి, పూనూరు గంగాధర్ రెడ్డి, వంగవరపు రామకృష్ణారెడ్డి గారు, ఆది పెంచలనరసారెడ్డి, రావి పెంచలరెడ్డి, రావి లక్ష్మినరసారెడ్డి మసీదు కమిటి అధ్యక్షులు షేక్ మస్తాన్ సాహెబ్, ఈ కార్యక్రమంలో షేక్ సుభాని, షేక్ ఖాదర్ బాష(బుడ్డాలు) షేక్ నజీర్, డికె ఫైరోజ్, షేక్ నాయబ్, షేక్ మహ్మదాలీ, మస్తాన్, ఒంటేరు నాగభూషణం, మాదాల జనార్థన్ నాయుడులు పాల్గొన్నారు.