అత్యాచార బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు దిశ చట్టం-2019 చేయడం
జరిగిందని కోట ఐ సీ డీ యస్ ప్రాజెక్టు అధికారిణి శ్రీమతి బీ. హెనా సూజన్ అన్నారు.
చిట్టేడు లో ని హై స్కూల్ లో దిశ చట్టం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ మహిళలకు ఆడపిల్లలకు రక్షణ కల్పించడానికి నం 1 ద్వారా పోలీసు,112 ద్వారా దిశ హెల్ప్ లైన్,181 ద్వారా మహిళా హెల్ప్ లైన్ సహాయం అందిస్తాయి అన్నారు.ఈ విషయాన్ని దిశ మాసం కింద ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను చేపడతామన్నారు. వన్ స్టాప్ సెంటర్ ను దిశ గా మార్చడం జరిగింది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో సి డి పీ ఓ గారు, సూపర్ వైజర్,అంగన్వాడీ కార్యకర్తలు, చిట్టే డు హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు, టీచర్ లు, కిషోరీ బాలికలు,విద్యార్థులు, స్కూల్ చైర్మన్,వైస్ చైర్మన్ లు పాల్గొన్నారు