కోటమిట్ట లోని S.R.S ఫంక్షన్ హాల్ లో ముస్లిం స్వర్ణకార సంఘం,నెల్లూరు జిల్లా శాఖ అద్వర్యం లో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా వ్యాప్తంగా స్వర్ణకారుల శ్రేయస్సు కోసం కృషి చేసిన వ్యక్తులను నీటిపారుదల శాఖా మాత్యులు అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఆఫీసు ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో ముస్లిం స్వర్ణకార సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఇస్మాయిల్ ఖాదరి, ప్రధాన కార్యదర్శి రసూల్ గౌరవ అధ్యక్షులు కరిముల్లా, కార్యవర్గసభ్యులు దస్తగిరి అహ్మద్, చాంద్ బాషా,సయ్యద్ 42 వ డివిజన్ వైస్సార్సీపీ ఇంచార్జి ఇంతియాజ్  మరియు స్వర్ణకారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కర్నూల్ నుండి జి. అబ్దుల్ షుకూర్, తాడిపత్రి నుండి యూ.జాకీర్ హుస్సేన్, ఆదోని నుండి ఎం.డి. సిద్దిక్,నెల్లూరు నుండి శాంతి కుమార్, ముసవ్వీర్ లకు మంత్రి చేతుల మీదగా సన్మానం జరిగింది.
ఈ సందర్బంగా మంత్రివర్యులు మాట్లాడుతూ...ముస్లిం మైనారిటీలను మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎక్కుగా అభిమానిస్తారని అన్నారు...వైస్సార్సీపీ అధికారంలోకి రావడం ముస్లింల పాత్ర ఘననీయమైనదని అన్నారు..కొంతమంది రాజకీయ నాయకులు నంద్యాల సంఘటన ను రాజకీయం చేయాలని చూస్తున్నారని...ఇలా చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఆ సంఘటనంలో ఆ కుటుంబానికి న్యాయం జరిగే లా చూస్తామని అన్నారు.
 నెల్లూరు లో స్వర్ణకారులు సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు..వారికి సిటీ పరిధి లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తామని అన్నారు