మహిళా సాధికారతే జగనన్నకే సాధ్యం ఎమ్మెల్యే వైసిపి అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో వైయస్ జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారతే లక్ష్యంగా వారి అభివృద్ధికి బాటలు వేస్తున్నాడని ఇది అక్కా చెల్లెమ్మలు గుర్తుపెట్టుకోవాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు నాయుడుపేట పట్టణంలో కేకే కళ్యాణ మండపం నందు గురువారం వైయస్సార్ చేయూత చెక్కులు మహిళలకు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న పాదయాత్రలో మహిళలు పడుతున్న కష్టాలు ఆర్థిక ఇబ్బందులను గుర్తించి మహిళలకు వైయస్సార్ చేయూత పథకం కింద 45 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 18750 రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు మహిళను ఏ ప్రభుత్వం ఆదుకోకపోగా పొదుపు గ్రూపులు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించుకుపోగా సున్నా వడ్డీ రుణాలను వెనక్కి ఇచ్చిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు 2024లో మళ్లీ వైసీపీని ఆదరిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు మహిళలకు ప్రవేశపెట్టి వారిని ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు.   వైయస్సార్ చేయూత చెక్కుల పంపిణీ నాయుడుపేట లో అర్బన్ రూరల్ పరిధిలో మొత్తం 4360 మంది మహిళల లబ్ధిదారులకు 8 కోట్ల 17 లక్షల 50 వేల చెక్క లు అందజేయడం జరిగింద