సాంఘిక సంఘసంస్కర్త భారత దేశ మొదటి మహిళ ....

రవికిరణాలు న్యూస్... తిరుపతి జిల్లా... దొరవారిసత్రం మండలం... 

సాంఘిక సంఘసంస్కర్త, భారత దేశ మొదటి మహిళా ఉపాధ్యాయుని, బడుగు బలహీన వర్గ మహిళ ఆశాజ్యోతి శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా జిల్లాస్థాయి మహిళా దినోత్సవం సూళ్లూరుపేటలోని గవర్నమెంట్ హై స్కూల్ లో యుటిఎఫ్ తిరుపతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో యుటిఎఫ్ జిల్లా మహిళా కన్వీనర్ శ్రీమతి కే ఎం ఎస్ సునీల గారి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో . తిరుపతి జిల్లాలోని 35 మండలాల నుండి ప్రతి మండలానికి ఇద్దరు ఉపాధ్యాయులు చొప్పున మొత్తం 70 మంది మహిళ ఉపాధ్యాయులను సన్మానించడం జరిగింది. ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి ఎస్.కె ఫైజున్నీసా గారు పాల్గొన్నారు. ఇంకా యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు శ్రీ పి బాబు రెడ్డి గారు, శ్రీ ఎస్ ఎస్ నాయుడు గారు, శ్రీ సి చంద్రశేఖర్ గారు, శ్రీమతి దేవరాల నిర్మల గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ జి జె రాజశేఖర్ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ ముత్యాల రెడ్డి గారు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాష్ట్ర కౌన్సిలర్లు మరియు తిరుపతి జిల్లా వివిధ మండలాల యూటీఎఫ్ అధ్యక్ష ప్రధానకార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు.