నెల్లూరు: నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ఇన్చార్జి మంత్రి, జిల్లా అధికారులతో జరిగిన  సమీక్షా సమావేశంలో  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ,జిల్లా సమీక్షా సమావేశంలో చర్చించిన విషయాలు పరిష్కారం అయ్యేలా చూడాలి.ప్రతి సమావేశంలో గత సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటే పరిష్కారం ఎప్పుడూ దొరుకుతుంది!.ఇడిమేపల్లి కాలువ గురించి గత సమావేశంలో అడిగినా ఇంత వరకు ముందుకు సాగని పరిస్థితి.మన స్థాయిలో తీసుకోవలసిన నిర్ణయాలు కూడా తీసుకొని రైతులకు న్యాయం చేయలేకపోతే ఈ సమావేశం ఎందుకు!.గతంలో మనం ఇచ్చిన పట్టాలు, రైతుల అనుభవంలో ఉన్న భూములకు కూడా రైతుల పేరుతో రాయలేక పోతున్నాము.దానివల్ల రైతులకు ఈ- క్రాప్ బుకింగ్ లేకుండా పోయింది, రైతు భరోసా అందలేదు, ధాన్యం అమ్ముకోలేక పోతున్నారు,ఇతర సంక్షేమ పథకాలు అందని పరిస్థితి.కమిటీలతో కాలయాపన తప్ప రైతులకు న్యాయం జరగడం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తేమ శాతం కనిపెట్టడానికి మిల్లర్ల వద్ద ఉన్న మీటర్లు, కొనుగోలు కేంద్రాలలో ఉన్న మధ్య తేడా వస్తుందడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.ధాన్యం ఆరబెట్టుకోవడానికి అవకాశం లేని చోట్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలి.గతంలో ధాన్యం కొనుగోలు విషయంలో ఇతర జిల్లాలకు వెళ్లాలని చెప్పడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.అందువల్ల ప్రస్తుతం కొనుగోలు విషయంలో అన్ని సమస్యలను దృష్టిలో పెట్టుకొని, గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకూడదు.గతంలో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను మోసం చేశారు.ఈసారి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉంది.వెంకటాచలంలో రూ-అర్బన్ పధకం కింద మంజూరైన నిధులను పూర్తి స్థాయిలో వాడుకోలేక పోతున్నారు. సకాలంలో అనుమతులిచ్చి, రూ-అర్బన్ పధకం కింద చేపట్టవలసిన అన్ని పనులను పూర్తి చేయండి.పింఛన్ల విషయంలో వివిధ కారణాలతో కొన్ని తొలగిపోయాయి.గతంలో చేసిన సర్వేలను ప్రక్కన పెట్టి, వాస్తవాలను పరిగణలోకి తీసుకొని పింఛన్లు మంజూరు చేయాలి.రేషన్ కార్డుల మంజూరులో కూడా ఎటువంటి గందరగోళం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలి.సాగునీటి విషయంలో అభ్యంతరాలతో రైతులు పంటలు పండించుకోలేక తీవ్ర నష్టపోతున్నారు.రైతులు సొంతంగా కాలువ తవ్వుకుంటామన్నా అటవీ శాఖ అనుమతులు ఎందుకు ఇవ్వలేక పోతున్నారు!.ఇడిమేపల్లి కాలువకు సంబంధించి ఒక్క అడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి వేసే పరిస్థితి.అధికారులు ఈ విధంగా నిర్లక్ష్యంగా చేసి పనులు కాకుండా చేస్తుంటే, రైతుల మధ్య మేము ఏవిధంగా తిరగాలి!.అటవీ శాఖ అధికారులు ఎందుకు కక్ష్య సాధింపు చర్యలు చేస్తున్నారో అర్థం కావడం లేదు!.మైనింగ్ అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ కొందరిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.సకాలంలో ఇసుక అందించలేకపోతే, గ్రామాలలో అభివృద్ధి పనులకు విఘాతం కలుగుతుంది.అధికారులు కథలు చెప్పడం మాని, ఇసుక సమస్యను పరిష్కరించాలి.గ్రామాలలో అభివృద్ధి పనులకు గ్రామస్థులు అవసరాలకు గ్రావెల్ ను వినియోగించుకోనివ్వ కుండా మైనింగ్ అధికారులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.గ్రావెల్ అక్రమార్కుల ఆట కట్టించాలి కానీ వారిని వదిలి,గ్రామస్తులను ఇబ్బందుల పాలు చేయడం సరికాదు.పేదల ఇళ్ల కోసం ఏర్పాటు చేసిన లేఅవుట్ల అభివృద్ధి పనులకు గ్రావెల్ తరలింపు అనుమతుల అధికారం మండల స్థాయి అధికారులకే కట్టబెట్టండి.సమస్యలన్నింటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోలేకపోతే, ఈ సమావేశాలకు అర్ధం ఉండదు అన్నారు.