వైసిపి అభ్యర్థి గురుమూర్తి

అట్టహాసంగా నామినేషన్ 


 వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి నామినేషన్ కార్యక్రమం నెల్లూరులో సోమవారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కీలక  రాష్ట్ర మంత్రులు, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి (నెల్లూరు) వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి (రాజ్యసభ) తరలివచ్చారు. జిల్లా వైసిపి కార్యాలయానికి తరలివచ్చిన వీరంతా ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించారు. అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి కి జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాణి పూలమాలతో స్వాగతించారు. అనంతరం వి ఆర్ సి కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి,  మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాల్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి , కన్నబాబు, ఆళ్ల నాని, పేర్ని నాని, ఆదిమూలపు సురేష్, జిల్లా మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లు హాజరయ్యారు. వీరితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు రామ్ నారాయణ రెడ్డి, (వెంకటగిరి) కిలివేటి సంజీవయ్య, (సూళ్లూరుపేట) వరప్రసాదరావు (గూడూరు)  కాకాణి గోవర్ధన్ రెడ్డి (సర్వేపల్లి), ప్రసన్నకుమార్ రెడ్డి (కోవూరు) కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ( నెల్లూరు రూరల్), రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి (కావలి), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (ఉదయగిరి) హాజరయ్యారు. అలాగే విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, పాముల హరి, శ్రీకాంత్ రెడ్డి, మల్లు సుధాకర్ రెడ్డి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.ఆనంతరం విఆర్సీ నుంచి కలక్టరేట్ వరకు భారీ ర్యాలీ జరిగింది. అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.